Skip to content

Infidelity గురించి బైబిల్ వచనాలు

97 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ ప్రజలను పాలిస్తున్న ఎగతాళి చేసేవారలారా, యెహోవా వాక్కు వినండి.

  2. “మేము చావుతో నిబంధన చేసుకున్నాం, పాతాళంతో ఒప్పందం చేసుకున్నాము. ప్రమాదం ప్రవాహంలా వేగంగా వచ్చినప్పుడు అది మమ్మల్ని తాకదు, ఎందుకంటే అబద్ధాన్ని మాకు అండగా చేసుకున్నాం, అసత్యాన్ని మా దాగు స్థలంగా చేసుకున్నాం” అని మీరు అతిశయిస్తున్నారు.

  3. నేను న్యాయాన్ని కొలమానంగా, నీతిని మట్టపు గుండుగా చేస్తాను: వడగండ్లు మీ అబద్ధం అనే ఆశ్రయాన్ని తుడిచివేస్తాయి. మీ దాగుచోటు నీటికి కొట్టుకుపోతుంది.

  4. చావుతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడుతుంది; పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం నిలవదు. ప్రవాహంలా శాపం మీ మీదికి వచ్చినప్పుడు మీరు దానిచే కొట్టబడతారు.

  5. అది వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని ఈడ్చుకెళ్తుంది; ప్రతి ఉదయం, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది ఈడ్చుకెళ్తుంది.” ఈ సందేశాన్ని గ్రహించినప్పుడు చాలా భయం పుడుతుంది.

  6. పడుకోడానికి మంచం పొడవు సరిపోదు. కప్పుకోడానికి దుప్పటి వెడల్పు చాలదు.

  7. నిజంగా తన పనిని తన ఆశ్చర్యకరమైన పనిని అపూర్వమైన తన పని చేయడానికి ఆయన పెరాజీము అనే కొండమీద లేచినట్లుగా యెహోవా లేస్తారు. గిబియోను లోయలో ఆయన రెచ్చిపోయినట్లు రెచ్చిపోతారు.

  8. ఇప్పుడు మీ ఎగతాళి మానండి లేదంటే మీ సంకెళ్ళు మరింత భారమవుతాయి; భూమంతా ఖచ్చితంగా నాశనం చేయబడుతుందని సైన్యాల అధిపతియైన యెహోవా నాకు చెప్పారు.

  9. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా దాచడానికి గొప్ప లోతుల్లోకి వెళ్లే వారికి శ్రమ. “మమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు తెలుసుకుంటారు?” అని అనుకుని, చీకటిలో తమ పనులు చేసేవారికి శ్రమ.

  10. మీరు విషయాలను తలక్రిందులుగా చూస్తారు కుమ్మరిని మట్టితో సమానంగా చూస్తారు! చేయబడిన వస్తువు దానిని చేసినవానితో, “నీవు నన్ను చేయలేదు” అని అనవచ్చా? కుండ కుమ్మరితో, “నీకు ఏమి తెలియదు” అని అనవచ్చా?

  11. “మట్టి కుండ పెంకులలో ఒక పెంకుగా ఉండి తనను చేసినవానితో వాదించే వారికి శ్రమ. జిగటమన్ను కుమ్మరితో, ‘నీవు ఏం తయారుచేస్తున్నావు?’ అని అంటుందా? అతని పని అతనితో, ‘కుమ్మరికి నైపుణ్యం లేదు’ అని అంటుందా?

  12. ‘నీవు కన్నది ఏంటి?’ అని తండ్రితో అనే వానికి, ‘నీ గర్భంలో పుట్టింది ఏంటి?’ అని తల్లితో అనే వానికి శ్రమ.

  13. నీ చెడుతనాన్ని నీవు నమ్ముకుని ‘ఎవరూ నన్ను చూడరు’ అని అనుకున్నావు. ‘నేనే, నేను తప్ప వేరే ఎవరూ లేరు’ అని నీకు నీవు అనుకున్నప్పుడు నీ జ్ఞానం నీ తెలివి నిన్ను తప్పుదారి పట్టించాయి.

  14. విపత్తు నీ మీదికి వస్తుంది, దానిని మాయాజాలంతో ఎలా పోగొట్టాలో నీవు తెలుసుకోలేవు. ఒక కీడు నీ మీద పడుతుంది దానిని నీవు డబ్బుతో నివారించలేవు; నీకు తెలియని నాశనం నీ మీదికి అకస్మాత్తుగా వస్తుంది.

  15. మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? ఎవరిని చూసి వెక్కిరిస్తూ మీ నాలుక చాపుతున్నారు మీరు తిరుగుబాటుదారులు, అబద్ధికుల సంతానం కాదా?

  16. మీరు సింధూర వృక్షాల క్రింద పచ్చని ప్రతి చెట్టు క్రింద కామంతో రగిలిపోతున్నారు; మీరు కనుమలలో, రాతిసందుల క్రింద మీ పిల్లలను బలి ఇస్తారు.

  17. కనుమలలోని నున్నని రాళ్ల మధ్యలో ఉన్న విగ్రహాలు మీ భాగము; నిజంగా అవే మీకు భాగము. అవును వాటికి మీ పానార్పణలు పోశారు, భోజనార్పణలు చెల్లించారు. ఇదంతా చూసి నేను క్షమించాలా?

  18. చాలా ఎత్తైన పర్వతం మీద మీరు మీ పరుపు వేసుకున్నారు; బలులు అర్పించడానికి అక్కడికి ఎక్కి వెళ్లారు.

  19. తలుపుల వెనుక ద్వారబంధాల వెనుక మీ యూదేతర గుర్తులు పెట్టారు. నన్ను విడిచిపెట్టి మీ పరుపును పరిచారు దాని మీదకు ఎక్కి దానిని వెడల్పు చేశారు; మీరు వారి మంచాలను ప్రేమించి వారితో నిబంధన చేసుకున్నారు. వారి నగ్న శరీరాలను కామంతో చూశారు.

  20. మీరు ఒలీవనూనె తీసుకుని మోలెకు దగ్గరకు వెళ్లారు ఎన్నో సుగంధ ద్రవ్యాలను తీసుకెళ్లారు. మీరు మీ రాయబారులను దూరప్రాంతానికి పంపించారు; మీరు పాతాళమంత లోతుగా దిగబడిపోయారు!

  21. మీరు దూర ప్రయాణాలు చేసి అలసిపోయారు, అయినా ‘అది సాధ్యం కాదు’ అని మీరు అనుకోలేదు. మీరు మీ తిరిగి బలం పొందుకున్నారు కాబట్టి మీరు సొమ్మసిల్లలేదు.

  22. “మీరు ఎవరికి జడిసి భయపడి నా పట్ల నిజాయితీగా లేకుండా, నన్ను జ్ఞాపకం చేసుకోకుండా దీనిని పట్టించుకోకుండా ఉన్నారు? చాలా కాలం నేను మౌనంగా ఉన్నానని మీరు నాకు భయపడడం లేదు కదా?

  23. అందుకు ఆయన నాతో, “ఇశ్రాయేలు ప్రజల పాపాలు, యూదా ప్రజల పాపాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ దేశమంతా రక్తపాతంతో పట్టణమంతా అన్యాయంతో నిండిపోయింది. యెహోవా మమ్మల్ని చూడడు; యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడని వారు అనుకుంటున్నారు.

  24. కాబట్టి వారి మీద ఏమాత్రం దయ చూపించను వారిని కనికరించను కాని వారు చేసిన దానికి తగిన ప్రతిఫలాన్ని నేను వారికి ఇస్తాను” అన్నారు.

  25. “రాజు తన ఇష్టానుసారంగా చేస్తాడు. తనను తాను ప్రతి దేవునిపైన హెచ్చించుకొని, ఘనపరచుకొని, దేవాది దేవునికి వ్యతిరేకంగా ఎన్నడు వినని విషయాలు మాట్లాడతాడు. ఉగ్రత కాలం పూర్తయ్యే వరకు అతడు వర్ధిల్లుతూ ఉంటాడు, ఎందుకంటే నిర్ణయించబడింది జరగాలి.