Skip to content

Nation గురించి బైబిల్ వచనాలు

183 వచనాలు · 11 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. పర్వతాలు ప్రజలకు వృద్ధిని, కొండలు నీతి ఫలములు ఇచ్చును గాక.

  2. ఆయన రోజుల్లో నీతిమంతులు వృద్ధిచెందుతారు చంద్రుడు లేకుండ పోయే వరకు అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది.

  3. సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన. యెహోవా, మీ దేశానికి మీరు దయ చూపారు; యాకోబును చెర నుండి తిరిగి తీసుకువచ్చారు.

  4. మీరు మీ ప్రజల దోషాన్ని క్షమించారు వారి పాపాలన్నీ కప్పివేశారు. సెలా

  5. మీ ఉగ్రతను మీరు ప్రక్కన పెట్టారు మీ భయంకర కోపాగ్నిని చల్లార్చుకున్నారు.

  6. మా రక్షకుడవైన దేవా, మమ్మల్ని మరల పునరుద్ధరించండి. మామీద ఉన్న మీ కోపాన్ని విడిచిపెట్టండి.

  7. ఎప్పటికీ మీరు మామీద కోప్పడతారా? తరతరాల వరకు మామీద మీరు కోప్పడుతూనే ఉంటారా?

  8. మీ ప్రజలు మీలో ఆనందించేలా మీరు మమ్మల్ని మరల బ్రతికించరా?

  9. యెహోవా, మీ మారని ప్రేమను మా పట్ల చూపించండి, మీ రక్షణ మాకు అనుగ్రహించండి.

  10. యెహోవా, మీ గురించి ఆనంద కేకలు వేసేవారు ధన్యులు, మీ సన్నిధి కాంతిలో వారు నడుస్తారు.

  11. రోజంతా మీ నామాన్ని బట్టి వారు ఆనందిస్తారు; మీ నీతిని బట్టి వారు హర్షిస్తారు.

  12. ఎందుకంటే వారి మహిమ వారి బలం మీరే, మీ దయతో మా కొమ్మును హెచ్చిస్తారు.

  13. నిజానికి, మా డాలు యెహోవాకు చెందినది, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధునికి చెందిన వాడు.

  14. మీరు మీ పిల్లల పిల్లల్ని చూస్తారు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.

  15. ఆయన మీ గుమ్మాల గడియలు బలపరుస్తారు మీలో మీ ప్రజలను దీవిస్తారు.

  16. ఆయన మీ పొలిమేరల్లో సమాధానం అనుగ్రహిస్తారు మంచి గోధుమలతో పంటనిచ్చి మిమ్మల్ని తృప్తిపరుస్తారు.

  17. నీతి ఒక దేశాన్ని ఘనతకెక్కేలా చేస్తుంది, పాపం ప్రజలకు అవమానం తెస్తుంది.

  18. ప్రేమించడానికి, ద్వేషించడానికి, యుద్ధం చేయడానికి, సమాధానపడడానికి సమయం ఉంటుంది.

  19. ఆయన దేశాల మధ్య తీర్పు తీరుస్తారు, అనేక జనాంగాల వివాదాలను పరిష్కరిస్తారు. వారు తమ ఖడ్గాలను సాగగొట్టి నాగటి నక్కులుగా, తమ ఈటెలను సాగగొట్టి మడ్డికత్తులుగా చేస్తారు. ఒక దేశం మరొక దేశం మీద ఖడ్గం ఎత్తదు, వారు ఇకపై యుద్ధానికి శిక్షణ పొందరు.

  20. నీవు బబులోను రాజును హేళన చేస్తూ ఇలా మాట్లాడతావు: బాధ పెట్టినవాడు ఎలా నశించాడు! రేగుతున్న కోపం ఎలా అంతమయ్యింది!

  21. దుర్మార్గుల దుడ్డుకర్రను పాలకుల రాజదండాన్ని యెహోవా విరగ్గొట్టారు.

  22. వారు కోపంతో ఎడతెగని దెబ్బలతో ప్రజలను క్రూరంగా కొట్టారు, కోపంతో ప్రజలను పరిపాలించి కనికరం లేకుండా వారిని అణచివేశారు.

  23. భూమి అంతా విశ్రాంతిలో సమాధానంతో ఉంది; వారు పాడడం మొదలుపెట్టారు.

  24. లోకమంతటి గురించి నిర్ణయించిన ఆలోచన ఇదే; ప్రజలందరిపై చాపబడిన చేయి ఇదే.

  25. సైన్యాల యెహోవా దానిని ఉద్దేశిస్తే ఆయనను అడ్డుకునేవారు ఎవరు? ఆయన చేయి చాచి ఉన్నది, దాన్ని త్రిప్పగలవారెవరు?