Skip to content

Gad

13 వచనాలు

Gad ను ప్రస్తావించే వచనాలు

  1. అయితే గాదు ప్రవక్త వచ్చి దావీదుతో, “బలమైన కోటలలో ఉండవద్దు, యూదా దేశానికి పారిపో” అని చెప్పాడు. కాబట్టి దావీదు హెరెతు అడవిలోకి వెళ్లాడు.

  2. తర్వాతి రోజు ఉదయాన్నే దావీదు నిద్ర లేవడానికి ముందే దావీదుకు దీర్ఘదర్శిగా, ప్రవక్తగా ఉన్న గాదుతో యెహోవా ఇలా చెప్పారు:

  3. కాబట్టి గాదు దావీదు దగ్గరకు వెళ్లి అతనితో, “నీ దేశంలో మూడు సంవత్సరాల కరువు రావాలని కోరుకుంటావా? నీ శత్రువులు నిన్ను వెంటాడగా, వారిని ఎదుర్కోలేక మూడు నెలలు పారిపోతావా? నీ దేశంలో మూడు రోజులు తెగులు వ్యాపించాలని కోరుకుంటావా? ఇప్పుడు, నన్ను పంపిన వ్యక్తికి నేనేమి జవాబివ్వాలో ఆలోచించి నిర్ణయించుకో” అన్నాడు.

  4. అందుకు దావీదు గాదుతో, “నేను తీవ్ర బాధలో ఉన్నాను. యెహోవా కనికరం ఎంతో గొప్పది కాబట్టి ఆయన చేతిలోనే మేము పడాలి; కాని మనుష్యుల చేతిలో నేను పడకూడదు” అని అన్నాడు.

  5. అదే రోజు గాదు దావీదు దగ్గరకు వచ్చి, “యెబూసీయుడైన అరౌనా నూర్పిడి కళ్ళంలో యెహోవాకు బలిపీఠం కట్టించు” అని చెప్పాడు.

  6. గాదు ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞమేరకు దావీదు బయలుదేరి వెళ్లాడు.

  7. యెహోవా, దావీదుకు దీర్ఘదర్శిగా ఉన్న గాదుతో ఇలా అన్నారు,

  8. కాబట్టి గాదు దావీదు దగ్గరకు వెళ్లి అతనితో, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘వీటిలో ఒకదాన్ని ఎంచుకో:

  9. అందుకు దావీదు గాదుతో, “నేను తీవ్ర బాధలో ఉన్నాను. యెహోవా కనికరం ఎంతో గొప్పది కాబట్టి ఆయన చేతిలోనే నేను పడాలి; కాని మనుష్యుల చేతిలో నేను పడకూడదు” అని అన్నాడు.

  10. అప్పుడు యెహోవా దూత యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళంలో యెహోవాకు బలిపీఠం కట్టించాలని దావీదుకు చెప్పమని గాదుకు ఆజ్ఞాపించాడు.

  11. కాబట్టి యెహోవా పేరిట గాదు చెప్పిన మాటకు లోబడి దావీదు బయలుదేరి వెళ్లాడు.

  12. రాజైన దావీదుకు సంబంధించిన ఇతర వివరాలన్నీ మొదటి నుండి చివరి వరకు, అతని పాలనకు అధికారానికి సంబంధించిన వివరాలు, అతడు, ఇశ్రాయేలీయులు ఇతర దేశాల రాజ్యాలు ఎదుర్కొన్న పరిస్థితుల వివరాలు దీర్ఘదర్శి సమూయేలు, నాతాను ప్రవక్త, దీర్ఘదర్శి గాదు వ్రాసిన చరిత్ర గ్రంథాల్లో ఉన్నాయి.

  13. మునుపు దావీదు రాజు, అతని దీర్ఘదర్శియైన గాదు, ప్రవక్తయైన నాతాను ఆదేశించిన ప్రకారం, హిజ్కియా లేవీయులను తాళాలతో, స్వరమండలాలతో, తంతి వాయిద్యాలతో యెహోవా మందిరంలో ఉంచాడు. ఇలా చేయాలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించాడు.