Judge గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
దేవునికి భయపడే, అన్యాయపు లాభాన్ని అసహ్యించుకునే, నమ్మదగిన సామర్థ్యం కలిగిన పురుషులను ప్రజలందరిలో నుండి ఎంపికచేయాలి. తర్వాత వారిని వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాలి.
వారు అన్ని వేళలా ప్రజలకు న్యాయాధిపతులుగా ఉండాలి, కాని ప్రతీ కఠిన సమస్యను నీ దగ్గరకు తీసుకువచ్చేలా చూడు, మామూలు సమస్యల విషయంలో వారే నిర్ణయించవచ్చు. ఈ విధంగా చేస్తే వారు నీతో పాటు నీ భారాన్ని పంచుకుంటారు, కాబట్టి నీకు భారం తగ్గుతుంది.
అయితే నేనొక్కడినే మీ సమస్యలను మీ భారాలను మీ వివాదాలను ఎలా తీర్చగలను?
ప్రతి గోత్రంలో నుండి జ్ఞాన వివేకాలు కలిగిన పురుషులను ఎంపిక చేయండి, నేను వారిని మీకు నాయకులుగా నియమిస్తాను” అని చెప్పాను.
అందుకు మీరు, “నీవు చెప్పింది బాగుంది” అని జవాబిచ్చారు.
కాబట్టి మీ గోత్రాల్లో నుండి జ్ఞానం కలిగి ప్రసిద్ధులైన వారిని పిలిపించి, వారిని మీ గోత్రాలకు అధికారులుగా, వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాను.
అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో, “మీ ప్రజలమధ్య ఉన్న వివాదాలు విని, ఇద్దరు ఇశ్రాయేలీయుల మధ్య అయినా లేదా ఒక ఇశ్రాయేలీయునికి ఒక విదేశీయునికి మధ్య అయినాసరే, న్యాయంగానే తీర్పు తీర్చాలి.
తీర్పు తీర్చడంలో పక్షపాతం చూపించవద్దు; పేదవారైనా గొప్పవారైనా సరే ఒకే రీతిగా వినాలి, తీర్పు దేవునికి సంబంధించింది కాబట్టి ఎవరికి భయపడవద్దు. మీకు పరిష్కరించడానికి కష్టంగా ఉన్న సమస్యను నా దగ్గరకు తీసుకురండి, నేను దానిని వింటాను” అని చెప్పాను.
మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ప్రతి పట్టణంలో మీ గోత్రాలకు న్యాయాధిపతులను, అధికారులను మీరు నియమించాలి, వారు న్యాయంగా ప్రజలకు తీర్పు తీర్చాలి.
న్యాయం తప్పి తీర్పు చెప్పకూడదు లేదా పక్షపాతం చూపించకూడదు. లంచం తీసుకోకూడదు, ఎందుకంటే లంచం జ్ఞానుల కళ్లకు గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది, నిర్దోషుల మాటలను వక్రీకరిస్తుంది.
మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో మీరు జీవించేలా న్యాయాన్ని కేవలం న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి.
మీ దగ్గరకు వచ్చిన వివాదాలలో మీరు తీర్పు తీర్చడానికి చాలా కష్టంగా ఉన్న వివాదాలను అంటే రక్తపాతానికి సంబంధించినవి గాని వాదనలు గాని దాడులు గాని అలాంటి వాటిని మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలానికి తీసుకెళ్లండి.
లేవీయ యాజకుల దగ్గరకు, ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తి దగ్గరకు వెళ్లండి. వాటి గురించి విచారించండి, వారు మీకు తీర్పు ఇస్తారు.
మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలంలో వారు మీకు తెలియజేసిన నిర్ణయాల ప్రకారం మీరు నడుచుకోవాలి. మీరు చేయాలని వారు మీకు చెప్పే ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి.
వారు మీకు బోధించిన, ఇచ్చిన నిర్ణయాల ప్రకారం మీరు చేయాలి. వారు మీకు చెప్పిన వాటినుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగకూడదు.
ఒకవేళ కపట బుద్ధి గలవాడు ఎవరిమీదైనా నేరారోపణ చేయడానికే పూనుకుంటే,
ఆ వివాదంలో ఉన్న ఇద్దరూ యెహోవా ఎదుట అంటే ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న యాజకుల ఎదుట న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి.
న్యాయాధిపతులు ఆ వాదనను బాగా విచారణ చేయాలి, సాక్షి అబద్ధికుడని రుజువైతే, తోటి ఇశ్రాయేలీయులపై అబద్ధ సాక్ష్యమును పలికిన ఎడల,
వాడు తలపెట్టిన కీడు వాడి మీదకే రావాలి, ఆ విధంగా న్యాయమైన తీర్పు చెప్పి మీ మధ్య నుండి దుర్మార్గాన్ని తొలగించాలి.
ప్రజలకు వివాదం ఉన్నప్పుడు, వారు దానిని న్యాయస్థానానికి తీసుకెళ్లాలి, న్యాయాధిపతులు నిర్దోషులను విముక్తులుగా ప్రకటిస్తూ, దోషులను దోషులుగా ప్రకటిస్తారు.
ఒకవేళ దోషులు శిక్షార్హులైతే న్యాయాధిపతి వారిని పడుకోబెట్టి అతని సమక్షంలో నేరానికి తగ్గట్టుగా కొరడా దెబ్బల సంఖ్యతో కొరడాతో కొట్టాలి,
కానీ న్యాయాధిపతి నలభైకి మించి కొరడా దెబ్బలు వేయకూడదు. దోషిని అంతకు మించి కొరడాలతో కొడితే మీ తోటి ఇశ్రాయేలీయుడు మీ దృష్టిలో దిగజారిపోతాడు.
కొంతకాలం తర్వాత ఇద్దరు వేశ్యలు రాజు దగ్గరకు వచ్చి అతని ముందు నిలబడ్డారు.
వారిలో ఒక స్త్రీ అన్నది, “నా ప్రభువా, దయచేసి వినండి. ఈ స్త్రీ, నేను ఒకే ఇంట్లో ఉంటాము. ఈమె నాతో ఉన్నప్పుడు నేను శిశువును కన్నాను.
నాకు శిశువు పుట్టిన మూడవ రోజు ఈమెకు కూడ శిశువు పుట్టాడు. మేము ఒంటరిగా ఉన్నాము; మేము తప్ప ఇంట్లో మరొకరు లేరు.