కంటెంట్‌కు వెళ్లండి

Judge గురించి బైబిల్ వచనాలు

91 వచనాలు · 6 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. పండుగ రోజు ప్రజల ఎన్నుకున్న ఒక నేరస్థుని విడుదల చేయడం అధిపతికి ఆనవాయితి.

  2. ఆ సమయంలో బందిపోటు దొంగగా పేరుమోసిన బరబ్బ అనే ఖైదీ ఉన్నాడు.

  3. కాబట్టి జనసమూహం సమకూడినప్పుడు, పిలాతు, “నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు? యేసు అనబడిన బరబ్బనా లేదా క్రీస్తు అనబడిన యేసునా?” అని వారిని అడిగాడు.

  4. ఎందుకంటే వారు కేవలం అసూయతోనే యేసును అప్పగించారని అతడు గ్రహించాడు.

  5. పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, అతని భార్య అతనికి: “నీవు ఆ నిర్దోషి జోలికి పోవద్దు, రాత్రి కలలో ఆయన గురించి నేను చాలా కష్టపడ్డాను” అని వర్తమానం పంపింది.

  6. కాని ముఖ్య యాజకులు నాయకులు బరబ్బాను విడుదల చేసి యేసును చంపమని అడిగేలా ప్రజలను రెచ్చగొట్టారు.

  7. అధిపతి, “ఈ ఇద్దరిలో నేను ఎవనిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?” అని వారిని అడిగాడు. వారు, “బరబ్బనే” అని కేకలు వేశారు.

  8. అందుకు పిలాతు, “అలాగైతే క్రీస్తు అనబడిన యేసును, ఏమి చేయాలి?” అని వారిని అడిగాడు. అందుకు వారు, “సిలువ వేయండి!” అని కేకలు వేశారు.

  9. “ఎందుకు? ఇతడు చేసిన నేరమేంటి?” అని పిలాతు అడిగాడు. అయితే వారు ఇంకా గట్టిగా, “అతన్ని సిలువ వేయండి!” అని కేకలు వేశారు.

  10. పిలాతు అల్లరి ఎక్కువ అవుతుంది తప్ప తాను ఏమి చేయలేకపోతున్నానని గ్రహించి, నీళ్లు తీసుకుని ప్రజలందరి ముందు తన చేతులను కడుక్కుని, “ఈయన రక్తం విషయంలో నేను నిర్దోషిని, ఇక మీదే బాధ్యత!” అని చెప్పాడు.

  11. అప్పుడు ప్రజలందరు, “ఇతని రక్తం మామీద మా పిల్లల మీద ఉండును గాక!” అని కేకలు వేశారు.

  12. అప్పుడు పిలాతు బరబ్బను వారికి విడుదల చేశాడు. యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయడానికి అప్పగించాడు.

  13. ఆ అధిపతి ఆ ఉత్తరం చదివి, అతడు ఏ ప్రాంతానికి చెందిన వాడు అని అడిగాడు. అతడు కిలికియకు చెందినవాడని తెలుసుకొని,

  14. “నీ మీద నేరం మోపిన వారు కూడా ఇక్కడకు వచ్చినప్పుడు నీ విషయాన్ని నేను విచారిస్తాను” అని చెప్పి, అతన్ని హేరోదు రాజగృహంలో కాపలా మధ్యలో ఉంచాలని ఆదేశించాడు.

  15. ఒకవేళ, నేను మరణశిక్షకు తగిన తప్పును చేస్తే, నేను మరణశిక్షను నిరాకరించను. కానీ ఈ యూదులు నాకు వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదులలో సత్యం లేనప్పుడు, నన్ను వారికి అప్పగించే అధికారం ఎవరికి లేదు. నేను కైసరుకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను!” అని చెప్పాడు.

  16. ఫేస్తు తన న్యాయసభతో కలిసి చర్చించిన అతడు, “నీవు కైసరు దగ్గర విజ్ఞప్తి చేసుకుంటానని చెప్పావు కాబట్టి నీవు కైసరు దగ్గరకే వెళ్తావు!” అని ప్రకటించాడు.