Skip to content

Elam

14 verses

32.1800, 48.2500 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Elam ను ప్రస్తావించే వచనాలు

  1. అమ్రాపేలు షీనారు యొక్క రాజుగా ఉన్న కాలంలో, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీము రాజైన తిదాలు,

  2. ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీము రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, అంటే నలుగురు రాజులు అయిదుగురు రాజులతో యుద్ధం చేశారు.

  3. ఆ రోజున తన ప్రజల్లో మిగిలి ఉన్న శేషాన్ని అష్షూరు, ఈజిప్టు, పత్రూసు, కూషు, ఏలాము, బబులోను, హమాతులలో నుండి, మధ్యధరా సముద్ర ద్వీపాల్లో నుండి విడిపించి రప్పించడానికి యెహోవా రెండవసారి తన చేయి చాపుతారు.

  4. భయంకరమైన దర్శనం నాకు వచ్చింది: మోసం చేసేవారు మోసం చేస్తారు, దోచుకొనేవారు దోచుకుంటారు. ఏలామూ, వెళ్లి దాడి చేయి! మెదీయా, ముట్టడించు! దాని మూలుగు అంతటిని నేను ఆపివేస్తాను.

  5. ఏలాము రథసారధులతో గుర్రాలతో తన అంబులపొదిని నింపుకుంది. కీరు మనుష్యులు డాలును బయటకు తీశారు.

  6. జిమ్రీ, ఏలాము, మాదీయుల రాజులందరూ;

  7. యూదా రాజైన సిద్కియా పాలనలో ఏలామును గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు ఇది:

  8. సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి, నేను ఏలాము బలానికి మూలమైన విల్లును విరగ్గొడతాను.

  9. నేను ఏలాముకు వ్యతిరేకంగా ఆకాశంలోని నాలుగు దిక్కుల నుండి నాలుగు గాలులను రప్పిస్తాను; నేను వారిని నాలుగు గాలులకు చెదరగొడతాను, చెదిరిపోయిన ఏలాము వారు వెళ్లని దేశమే ఉండదు.

  10. నేను ఏలామును వారి శత్రువుల ఎదుట, వారిని చంపాలనుకున్న వారి ఎదుట వారిని చెదరగొడతాను. నేను వారి మీదికి విపత్తును, నా కోపాగ్నిని కూడా రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నేను వారిని అంతం చేసే వరకు ఖడ్గంతో వారిని వెంటాడుతాను.

  11. ఏలాములో నా సింహాసనాన్ని స్థాపించి, దాని రాజును, అధికారులను నాశనం చేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  12. “అయినప్పటికీ నేను రాబోయే రోజుల్లో ఏలాముకు చెందిన వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  13. “సమాధి చుట్టూ ఏలాము దాని అల్లరిమూకలు ఉన్నాయి. వారందరూ చంపబడ్డారు, ఖడ్గంతో కూలారు. సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేసిన వారంతా సున్నతి పొందని వారిగా పాతాళంలోకి దిగివెళ్లే వారితో పాటు తమ అవమానాన్ని భరిస్తున్నారు.

  14. నేను దర్శనం చూస్తూ ఉన్నప్పుడు ఏలాము సామ్రాజ్యంలోని షూషను కోటలో ఉన్న నేను, దర్శనంలో ఊలయి కాలువ దగ్గర ఉన్నట్లు చూశాను.