Skip to content

Nation గురించి బైబిల్ వచనాలు

183 వచనాలు · 11 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా ఇలా అంటున్నారు, “మూర్ఖులైన పిల్లలకు శ్రమ, వారు నావి కాని ఆలోచనలు చేస్తారు, నా ఆత్మ నియమించని పొత్తు చేసుకుంటూ పాపానికి పాపం జత చేస్తున్నారు;

  2. వారు నన్ను సంప్రదించకుండా ఈజిప్టుకు వెళ్తారు; వారు సహాయం కోసం ఫరో కాపుదల కోసం చూస్తారు, ఆశ్రయం కోసం ఈజిప్టు నీడ కోసం చూస్తారు.

  3. నేను వెలుగును రూపిస్తాను, చీకటిని కలుగజేస్తాను, నేను వృద్ధిని తెస్తాను, విపత్తును కలుగజేస్తాను. యెహోవానైన నేను వీటన్నిటిని చేస్తాను.

  4. నిన్ను సేవించని దేశమైనా రాజ్యమైనా నాశనమవుతుంది; అది పూర్తిగా నాశనమవుతుంది.

  5. నేను ఇత్తడికి బదులు బంగారాన్ని ఇనుముకు బదులు వెండిని నీకు తెస్తాను. నేను కర్రకు బదులు ఇత్తడిని రాళ్లకు బదులు ఇనుమును నీకు తెస్తాను. నేను సమాధానాన్ని నీకు అధిపతిగా నీతిని నీకు పాలకునిగా నియమిస్తాను.

  6. ఇకపై నీ దేశంలో హింస అనేది వినబడదు, నీ సరిహద్దులలో నాశనం గాని విధ్వంసం గాని వినపడదు. అయితే నీవు నీ గోడలను రక్షణ అని నీ గుమ్మాలను స్తుతి అని పిలుస్తావు.

  7. తోడేలు గొర్రెపిల్ల కలిసి మేస్తాయి, సింహం ఎద్దులా గడ్డి తింటుంది, దుమ్ము సర్పానికి ఆహారమవుతుంది. నా పరిశుద్ధ పర్వతం మీద అవి హానిని గాని నాశనాన్ని గాని చేయవు” అని యెహోవా చెప్తున్నారు.

  8. దీని కోసం నేను వారిని శిక్షించకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఇలాంటి దేశం మీద నేను ప్రతీకారం తీర్చుకోకూడదా?

  9. ఆయన, “ఇశ్రాయేలూ, ఈ కుమ్మరి చేసినట్టు నేను నీకు చేయకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “కుమ్మరి చేతిలోని మట్టిలా, ఇశ్రాయేలూ, నీవు నా చేతిలో ఉన్నావు.

  10. ఏదైనా ఒక దేశాన్ని లేదా రాజ్యాన్ని పెళ్లగిస్తానని, కూల్చివేస్తానని, నాశనం చేస్తానని నేను ఎప్పుడైనా ప్రకటిస్తే,

  11. దానికి ఆ దేశం దాని చెడు గురించి పశ్చాత్తాపపడితే నేను జాలిపడి, పంపాలనుకున్న విపత్తును పంపకుండ నిలిపివేస్తాను.

  12. ఏదైనా ఒక దేశాన్ని గాని రాజ్యాన్ని గాని కడతానని, స్థిరపరుస్తానని నేను ప్రకటిస్తే,

  13. ఒకవేళ అది నా దృష్టిలో చెడు చేసి, నాకు లోబడకపోతే, నేను దానికి చేయాలని ఉద్దేశించిన మంచి చేయకుండా ఆపివేస్తాను.

  14. “అయితే డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు, నేను బబులోను రాజును, అతని ప్రజలను, బబులోనీయుల దేశాన్ని వారి దోషాన్ని బట్టి శిక్షిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “దానిని శాశ్వతంగా నిర్జనం చేస్తాను.

  15. నేను ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాటన్నిటిని, ఈ పుస్తకంలో వ్రాసి ఉన్నవాటన్నిటిని, యిర్మీయా ప్రవచించిన ప్రకారం ఆ దేశం మీదికి రప్పిస్తాను.

  16. వారే అనేక దేశాలకు, గొప్ప రాజులకు బానిసలుగా ఉంటారు; వారి క్రియలనుబట్టి వారి చేతి పనులను బట్టి నేను వారికి ప్రతిఫలమిస్తాను.”

  17. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “నా ఉగ్రత అనే ద్రాక్షరసంతో నిండిన ఈ గిన్నెను నా చేతిలో నుండి తీసివేసి, నేను నిన్ను పంపే దేశాలన్నిటిని త్రాగనివ్వు.

  18. వారు దానిని త్రాగినప్పుడు, నేను వారి మధ్యకు పంపబోయే ఖడ్గాన్ని చూసి వారు తడబడి పిచ్చివారైపోతారు.”

  19. కాబట్టి నేను యెహోవా చేతిలో నుండి గిన్నె తీసుకుని, ఆయన నన్ను పంపిన దేశాలన్నిటిని త్రాగేలా చేశాను:

  20. అవి నేడు ఉన్నట్లుగా నాశనం చేయడానికి వాటిని నిర్జనంగా ఎగతాళిగా ఒక శాపంగా మార్చడానికి యెరూషలేముకు, యూదా పట్టణాలకు, దాని రాజులకు అధికారులకు దానిని త్రాగించాను;

  21. ఈజిప్టు రాజు ఫరో, అతని పరిచారకులు, అధికారులు, అతని ప్రజలందరూ,

  22. అక్కడున్న విదేశీయులందరు అనగా ఊజు రాజులందరూ; ఫిలిష్తీయ పట్టణాలైన అష్కెలోను, గాజా, ఎక్రోను రాజులందరూ అష్డోదులో మిగిలిన ప్రజలు;

  23. ఎదోము, మోయాబు, అమ్మోను;

  24. తూరు సీదోను రాజులందరూ; సముద్ర తీర ప్రాంతాల రాజులు;

  25. దేదాను, తేమా, బూజీయులు దూర ప్రాంతాల్లో ఉన్నవారందరు;