Skip to content

Paul గురించి బైబిల్ వచనాలు

619 వచనాలు · 103 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “స్నేహితులారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మనుష్యులమే. మీరు ఇలాంటి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించిన సజీవుడైన దేవుని వైపు తిరగండని మేము మీకు సువార్తను ప్రకటిస్తున్నాము.

  2. గతంలో, ఆయన అన్ని దేశాల ప్రజలను తమ సొంత మార్గాల్లో వెళ్లనిచ్చాడు.

  3. అయినా కానీ ఆయన గురించి సాక్ష్యం లేకుండా ఉంచలేదు ఎలాగంటే: ఆయన మీకు ఆకాశం నుండి వర్షాన్ని వాటి రుతువుల్లో పంటలు పండింపచేసి తన దయను చూపించారు; సమృద్ధిగా ఆహారాన్ని అనుగ్రహిస్తూ మీ హృదయాలను ఆనందంతో నింపుతున్నారు.”

  4. వారు ఈ మాటలు చెప్పినా కానీ తమకు బలి అర్పించాలనుకున్న సమూహాన్ని ఆపడం కష్టమైపోయింది.

  5. అంతియొకయ ఈకొనియ ప్రాంతాల నుండి వచ్చిన కొందరు యూదులు జనసమూహాన్ని తమ పక్షం చేసికొని, పౌలును రాళ్లతో కొట్టించి, అతడు చనిపోయాడనుకొని పట్టణం బయటకు ఈడ్చుకొని పోయారు.

  6. కానీ విశ్వాసులు అతని చుట్టూ చేరిన వెంటనే, అతడు లేచి పట్టణంలోనికి తిరిగి వెళ్లాడు. మరుసటిరోజు అతడు బర్నబాతో కలిసి దెర్బేకు వెళ్లాడు.

  7. వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి చాలామందిని శిష్యులుగా చేశారు. తర్వాత లుస్త్ర, ఈకొనియ అంతియొకయ పట్టణాలకు తిరిగి వచ్చారు.

  8. శిష్యుల ఆత్మలను బలపరచి విశ్వాసంలో స్థిరంగా ఉండాలని వారిని ప్రోత్సాహించారు. “మనం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అనేక హింసలు పొందాల్సి ఉంది” అని వారు చెప్పారు.

  9. పౌలు బర్నబాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రతి సంఘంలో సంఘ పెద్దలను నియమించి, వారు నమ్మిక ఉంచిన ప్రభువుకు వారిని అప్పగించారు.

  10. వారు పిసిదియ ప్రాంతం ద్వారా పంఫులియా ప్రాంతానికి వచ్చి,

  11. అక్కడ పెర్గే పట్టణంలో దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత అత్తాలియ సముద్రతీరాన ఉన్న పట్టణానికి వెళ్లారు.

  12. అత్తాలియ పట్టణం నుండి బయలుదేరి ఓడ ఎక్కి తాము ఇంతవరకు పూర్తి చేసిన పనిని దేవుని కృపకు అప్పగించి అంతియొకయ పట్టణానికి తిరిగి వచ్చారు.

  13. అక్కడ చేరిన వెంటనే, సంఘమంతటిని సమకూర్చి దేవుడు తమ ద్వారా జరిగించిన కార్యాలను, యూదేతరుల కోసం ఆయన ఏ విధంగా విశ్వాసపు ద్వారాన్ని తెరిచాడో వారికి వివరంగా తెలియజేశారు.

  14. ఆ తర్వాత వారు శిష్యులతో కలిసి అక్కడే చాలా కాలం ఉన్నారు.

  15. కొందరు యూదయ ప్రాంతం నుండి అంతియొకయ ప్రాంతానికి వచ్చి విశ్వాసులతో: “మోషే నియమించిన ఆచార ప్రకారం సున్నతి పొందితేనే తప్ప రక్షణ లేదు” అని బోధించారు.

  16. ఇది పౌలు బర్నబాల మధ్య తీవ్రమైన తర్కానికి దారి తీసింది. కాబట్టి వారు, మరికొందరు విశ్వాసులతో కలిసి ఈ ప్రశ్న విషయమై యెరూషలేములోని అపొస్తలులను, సంఘ పెద్దలను కలుసుకోడానికి వెళ్లాలని నిర్ణయించారు.

  17. వారు యెరూషలేము చేరుకొన్నప్పుడు, సంఘస్థులు అపొస్తలులు సంఘపెద్దలు వారిని చేర్చుకున్నారు. అక్కడ ఉన్నవారందరికి దేవుడు తమ ద్వారా జరిగించిన వాటన్నిటిని వివరించారు.

  18. బర్నబా పౌలు తమ ద్వారా దేవుడు యూదేతరుల మధ్యలో చేసిన అద్భుతాలను సూచకక్రియలను ఆ సభలో వివరిస్తున్నప్పుడు అక్కడ చేరిన వారందరు శ్రద్ధతో నిశ్శబ్దంగా విన్నారు.

  19. ఆ తర్వాత అపొస్తలులు సంఘపెద్దలు సంఘమంతటితో కలిసి, పౌలు బర్నబాలతో పాటు ఇంకొందరు విశ్వాసులను అంతియొకయ ప్రాంతానికి పంపాలని నిర్ణయించి విశ్వాసుల మధ్యలో నాయకులుగా ఉన్న బర్సబ్బా అని పిలువబడే యూదా సీలను ఏర్పరచుకున్నారు.

  20. కాబట్టి మా నుండి కొంతమందిని ఏర్పరచుకొని మా ప్రియ స్నేహితులైన బర్నబా పౌలుతో వారిని పంపడానికి మేము అందరం అంగీకరించాము.

  21. కొంతకాలం తర్వాత పౌలు, “మనం ప్రభువు వాక్యాన్ని ప్రకటించిన అన్ని పట్టణాలకు తిరిగివెళ్లి, అక్కడి విశ్వాసులను కలుసుకొని వారి క్షేమ సమాచారాలను తెలుసుకుందాం” అని బర్నబాతో అన్నాడు.

  22. బర్నబా తమతో మార్కు అనబడే యోహానును తీసుకెళ్లాలని భావించాడు.

  23. కాని పౌలు, పంఫులియాలో అతడు పరిచర్యకు రాకుండా తమను విడిచిపెట్టి వెళ్లిపోయాడు కాబట్టి అతన్ని తీసుకుని వెళ్లడం మంచిది కాదని తలంచాడు.

  24. ఆ విషయాన్ని బట్టి వారిద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారిద్దరు వేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్ర ద్వీపానికి వెళ్లాడు.

  25. విశ్వాసులు పౌలును ప్రభువు కృపకు అప్పగించినప్పుడు అతడు సీలను ఎంచుకుని అక్కడినుండి బయలుదేరాడు.