Skip to content

Choice గురించి బైబిల్ వచనాలు

9 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. ఈ రోజు నేను మీ ముందు జీవాన్ని మరణాన్ని, దీవెనలు శాపాలను ఉంచి, ఆకాశాలను భూమిని మీకు మీద సాక్షులుగా పిలుస్తాను. ఇప్పుడు జీవాన్ని ఎంచుకోండి, అప్పుడు మీరు, మీ పిల్లలు బ్రతకవచ్చు.

  2. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించేలా, ఆయన స్వరాన్ని విని ఆయనను గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే యెహోవాయే మీ జీవం; మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో ఆయన మీకు దీర్ఘాయుష్షు ఇస్తారు.

  3. అయితే యెహోవాను సేవించడం మీకు అయిష్టంగా అనిపిస్తే మీరు ఎవరిని సేవించాలో, యూఫ్రటీసు నది అవతల మీ పూర్వికులు సేవించిన దేవుళ్ళను సేవించాలో లేదా మీరు నివసిస్తున్న అమోరీయుల దేశంలోని దేవుళ్ళను సేవించాలో ఈ రోజు ఎంచుకోండి. అయితే నేనూ, నా ఇంటివారు మాత్రం యెహోవానే సేవిస్తాము.”

  4. అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవతలను సేవించడం మాకు దూరమవును గాక!

  5. మమ్మల్ని, మా తల్లిదండ్రులను దాస్య దేశమైన ఈజిప్టు నుండి రప్పించి, మన కళ్లముందు ఆ గొప్ప సూచకక్రియలను చేసింది మన దేవుడైన యెహోవాయే. మా మొత్తం ప్రయాణంలో, మేము ప్రయాణించిన అన్ని దేశాల మధ్య ఆయన మమ్మల్ని రక్షించాడు.

  6. ఆ దేశంలో నివసించే అమోరీయులతో సహా ప్రజలందరినీ యెహోవా మన ముందు వెళ్లగొట్టారు. కాబట్టి మేము కూడా యెహోవానే సేవిస్తాం, ఎందుకంటే ఆయనే మన దేవుడు.”

  7. కాబట్టి గాదు దావీదు దగ్గరకు వెళ్లి అతనితో, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘వీటిలో ఒకదాన్ని ఎంచుకో:

  8. మూడు సంవత్సరాల కరువు, మూడు నెలలు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరిమితే వారి ఎదుట నుండి పారిపోవడం, లేదా మూడు రోజులపాటు దేశంలో యెహోవా ఖడ్గం అనగా తెగులు వ్యాపించడం ద్వారా యెహోవా దేవదూత ఇశ్రాయేలీయుల దేశమంతటిని నాశనం చేయడం.’ ఇప్పుడు, నన్ను పంపిన వ్యక్తికి నేనేమి జవాబివ్వాలో నిర్ణయించుకో” అన్నాడు.

  9. అందుకు దావీదు గాదుతో, “నేను తీవ్ర బాధలో ఉన్నాను. యెహోవా కనికరం ఎంతో గొప్పది కాబట్టి ఆయన చేతిలోనే నేను పడాలి; కాని మనుష్యుల చేతిలో నేను పడకూడదు” అని అన్నాడు.