కంటెంట్‌కు వెళ్లండి

King గురించి బైబిల్ వచనాలు: Acts as judge

12 వచనాలు · 18 కోణాలు

Acts as judge గురించి వచనాలు

  1. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బాలుని తల్లితో ఇలా అన్నాడు, “యెహోవా కరువు రప్పిస్తున్నారు, అది ఈ దేశంలో ఏడు సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి నీవు, నీ కుటుంబం బయలుదేరి మీకు అనువైన చోటికి వెళ్లి కొంతకాలం ఉండండి.”

  2. దైవజనుడు చెప్పినట్టు ఆ స్త్రీ చేసింది. ఆమె, ఆమె కుటుంబం, ఫిలిష్తీయ దేశానికి వెళ్లి అక్కడ ఏడు సంవత్సరాలు నివసించారు.

  3. ఏడు సంవత్సరాలు ముగిసిన తర్వాత, ఆమె ఫిలిష్తీయ దేశం నుండి తిరిగి వచ్చింది, తన ఇల్లు భూమి కోసం మనవి చేసుకోవడానికి ఆమె రాజు దగ్గరకు వెళ్లింది.

  4. ఆ సమయంలో, దైవజనుని సేవకుడైన గేహజీతో రాజు మాట్లాడుతూ, “ఎలీషా చేసిన గొప్పకార్యాలు నాకు చెప్పు” అన్నాడు.

  5. ఎలీషా ఎలా చచ్చినవాన్ని బ్రతికించాడో గేహజీ రాజుకు చెప్తూ ఉండగానే, అతడు బ్రతికించిన బాలుని తల్లి తన ఇల్లు అలాగే భూమి కోసం రాజుకు మనవి చేసుకోవడానికి వచ్చింది. గేహజీ, “నా ప్రభువా, రాజా, ఈవిడే ఆ స్త్రీ, ఇతడే ఎలీషా బ్రతికించిన ఈ స్త్రీ కుమారుడు” అని అన్నాడు.

  6. రాజు దాని గురించి ఆమెను అడిగినప్పుడు, ఆమె ఆ విషయం వివరించింది. అప్పుడు రాజు ఆమె కోసం ఒక అధికారిని నియమించి, “ఆమెకు చెందినదంతా, ఆమె దేశం విడిచి వెళ్లిన రోజు నుండి ఇప్పటివరకు ఆమె భూమివల్ల వచ్చిన రాబడితో సహా ఆమెకు ఇప్పించు” అని అతనికి చెప్పాడు.

  7. సొలొమోను కీర్తన. ఓ దేవా, రాజుకు మీ న్యాయాన్ని, రాకుమారునికి మీ నీతిని ప్రసాదించండి.

  8. ఆయన మీ ప్రజలకు నీతితో బాధితులకు న్యాయంతో తీర్పు తీర్చును గాక.

  9. పర్వతాలు ప్రజలకు వృద్ధిని, కొండలు నీతి ఫలములు ఇచ్చును గాక.

  10. ప్రజల్లో బాధపడుతున్నవారిని ఆయన రక్షించును గాక అవసరతలో ఉన్న వారి పిల్లలను రక్షించును గాక; బాధించేవారిని త్రొక్కివేయును గాక.

  11. ఒకవేళ, నేను మరణశిక్షకు తగిన తప్పును చేస్తే, నేను మరణశిక్షను నిరాకరించను. కానీ ఈ యూదులు నాకు వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదులలో సత్యం లేనప్పుడు, నన్ను వారికి అప్పగించే అధికారం ఎవరికి లేదు. నేను కైసరుకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను!” అని చెప్పాడు.

  12. ఫేస్తు తన న్యాయసభతో కలిసి చర్చించిన అతడు, “నీవు కైసరు దగ్గర విజ్ఞప్తి చేసుకుంటానని చెప్పావు కాబట్టి నీవు కైసరు దగ్గరకే వెళ్తావు!” అని ప్రకటించాడు.