Caleb
Caleb ను ప్రస్తావించే వచనాలు
యూదా గోత్రం నుండి యెఫున్నె కుమారుడైన కాలేబు;
అప్పుడు కాలేబు మోషే ఎదుట ప్రజలను శాంత పరుస్తూ, “తప్పకుండా మనం వెళ్లి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి, ఖచ్చితంగా చేయగలం” అని అన్నాడు.
ఆ దేశాన్ని వేగు చూడడానికి వెళ్లిన వారిలో ఉన్న నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు తమ బట్టలు చింపుకొని,
అయితే నా సేవకుడు కాలేబు భిన్నమైన ఆత్మ కలిగి ఉండి నన్ను హృదయమంతటితో వెంబడిస్తున్నందుకు, అతడు వెళ్లిన దేశంలోకి నేను అతన్ని తీసుకువస్తాను, అతని వారసులు దానిని స్వతంత్రించుకుంటారు.
నేను చేయెత్తి వాగ్దానం చేసిన భూమిలో యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మీలో ఏ ఒక్కరు ప్రవేశించరు.
ఆ దేశాన్ని పరిశీలించిన వారిలో నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రమే బ్రతికారు.
ఎందుకంటే యెహోవా ఆ ఇశ్రాయేలీయులు అరణ్యంలో తప్పక చస్తారని చెప్పారు, యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఏ ఒక్కరు మిగల్లేదు.
కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువ మాత్రమే వెళ్తారు, ఎందుకంటే వీరు యెహోవాను హృదయమంతటితో వెంబడించారు.’
“వారి పేర్లు ఇవి: “యూదా గోత్రం నుండి, యెఫున్నె కుమారుడైన కాలేబు;
యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవరు చూడరు. అతడు హృదయమంతటితో యెహోవాను అనుసరించాడు కాబట్టి దానిని చూస్తాడు. అతడు అడుగుపెట్టిన దేశాన్ని అతనికి, అతని సంతానానికి నేను ఇస్తాను” అని ప్రమాణం చేశారు.
యూదా ప్రజలు గిల్గాలులో ఉన్న యెహోషువ దగ్గరకు వచ్చి, కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో, “నీ గురించి, నా గురించి కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా ఏమి చెప్పారో నీకు తెలుసు.
అప్పుడు యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబును దీవించి అతనికి హెబ్రోనును వారసత్వంగా ఇచ్చాడు.
అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను హృదయమంతటితో అనుసరించాడు కాబట్టి అప్పటినుండి హెబ్రోను కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడు కాలేబుకు వారసత్వంగా ఉంది.
యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబుకు యూదాలో ఒక భాగాన్ని అనగా కిర్యత్-అర్బాను, అంటే హెబ్రోనును ఇచ్చాడు. (అర్బా అనాకు యొక్క పూర్వికుడు.)
కాలేబు హెబ్రోను నుండి అనాకు కుమారులైన షేషయి, అహీమాను, తల్మయి అనే ముగ్గురు అనాకీయులను వెళ్లగొట్టాడు.
కాలేబు, “కిర్యత్-సెఫెరు మీద దాడి చేసి స్వాధీనపరచుకున్న వ్యక్తికి నా కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్ళి చేస్తాను” అని అన్నాడు.
కాలేబు సోదరుడూ కెనజు కుమారుడైన ఒత్నీయేలు దానిని స్వాధీనపరచుకున్నాడు; కాబట్టి కాలేబు తన కుమార్తె అక్సాను అతనికిచ్చి పెళ్ళి చేశాడు.
ఒక రోజు ఆమె ఒత్నీయేలు దగ్గరకు వచ్చి తన తండ్రిని ఒక పొలం అడగమని అతన్ని కోరింది. ఆమె తన గాడిదను దిగినప్పుడు కాలేబు, “నేను నీకేమి చేయాలి?” అని ఆమెను అడిగాడు.
అయితే వారు యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఆ పట్టణం చుట్టూ ఉన్న పొలాలను, గ్రామాలను స్వాస్థ్యంగా ఇచ్చారు.
కాలేబు, “కిర్యత్-సెఫెరు మీద దాడి చేసి స్వాధీనపరచుకున్న వ్యక్తికి నా కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్ళి చేస్తాను” అని అన్నాడు.
కాలేబు సోదరుడూ కెనజు కుమారుడైన ఒత్నీయేలు దానిని స్వాధీనపరచుకున్నాడు; కాబట్టి కాలేబు తన కుమార్తె అక్సాను అతనికిచ్చి పెళ్ళి చేశాడు.
ఒక రోజు ఆమె ఒత్నీయేలు దగ్గరకు వచ్చి తన తండ్రిని ఒక పొలం అడగమని అతన్ని కోరింది. ఆమె తన గాడిదను దిగినప్పుడు కాలేబు, “నేను నీకేమి చేయాలి?” అని ఆమెను అడిగాడు.
ఆమె జవాబిస్తూ, “నాకు ప్రత్యేక దీవెన కావాలి. నీవు నాకు దక్షిణం దేశంలో భూమి ఇచ్చావు, ఇప్పుడు నీటి ఊటలు కూడా ఇవ్వు” అని అన్నది. కాబట్టి కాలేబు ఆమెకు ఎగువ, దిగువ నీటి మడుగులను ఇచ్చాడు.
మోషే వాగ్దానం చేసినట్లు కాలేబుకు హెబ్రోను ఇవ్వబడింది, అతడు అనాకు యొక్క ముగ్గురు కుమారులను తరిమేశాడు.
అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఆయన వారి కోసం రక్షకునిగా కాలేబు తమ్ముడైన కెనజు కుమారుడైన ఒత్నీయేలును నియమించారు, అతడు వారిని రక్షించాడు.