Skip to content

King గురించి బైబిల్ వచనాలు

74 వచనాలు · 18 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రాజు ఆగ్రహం మరణ దూత వంటిది, అయితే జ్ఞానులు దాన్ని శాంతింపజేస్తారు.

  2. రాజుల ముఖకాంతి వలన జీవం కలుగుతుంది, వారి దయ వసంత రుతువులో వర్షం మేఘం లాంటిది.

  3. రాజు ఎదుట నుండి చెడ్డ అధికారులను తొలగించండి, నీతి ద్వారా ఆయన సింహాసనం స్థాపించబడుతుంది.

  4. రాజు ఎదుట నిన్ను నీవు హెచ్చించుకోవద్దు, ఆయన దగ్గర ఉండే గొప్పవారి మధ్య చోటు కావాలని కోరవద్దు.

  5. లెమూయేలూ, ఇది రాజులకు తగినది కాదు, మద్యపానం సేవించుట రాజులకు తగినది కాదు, పాలకులు మద్యము కోసం ఆరాటపడకూడదు,

  6. ఎందుకంటే వారు త్రాగి, నిర్ణయించిన వాటిని మరచిపోతారు, అణగారిన వారందరి హక్కులను హరించివేస్తారు.

  7. నీవు దేవుని ఎదుట ప్రమాణం చేశావు కాబట్టి రాజాజ్ఞకు లోబడమని నేను చెప్తున్నాను.

  8. రాజు సముఖం నుండి తొందరపడి వెళ్లి పోవద్దు. అతడు తనకు ఏది ఇష్టమైతే అది చేస్తాడు కాబట్టి చెడ్డపనులు చేయవద్దు.

  9. రాజు మాట మహోన్నతమైనది, “మీరు నీవు ఏం చేస్తున్నావు?” అని రాజును ఎవరు అడగగలరు?

  10. అతని ఆజ్ఞను పాటించే వారెవరికి ఏ హాని జరగదు, ఏది సరియైన సమయమో న్యాయమో జ్ఞానుల హృదయానికి తెలుసు.

  11. సిద్కియా రాజు యెరూషలేములోని ప్రజలందరితో బానిసలకు విడుదల ప్రకటించాలని ఒడంబడిక చేసుకున్న తర్వాత యెహోవా నుండి యిర్మీయాకు ఈ మాట వచ్చింది.

  12. ప్రతి ఒక్కరూ తమకు బానిసలుగా ఉన్న హెబ్రీయులైన మగవారిని, ఆడవారిని అందరిని విడిపించాలి; తోటి యూదులను ఎవరూ బానిసత్వంలో ఉంచకూడదు.

  13. కాబట్టి ఈ ఒడంబడిక ప్రకారం వచ్చిన అధికారులందరు, అలాగే ప్రజలందరూ తమ దగ్గర ఉన్న ఆడ, మగ బానిసలను విడుదల చేస్తామని, ఇక ఎప్పటికీ వారిని బానిసలుగా ఉంచమని అంగీకరించి, ఆ ఆజ్ఞకు లోబడి వారిని విడుదల చేశారు.

  14. అయితే ఆ తర్వాత వారు మనస్సు మార్చుకుని విడిపించిన బానిసలను వెనుకకు తీసుకుని మళ్ళీ బానిసలుగా చేసుకున్నారు.

  15. “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఇశ్రాయేలు అధిపతులారా! ఇక చాలు. ఇంతవరకు మీరు పెట్టిన హింసను బాధను విడిచిపెట్టి, న్యాయమైనది సరియైనది చేయండి. నా ప్రజలను దోచుకోవడం మానండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  16. మీరు సరైన త్రాసు సరైన ఏఫాను సరైన బాతును వాడండి.

  17. ఏఫా బాతు ఒకే పరిమాణంలో ఉండాలి; హోమెరులో పదవ వంతు ఏఫా, హోమెరులో పదవ వంతు బాతు; హోమెరు రెండింటికీ ప్రామాణిక కొలతగా ఉండాలి.

  18. ఒక షెకెలుకు ఇరవై గెరాలు. ఇరవై షెకెళ్లు, ఇరవై అయిదు షెకెళ్లు, పదిహేను షెకెళ్లు కలిపి ఒక మినాకు సమానము.

  19. “ ‘మీరు అర్పించవలసిన ప్రత్యేక కానుక ఏంటంటే ప్రతి హోమెరు గోధుమలలో ఒక ఏఫాలో ఆరవ భాగం ప్రతి హోమెరు యవలలో ఒక ఏఫాలో ఆరవ భాగం అర్పించాలి.

  20. సూచించిన భాగం బాతులలో కొలత ప్రకారం మీ నూనెలో ప్రతి కోరుకు బాతులో పదోవంతు అర్పించాలి. ఒక కోరు అనగా పది బాతులు లేదా ఒక హోమెరు; అంటే పది బాతులు ఒక హోమెరుకు సమానము.

  21. అలాగే ఇశ్రాయేలులో మంచి నీరున్న పచ్చికబయళ్లలో మేపిన మందలోని ప్రతి రెండు వందలకు ఒక గొర్రెను తీసుకోవాలి. ప్రజలకు ప్రాయశ్చిత్తం చేయడానికి వీటిని భోజనార్పణలు, దహనబలులు, సమాధాన బలులకు ఉపయోగిస్తారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  22. దేశంలోని ప్రజలందరూ ఇశ్రాయేలులోని యువరాజుకు ఈ ప్రత్యేక కానుక ఇవ్వాలి.

  23. పండుగల్లోను, అమావాస్య దినాల్లోను, సబ్బాతు దినాల్లోను, ఇశ్రాయేలీయులు కూడుకునే నియామక కాలాల్లోను వాడబడే దహనబలులను నైవేద్యాలను పానార్పణలను అందించడం అధిపతి యొక్క బాధ్యత. అతడు ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలులు, భోజనార్పణలు, దహనబలులు, సమాధానబలులను సమకూరుస్తాడు.

  24. “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మొదటి నెల మొదటి రోజున లోపం లేని కోడెను తీసుకుని పరిశుద్ధాలయాన్ని శుద్ధి చేయాలి.

  25. యాజకుడు పాపపరిహారబలి రక్తంలో కొంత తీసి దానిని ఆలయ ద్వారబంధాల పైన, బలిపీఠపు పైగట్టు నాలుగు మూలల మీద, లోపలి ఆవరణ ద్వారబంధాల పైన చల్లాలి.