Skip to content

Rebekah గురించి బైబిల్ వచనాలు

106 వచనాలు · 9 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు రిబ్కా, ఆమె పరిచారకులు సిద్ధపడి, ఒంటెలు ఎక్కి ఆ మనుష్యునితో పాటు వెళ్లారు. అలా ఆ సేవకుడు రిబ్కాను తీసుకుని వెళ్లాడు.

  2. ఇప్పుడు ఇస్సాకు బెయేర్-లహాయి-రోయి నుండి వచ్చాడు, ఎందుకంటే అతడు దక్షిణాదిలో నివాసముంటున్నాడు.

  3. ఒక రోజు సాయంకాలం అతడు ధ్యానం చేసుకోవడానికి పొలానికి వెళ్లాడు; ఆ సమయంలో ఇస్సాకు తేరిచూడగా, అతనికి ఒంటెలు వస్తున్నట్లు కనిపించాయి.

  4. రిబ్కా తలెత్తి ఇస్సాకును చూసి, ఒంటె మీది నుండి క్రిందికి దిగి,

  5. “మనలను కలవడానికి పొలంలో నుండి వస్తున్న అతడు ఎవరు?” అని ఆ సేవకుని అడిగింది. అందుకతడు, “అతడే నా యజమాని” అని అన్నాడు. ఆమె తన తలమీద ముసుగు వేసుకుంది.

  6. ఆ సేవకుడు జరిగినదంతా ఇస్సాకుకు చెప్పాడు.

  7. ఇస్సాకు తన తల్లియైన శారా గుడారం లోనికి ఆమెను తీసుకెళ్లి, ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఇలా రిబ్కా అతని భార్య అయ్యింది. అతడు ఆమెను ప్రేమించాడు; ఇలా తల్లి మరణం చేత బాధతో ఉన్న ఇస్సాకుకు రిబ్కా ద్వార ఓదార్పు కలిగింది.

  8. ఇస్సాకు పద్దనరాములోని సిరియావాడైన బెతూయేలు కుమార్తె, లాబాను సోదరియైన రిబ్కాను పెళ్ళి చేసుకున్నప్పుడు అతని వయస్సు నలభై సంవత్సరాలు.

  9. రిబ్కాకు సంతానం కలుగలేదు కాబట్టి ఇస్సాకు ఆమె గురించి యెహోవాకు ప్రార్థన చేశాడు, యెహోవా అతని ప్రార్థనకు జవాబిచ్చారు, అతని భార్య రిబ్కా గర్భవతి అయ్యింది.

  10. ఆమె గర్భంలో పిల్లలు ఒకరితో ఒకరు పెనుగులాడారు, అందుకు ఆమె, “నాకెందుకు ఇలా జరుగుతుంది?” అని అంటూ యెహోవాను అడగడానికి వెళ్లింది.

  11. యెహోవా ఆమెతో ఇలా చెప్పారు, “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి, ఈ రెండు జనాంగాలు నీ గర్భం నుండే వేరుగా ఉంటాయి; ఒక జనం మరొక జనం కంటే బలంగా ఉంటారు. పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు.”

  12. ఆమె ప్రసవ కాలం సమీపించినప్పుడు, ఆమె గర్భంలో కవలపిల్లలు ఉన్నారు.

  13. మొదట పుట్టినవాడు ఎర్రగా ఉన్నాడు, అతని శరీరమంతా రోమాల వస్త్రంలా ఉంది; కాబట్టి అతనికి ఏశావు అని పేరు పెట్టారు.

  14. తర్వాత అతని సోదరుడు, అతని మడిమెను పట్టుకుని బయటకు వచ్చాడు, అతనికి యాకోబు అని పేరు పెట్టారు. రిబ్కా వారికి జన్మనిచ్చినప్పుడు ఇస్సాకు వయస్సు అరవై సంవత్సరాలు.

  15. అబ్బాయిలు పెరిగారు, ఏశావు అరణ్యంలో తిరుగుతూ నేర్పుగల వేటగాడయ్యాడు. యాకోబు నెమ్మదస్థుడై గుడారాల్లో నివసించేవాడు.

  16. ఇస్సాకు వేటాడిన మాంసం కోరుకునేవాడు, అతడు ఏశావును ప్రేమించేవాడు, కానీ రిబ్కా యాకోబును ప్రేమించేది.

  17. కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు.

  18. అక్కడి మనుష్యులు అతని భార్యను చూసి ఆమె ఎవరు అని అతన్ని అడిగితే, “ఆమె నా సోదరి” అని చెప్పాడు, ఎందుకంటే, “ఆమె నా భార్య” అని చెప్పడానికి భయపడ్డాడు. “రిబ్కా అందంగా ఉంది కాబట్టి తనను బట్టి ఈ స్థలం యొక్క మనుష్యులు నన్ను చంపేస్తారు” అని అతడు అనుకున్నాడు.

  19. ఇస్సాకు అక్కడ చాలా కాలం ఉన్నాడు, ఒక రోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరసాలాడడం చూశాడు.

  20. కాబట్టి అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, “నిజంగా ఈమె నీ భార్య కదా! ‘ఆమె నా సోదరి’ అని ఎందుకు చెప్పావు?” అని అడిగాడు. ఇస్సాకు, “ఆమె కారణంగా నా ప్రాణం పోతుందేమో అని అనుకున్నాను” అని జవాబిచ్చాడు.

  21. అప్పుడు అబీమెలెకు, “నీవు మా పట్ల చేసినదేంటి? ఈ మనుష్యుల్లో ఎవరైనా ఆమెతో శయనించి ఉండేవారు. అప్పుడు నీవు మాపైన అపరాధం తెచ్చిపెట్టేవాడివి” అని అన్నాడు.

  22. అప్పుడు అబీమెలెకు ప్రజలందరికి ఆదేశించాడు: “ఎవరైనా ఈ మనుష్యునికి లేదా అతని భార్యకు హాని చేస్తే, వారికి మరణశిక్ష విధించబడును.”

  23. ఏశావు నలభై సంవత్సరాల వయస్సులో, హిత్తీయుడైన బెయేరి కుమార్తె యహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమార్తె బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు.

  24. ఈ ఇద్దరు ఇస్సాకు రిబ్కాల దుఃఖానికి కారకులయ్యారు.

  25. అయితే ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో మాట్లాడుతున్నప్పుడు రిబ్కా విన్నది. ఏశావు వేటాడేందుకు బహిరంగ పొలానికి వెళ్లిపోయాక,