Skip to content

Infidelity గురించి బైబిల్ వచనాలు

97 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మేము ఆయనను సేవించడానికి సర్వశక్తిమంతుడు ఎవరు? మేము ఆయనకు ప్రార్థిస్తే మాకే లాభం కలుగుతుంది?’ అంటారు.

  2. అయినా నీవు, ‘దేవునికేమి తెలుసు? గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయం చెప్పగలడా?

  3. ఆకాశమండలం పైన ఆయన తిరుగుచున్నాడు కాబట్టి మేఘాలు ఆయనను కప్పివేశాయి ఆయన చూడలేడు’ అని అంటున్నావు.

  4. న్యాయాన్ని ద్వేషించేవాడు పరిపాలించగలడా? బలాఢ్యుడైన న్యాయవంతుడైన దేవుని మీద నీవు నేరం మోపుతావా?

  5. ‘మీరు పనికిమాలినవారు’ అని రాజులతో, ‘మీరు దుష్టులు’ అని సంస్థానాధిపతులతో చెప్పేవాడు ఈయన కాడా,

  6. ఆయన అధికారులంటే పక్షపాతం లేదు ఆయన బీదలను కాదని ధనవంతులకు దయచూపించడు, అందరు ఆయన చేతుల్లో సృష్టించబడినవారే కదా.

  7. పొగిడే ప్రతి పెదవిని గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకను యెహోవా మౌనం చేయును గాక.

  8. “మా నాలుకలతో మేము గెలుస్తాం; మా పెదవులు మమ్మల్ని కాపాడతాయి; మామీద ప్రభువెవరు?” అని వారంటారు.

  9. వారు దేవునికి ప్రతికూలంగా మాట్లాడారు; వారు, “ఈ ఎడారిలో దేవుడు మనకు భోజనం సరఫరా చేయగలడా?

  10. నిజమే, ఆయన బండరాయిని కొట్టారు, నీరు బయటకు వచ్చింది, ప్రవాహాలు సమృద్ధిగా ప్రవహించాయి, కాని ఆయన మనకు రొట్టె కూడా ఇవ్వగలరా? ఆయన తన ప్రజలకు మాంసం అందించగలడా?” అన్నారు.

  11. యెహోవా వారి మాట విని కోపగించారు; ఆయన అగ్ని యాకోబుకు వ్యతిరేకంగా రగులుకొంది, ఆయన ఉగ్రత ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా లేచింది.

  12. ఎందుకంటే వారు దేవునిలో విశ్వాసముంచలేదు. ఆయన ఇచ్చే విడుదలలో నమ్మకముంచలేదు.

  13. వారంటారు, “యెహోవా చూడడం లేదు; యాకోబు దేవుడు గమనించడంలేదు.”

  14. ప్రజల్లో తెలివిలేని మీరు, గమనించండి; అవివేకులారా, మీరు ఎప్పుడు జ్ఞానులవుతారు?

  15. చెవులిచ్చినవాడు వినడా? కళ్ళిచ్చిన వాడు చూడడా?

  16. మనోహరమైన దేశాన్ని వారు తిరస్కరించారు; వారాయన మాట నమ్మలేదు.

  17. యెహోవా మాట వినక, డేరాలలో సణగ సాగారు.

  18. వారు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, మహోన్నతుని ప్రణాళికలను తృణీకరించారు.

  19. కాబట్టి ఆయన వారిని వెట్టిచాకిరికి అప్పగించారు; వారు తొట్రిల్లారు సాయం చేసేవాడు ఒక్కడూ లేడు.

  20. మోసమనే త్రాళ్లతో పాపాన్ని లాక్కొనే వారికి, బండి త్రాళ్లతో దుర్మార్గాన్ని లాక్కొనే వారికి శ్రమ.

  21. “దేవుడు త్వరపడాలి; ఆయన పనిని త్వరగా చేయాలి అప్పుడు ఆయన కార్యాలు మేము చూస్తాము. ఇశ్రాయేలు పరిశుద్ధుని ఆలోచన ఆచరణలోకి రావాలి, అప్పుడు మేము తెలుసుకుంటాము” అనే వారికి శ్రమ.

  22. వారు సైన్యాల యెహోవా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్యాన్ని తృణీకరించారు, కాబట్టి మంటలు గడ్డిని కాల్చినట్లుగా ఎండుగడ్డి మంటలో కాలిపోయినట్లుగా వారి వేరులు కుళ్లిపోతాయి, వారి పూలు ధూళిలా ఎగిరిపోతాయి.

  23. కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతుంది; ఆయన వారి మీదికి తన చేయి చాచి వారిని కొడతారు. పర్వతాలు వణుకుతాయి, వీధుల్లో వారి శవాలు పెంటలా పడి ఉన్నాయి. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.

  24. “ఆయన ఎవరికి బోధించే ప్రయత్నం చేస్తున్నారు? ఆయన తన సందేశాన్ని ఎవరికి వివరిస్తున్నారు? తల్లి రొమ్ము విడిచిన వారికా, స్తన్యమును విడిచిన వారికా?

  25. ఇది చేయండి, అది చేయండి దీనికి ఈ నియమం, దానికి ఆ నియమం; కొంత ఇక్కడ, కొంత అక్కడ” అని వారు అనుకుంటారు.