- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Rebekah గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
రిబ్కా తన కుమారుడైన యాకోబుతో, “ఇదిగో, నీ తండ్రి నీ అన్న ఏశావుతో చెప్పడం నేను విన్నాను,
‘నేను చనిపోకముందు దానిని తిని యెహోవా సన్నిధిలో నిన్ను దీవిస్తాను’ అందుకు నీవు నా కోసం వేటాడి మాంసం తెచ్చి రుచికరమైన భోజనం సిద్ధం చేసి తీసుకురా అని చెప్పాడు.
కాబట్టి నా కుమారుడా! నా మాట జాగ్రతగా విని, నేను చెప్పినట్టు చేయి:
మన మందలో నుండి రెండు మంచి మేక పిల్లలను తీసుకురా, నేను నీ తండ్రికి ఇష్టమైన భోజనం వండి పెడతాను.
అప్పుడు నీ తండ్రి తినడానికి దానిని తీసుకెళ్లు, అప్పుడు అతడు చనిపోకముందు నిన్ను దీవిస్తాడు” అని చెప్పింది.
యాకోబు తన తల్లి రిబ్కాతో, “నా అన్న ఏశావు వెంట్రుకలు గలవాడు, నాకు నునుపైన చర్మం ఉంది.
ఒకవేళ నా తండ్రి నన్ను తాకిచూస్తే ఎలా? అతన్ని మోసం చేసినవాడనై, నా మీదికి ఆశీర్వాదానికి బదులు శాపం తెచ్చుకున్నవాన్ని అవుతాను” అని అన్నాడు.
అతని తల్లి అతనితో, “నా కుమారుడా, ఆ శాపం నా మీదికే రానివ్వు. కేవలం నేను చెప్పింది చేయి; వెళ్లి వాటిని నా కోసం తీసుకురా” అని చెప్పింది.
కాబట్టి అతడు వెళ్లి వాటిని తన తల్లి దగ్గరకు తెచ్చాడు, ఆమె అతని తండ్రికి ఇష్టమైన భోజనం వండింది.
తర్వాత రిబ్కా ఇంట్లో ఉన్న తన పెద్దకుమారుడైన ఏశావు యొక్క శ్రేష్ఠమైన బట్టలు తీసుకుని తన చిన్న కుమారుడైన యాకోబుకు తొడిగించింది.
ఆమె అతని చేతులను, మెడ దగ్గర ఉండే నునుపైన భాగాలను మేక చర్మంతో కప్పింది.
తర్వాత తాను చేసిన రుచిగల భోజనాన్ని, రొట్టెలను యాకోబు చేతికి ఇచ్చింది.
యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, “నా తండ్రి” అని పిలిచాడు. “నా కుమారుడా, నీవెవరివి?” అని అతడు అడిగాడు.
యాకోబు తన తండ్రితో, “నేను నీ మొదటి కుమారుడనైన ఏశావును, నీవు చెప్పిన ప్రకారం నేను చేశాను. నన్ను ఆశీర్వదించడానికి లేచి, నేను చేసింది తిను” అని అన్నాడు.
ఇస్సాకు తన కుమారున్ని, “నా కుమారుడా, ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది?” అని అడిగాడు. యాకోబు, “నీ దేవుడైన యెహోవా నా దగ్గరకు దానిని తీసుకువచ్చారు” అని జవాబిచ్చాడు.
అప్పుడు ఇస్సాకు యాకోబుతో, “నా కుమారుడా, నా దగ్గరకు రా, నేను నిన్ను ముట్టుకొని, నీవు నిజంగా ఏశావువో కాదో తెలుసుకుంటాను” అని అన్నాడు.
యాకోబు తండ్రి దగ్గరకు వెళ్లగా, ఇస్సాకు అతన్ని తాకిచూసి, “స్వరం యాకోబు స్వరంలా ఉంది, కాని చేతులు ఏశావులా ఉన్నాయి” అని అన్నాడు.
యాకోబు చేతులు తన అన్న ఏశావులా రోమాలు కలిగి ఉన్నాయి కాబట్టి అతడు గుర్తు పట్టలేదు; కాబట్టి అతన్ని దీవించడం ప్రారంభించాడు.
“నీవు నిజంగా నా కుమారుడైన ఏశావువేనా?” అని అతడు అడిగాడు. “అవును నేనే” అని అతడు జవాబిచ్చాడు.
అప్పుడు అతడు, “నా కుమారుడా, నీవు వండింది కొంత తీసుకురా, నేను తిని నిన్ను దీవిస్తాను” అని అన్నాడు. యాకోబు తెచ్చాడు, అతడు తిన్నాడు; ద్రాక్షరసం తెచ్చాడు, అతడు త్రాగాడు.
అప్పుడు అతని తండ్రి ఇస్సాకు యాకోబుతో, “నా కుమారుడా, దగ్గరకు వచ్చి నాకు ముద్దుపెట్టు” అన్నాడు.
కాబట్టి అతడు దగ్గరకు వెళ్లి అతనికి ముద్దుపెట్టాడు. ఇస్సాకు కుమారుని వస్త్రాల వాసనను పసిగట్టి, అతన్ని ఇలా దీవించాడు, “ఆహా, నా కుమారుని వాసన యెహోవా దీవించిన పొలం యొక్క సువాసన
దేవుడు నీకు ఆకాశపు మంచును, భూమి యొక్క సారాన్ని, సమృద్ధికరమైన ధాన్యాన్ని, నూతన ద్రాక్షరసాన్ని ఇచ్చును గాక.
జనాంగాలు నీకు సేవ చేయాలి, జనాలు నీకు తలవంచాలి. నీ సోదరులకు నీవు ప్రభువుగా ఉంటావు, నీ తల్లి యొక్క కుమారులు నీకు తలవంచాలి. నిన్ను శపించేవారు శపించబడతారు నిన్ను దీవించే వారు దీవించబడతారు.”
రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు ఏమన్నాడో తెలుసుకుని, తన చిన్న కుమారుడైన యాకోబును పిలిపించి అతనితో ఇలా అన్నది, “నీ అన్న ఏశావు నిన్ను చంపి ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాడు.