Skip to content

Nation గురించి బైబిల్ వచనాలు: Chastised

77 వచనాలు · 11 కోణాలు

Chastised గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లోకమంతటి గురించి నిర్ణయించిన ఆలోచన ఇదే; ప్రజలందరిపై చాపబడిన చేయి ఇదే.

  2. సైన్యాల యెహోవా దానిని ఉద్దేశిస్తే ఆయనను అడ్డుకునేవారు ఎవరు? ఆయన చేయి చాచి ఉన్నది, దాన్ని త్రిప్పగలవారెవరు?

  3. దీని కోసం నేను వారిని శిక్షించకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఇలాంటి దేశం మీద నేను ప్రతీకారం తీర్చుకోకూడదా?

  4. ఆయన, “ఇశ్రాయేలూ, ఈ కుమ్మరి చేసినట్టు నేను నీకు చేయకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “కుమ్మరి చేతిలోని మట్టిలా, ఇశ్రాయేలూ, నీవు నా చేతిలో ఉన్నావు.

  5. ఏదైనా ఒక దేశాన్ని లేదా రాజ్యాన్ని పెళ్లగిస్తానని, కూల్చివేస్తానని, నాశనం చేస్తానని నేను ఎప్పుడైనా ప్రకటిస్తే,

  6. దానికి ఆ దేశం దాని చెడు గురించి పశ్చాత్తాపపడితే నేను జాలిపడి, పంపాలనుకున్న విపత్తును పంపకుండ నిలిపివేస్తాను.

  7. ఏదైనా ఒక దేశాన్ని గాని రాజ్యాన్ని గాని కడతానని, స్థిరపరుస్తానని నేను ప్రకటిస్తే,

  8. ఒకవేళ అది నా దృష్టిలో చెడు చేసి, నాకు లోబడకపోతే, నేను దానికి చేయాలని ఉద్దేశించిన మంచి చేయకుండా ఆపివేస్తాను.

  9. “అయితే డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు, నేను బబులోను రాజును, అతని ప్రజలను, బబులోనీయుల దేశాన్ని వారి దోషాన్ని బట్టి శిక్షిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “దానిని శాశ్వతంగా నిర్జనం చేస్తాను.

  10. నేను ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాటన్నిటిని, ఈ పుస్తకంలో వ్రాసి ఉన్నవాటన్నిటిని, యిర్మీయా ప్రవచించిన ప్రకారం ఆ దేశం మీదికి రప్పిస్తాను.

  11. వారే అనేక దేశాలకు, గొప్ప రాజులకు బానిసలుగా ఉంటారు; వారి క్రియలనుబట్టి వారి చేతి పనులను బట్టి నేను వారికి ప్రతిఫలమిస్తాను.”

  12. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “నా ఉగ్రత అనే ద్రాక్షరసంతో నిండిన ఈ గిన్నెను నా చేతిలో నుండి తీసివేసి, నేను నిన్ను పంపే దేశాలన్నిటిని త్రాగనివ్వు.

  13. వారు దానిని త్రాగినప్పుడు, నేను వారి మధ్యకు పంపబోయే ఖడ్గాన్ని చూసి వారు తడబడి పిచ్చివారైపోతారు.”

  14. కాబట్టి నేను యెహోవా చేతిలో నుండి గిన్నె తీసుకుని, ఆయన నన్ను పంపిన దేశాలన్నిటిని త్రాగేలా చేశాను:

  15. అవి నేడు ఉన్నట్లుగా నాశనం చేయడానికి వాటిని నిర్జనంగా ఎగతాళిగా ఒక శాపంగా మార్చడానికి యెరూషలేముకు, యూదా పట్టణాలకు, దాని రాజులకు అధికారులకు దానిని త్రాగించాను;

  16. ఈజిప్టు రాజు ఫరో, అతని పరిచారకులు, అధికారులు, అతని ప్రజలందరూ,

  17. అక్కడున్న విదేశీయులందరు అనగా ఊజు రాజులందరూ; ఫిలిష్తీయ పట్టణాలైన అష్కెలోను, గాజా, ఎక్రోను రాజులందరూ అష్డోదులో మిగిలిన ప్రజలు;

  18. ఎదోము, మోయాబు, అమ్మోను;

  19. తూరు సీదోను రాజులందరూ; సముద్ర తీర ప్రాంతాల రాజులు;

  20. దేదాను, తేమా, బూజీయులు దూర ప్రాంతాల్లో ఉన్నవారందరు;

  21. అరేబియా రాజులందరూ అరణ్యంలో నివసించే పరదేశి ప్రజల రాజులందరూ;

  22. జిమ్రీ, ఏలాము, మాదీయుల రాజులందరూ;

  23. ఉత్తరాన ఉన్న రాజులందరూ, సమీపంలో దూరంగా, ఒకదాని తర్వాత ఒకటి భూమిపై ఉన్న అన్ని రాజ్యాలు త్రాగుతారు. వారందరి తర్వాత షేషకు రాజు కూడా దానిని త్రాగుతాడు.

  24. “అప్పుడు వారితో, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ మధ్యకు పంపే ఖడ్గాన్ని బట్టి ఇకపై లేవకుండా పడిపోండి, త్రాగండి, త్రాగి వాంతులు చేసుకోండి.’

  25. అయితే వారు మీ చేతిలో నుండి పాత్ర తీసుకుని త్రాగడానికి నిరాకరిస్తే, నీవు వారితో ఇలా చెప్పు, ‘మీరు దీన్ని త్రాగాలి అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.