కంటెంట్‌కు వెళ్లండి

Gehazi

12 వచనాలు

Gehazi ను ప్రస్తావించే వచనాలు

  1. తర్వాత అతడు తన సేవకుడైన గేహజీతో, “షూనేమీయురాలిని పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలువగానే ఆమె వచ్చి అతని ముందు నిలబడింది.

  2. ఎలీషా, “మరి ఆమె కోసం ఏం చేస్తే బాగుంటుంది?” అని అడిగాడు. గేహజీ, “ఆమెకు కుమారుడు లేడు, ఆమె భర్త వృద్ధుడు” అని జవాబిచ్చాడు.

  3. కాబట్టి ఆమె బయలుదేరి కర్మెలు పర్వతం మీద ఉన్న దైవజనుని దగ్గరకు వచ్చింది. ఆమెను దూరం నుండి చూసి, ఆ దైవజనుడు తన సేవకుడైన గేహజీతో, “చూడు! అదిగో షూనేమీయురాలు!

  4. ఆమె పర్వతం మీద ఉన్న దైవజనుని చేరుకొని, అతని పాదాలు పట్టుకుంది. గేహజీ ఆమెను అవతలకు నెట్టాలని దగ్గరకు వచ్చాడు, కాని దైవజనుడు, “ఆమెను వదిలేయి! ఆమె వేదనతో ఉన్నది కాని యెహోవా ఈ విషయం నాకు చెప్పకుండా మరుగు చేశారు” అని అన్నాడు.

  5. ఎలీషా గేహజీతో, “నీ నడికట్టు బిగించుకుని, నా దండం చేతపట్టుకుని పరుగెత్తు. నీకు ఎవరైనా ఎదురైతే పలకరించవద్దు, ఎవరైనా పలకరిస్తే, జవాబివ్వకు. నా దండం బాలుని ముఖం మీద పెట్టు” అని చెప్పాడు.

  6. గేహజీ వారికంటే ముందే వెళ్లి బాలుని ముఖం మీద ఆ దండం ఉంచాడు, అయితే ఏ శబ్దం కాని స్పందన కాని లేదు. కాబట్టి గేహజీ ఎలీషాను కలుసుకోడానికి వెళ్లి అతనితో, “బాలుడు మేలుకోలేదు” అని చెప్పాడు.

  7. ఎలీషా గేహజీని పిలిపించి, “షూనేమీయురాలిని పిలువు” అన్నాడు, అతడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చినప్పుడు అతడు, “నీ కుమారుని తీసుకో” అన్నాడు.

  8. ఎలీషా సేవకుడు గేహజీ, “నా యజమాని అరామీయుడైన నయమాను తెచ్చిన కానుక తీసుకోకుండా ఊరికే వెళ్లనిచ్చాడు. సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను అతని వెంట పరిగెత్తి అతని నుండి ఏదైనా తీసుకుంటాను” అని తన మనస్సులో అనుకున్నాడు.

  9. కాబట్టి గేహజీ నయమాను వెనకే త్వరగా వెళ్లాడు. నయమాను తన వెనుక ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ రావడం గమనించి రథం దిగి అతన్ని కలుసుకొని, “అంతా క్షేమమేనా?” అని అడిగాడు.

  10. అతడు లోపలికి వెళ్లి తన యజమాని ముందు నిలబడినప్పుడు, ఎలీషా అతన్ని, “గేహజీ ఎక్కడికి వెళ్లావు?” అని అడిగాడు. “మీ దాసుడనైన నేను ఎక్కడికి వెళ్లలేదు” అని గేహజీ జవాబిచ్చాడు.

  11. ఆ సమయంలో, దైవజనుని సేవకుడైన గేహజీతో రాజు మాట్లాడుతూ, “ఎలీషా చేసిన గొప్పకార్యాలు నాకు చెప్పు” అన్నాడు.

  12. ఎలీషా ఎలా చచ్చినవాన్ని బ్రతికించాడో గేహజీ రాజుకు చెప్తూ ఉండగానే, అతడు బ్రతికించిన బాలుని తల్లి తన ఇల్లు అలాగే భూమి కోసం రాజుకు మనవి చేసుకోవడానికి వచ్చింది. గేహజీ, “నా ప్రభువా, రాజా, ఈవిడే ఆ స్త్రీ, ఇతడే ఎలీషా బ్రతికించిన ఈ స్త్రీ కుమారుడు” అని అన్నాడు.