Skip to content

Nation గురించి బైబిల్ వచనాలు

183 వచనాలు · 11 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “నేను చూస్తుండగా, “సింహాసనాలు వాటి స్థానాల్లో వేయబడ్డాయి, వాటిపై మహా వృద్ధుడు కూర్చున్నారు. ఆయన వస్త్రం మంచులా తెల్లగా, ఆయన తలవెంట్రుకలు శుద్ధమైన తెల్లని గొర్రె ఉన్నిలా ఉన్నాయి. ఆయన సింహాసనం అగ్నిలా మండుతూ ఉంది, దాని చక్రాలు మండుతూ ఉన్నాయి.

  2. ఆయన ఎదుట నుండి అగ్ని నది ప్రవహిస్తూ వస్తుంది, వేవేలకొలది ఆయనకు సేవ చేస్తున్నారు; పదివేలకొలది ఆయన ఎదుట నిలబడ్డారు, న్యాయసభ మొదలైంది, గ్రంధాలు విప్పారు.

  3. “అప్పుడు నేను చూస్తుండగా ఆ చిన్న కొమ్ము గర్వంగా మాట్లాడినందుకు ఆ జంతువు చంపబడింది. దాని శవం నాశనం చేయబడి మండుతున్న అగ్నిలో పడవేయబడింది.

  4. (ఇతర మృగాల తమ అధికారం కోల్పోయాయి, కాని కొంతకాలం వరకు బ్రతకడానికి అనుమతించబడ్డాయి.)

  5. కాబట్టి నేను ప్రభువైన దేవుని వైపు తిరిగి ప్రార్థన, విన్నపం ద్వారా ఆయనను ప్రాధేయపడ్డాను, ఉపవాసముండి, గోనెపట్ట చుట్టుకొని, బూడిద మీద పోసుకున్నాను.

  6. నా దేవుడైన యెహోవాకు ఇలా ప్రార్థన చేస్తూ ఒప్పుకున్నాను: “ప్రభువా! మిమ్మల్ని ప్రేమించి, మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల ప్రేమ నిబంధనను నిలిపే మహా భీకరుడవైన దేవా,

  7. మేము పాపం చేశాము, తప్పు చేశాము. మేము దుష్టులమై తిరుగుబాటు చేశాం; మీ ఆజ్ఞలు, న్యాయవిధుల నుండి తప్పిపోయాము.

  8. మీ నామంలో, మా రాజులతో, అధిపతులతో, పూర్వికులతో, దేశ ప్రజలందరితో మాట్లాడిన మీ దాసులైన ప్రవక్తల మాటలు మేము వినలేదు.

  9. “ప్రభువా! మీరు నీతిమంతులు, కాని ఈ రోజు మేమైతే అనగా మీ పట్ల మేము చూపిన నమ్మకద్రోహాన్ని బట్టి ఆయా దేశాలకు చెదరగొట్టబడిన యూదా ప్రజలం, యెరూషలేము నివాసులం, ఇశ్రాయేలీయులం, దగ్గరగా దూరంగా ఉన్నవారమందరం అవమానంతో నిండిపోయాము.

  10. యెహోవా, మేము మీకు వ్యతిరేకంగా పాపం చేశాం కాబట్టి మేము, మా రాజులు, అధిపతులు, పూర్వికులు అవమానంతో కప్పబడ్డాము.

  11. మా ప్రభువైన దేవుడు, మేము తిరుగుబాటు చేసిన కూడా, కరుణ, క్షమాపణ గలవారు;

  12. దేవుడైన యెహోవాకు మేము లోబడలేదు, ఆయన తన దాసులైన ప్రవక్తల ద్వారా మాకిచ్చిన న్యాయవిధులను మేము పాటించలేదు.

  13. ఇశ్రాయేలంతా మీకు విధేయత చూపడం విడిచిపెట్టి, మీ ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, వదిలేశారు. “కాబట్టి దేవుని దాసుడైన మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న శాపాలు, ప్రమాణం చేయబడిన తీర్పులు మామీద కుమ్మరించబడ్డాయి, ఎందుకంటే మీకు విరోధంగా మేము పాపం చేశాము.

  14. మమ్మల్ని ఉద్దేశించి చెప్పిన మాటలు, మా మీదికి, మా పాలకుల మీదికి గొప్ప విపత్తు తీసుకురావడం ద్వారా మీరు నెరవేర్చారు. యెరూషలేముకు జరిగినట్లు ఆకాశమంతటి క్రింద మరే స్థలంలో ఎప్పుడూ జరగలేదు.

  15. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినట్లే, ఈ విపత్తు అంతా మా మీదికి వచ్చింది, అయినా మేము పాపాలను వదిలి, మీ సత్యం వైపు దృష్టి పెట్టక, మా దేవుడైన యెహోవా చూపించు దయను కోరలేదు.

  16. మా దేవుడైన యెహోవా తాను క్రియలన్నిటిలో న్యాయవంతులు కాబట్టి యెహోవా ఈ విపత్తు మా మీదికి రప్పించడానికి మొహమాట పడలేదు; అయినా మేము ఆయనకు లోబడలేదు.

  17. “ప్రభువైన మా దేవా, బలమైన హస్తం ద్వారా మీ ప్రజలను ఈజిప్టు నుండి బయటకు రప్పించి నీ నామానికి ఘనత తెచ్చుకున్నావు. మేము పాపం చేశాం, దుర్మార్గంగా ప్రవర్తించాము.

  18. ప్రభువా, మీ నీతిక్రియల ప్రకారం మీ పట్టణం, మీ పరిశుద్ధ కొండయైన యెరూషలేము పట్ల మీ కోపాన్ని వదిలేయండి. మా పాపాలు, మా పూర్వికుల అతిక్రమాలు, మా చుట్టూ ఉన్న ప్రజలకు, యెరూషలేమును, మీ ప్రజలను హేళన చేసే విషయంగా మార్చాయి.

  19. “ఇప్పుడు, మా దేవా, మీ దాసుని ప్రార్థనలు, విన్నపాలు ఆలకించండి. ప్రభువా, మీ కోసం, పాడైపోయిన మీ పరిశుద్ధాలయం మీద దయతో చూడండి.

  20. మా దేవా, చెవియొగ్గి ఆలకించండి; మీ కళ్లు తెరిచి, మీ పేరుపెట్టబడిన పట్టణం యొక్క శిథిలావస్తను చూడండి. మేము నీతిమంతులమని కాదు కాని, మీ గొప్ప కరుణను బట్టి మేము మీకు మా విన్నపాలు చేస్తున్నాము.

  21. ప్రభువా ఆలకించండి! ప్రభువా క్షమించండి! నా దేవా మీ కోసం, ఆలస్యం చేయకండి, ఎందుకంటే మీ పట్టణం మీ ప్రజలు మీ పేరు కలిగి ఉన్నారు.”

  22. నేను మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ, నా పాపాలు, నా ప్రజలైన ఇశ్రాయేలు పాపాలు ఒప్పుకుంటూ, నా దేవుడైన యెహోవాకు ఆయన పరిశుద్ధ కొండ గురించి వేడుకుంటూ ప్రార్థించాను.

  23. నేను ఇంకా ప్రార్థనలో ఉన్నప్పుడు, ముందు చూసిన దర్శనంలో కనిపించిన వ్యక్తియైన గబ్రియేలు సాయంకాల నైవేద్య సమయంలో వేగంగా ఎగురుకుంటూ నా దగ్గరకు వచ్చాడు.

  24. ఆ రోజున నా ప్రజల కోసం అడవి జంతువులతో, ఆకాశ పక్షులతో, నేలను ప్రాకే జంతువులతో నిబంధన చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధం దేశంలో లేకుండా చేస్తాను, అప్పుడు వారు క్షేమంగా పడుకుంటారు.

  25. వారు వెళ్లేటప్పుడు, నేను వారి మీద నా వల వేస్తాను; నేను వారిని ఆకాశంలో పక్షుల్లా క్రిందికి లాగుతాను. వారు సమాజంగా కూడుకుంటున్నారని నేను విన్నప్పుడు, నేను వారిని శిక్షిస్తాను.