Skip to content

Infidelity గురించి బైబిల్ వచనాలు

97 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతడు తన పూర్వికుల దేవుళ్ళను గాని, స్త్రీలు కోరే దేవున్ని కాని, ఏ ఇతర దేవతను గాని ఆలోచింపక, వారందరి మీద తనను తాను హెచ్చించుకుంటాడు.

  2. కాబట్టి ఇప్పుడు యెహోవా చెప్పేది వినండి. నీవు ఇలా అంటున్నావు, “ ‘ఇశ్రాయేలుకు విరుద్ధంగా ప్రవచించకు, ఇస్సాకు సంతానానికి విరుద్ధంగా ప్రసంగించడం ఆపు.’

  3. “కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: “ ‘నీ భార్య పట్టణంలో వేశ్యగా మారుతుంది, నీ కుమారులు, కుమార్తెలు ఖడ్గానికి కూలుతారు. నీ భూమి కొలవబడి విభజించబడుతుంది, నీవు యూదేతర దేశంలో చస్తావు. ఇశ్రాయేలు ప్రజలు తమ సొంత దేశానికి దూరంగా, బందీలుగా వెళ్తారు.’ ”

  4. యెహోవా చెప్పేదేమంటే, “నాకు వ్యతిరేకంగా మీరు చాలా గర్వించి మాట్లాడారు.” “అయినా మేము నీకు వ్యతిరేకంగా ఏం మాట్లాడాము?” అని మీరు అడుగుతున్నారు.

  5. “మీరు ఇలా అంటారు, ‘దేవునికి సేవ చేయడం వ్యర్థం, ఆయన ఆజ్ఞ ప్రకారం ప్రవర్తిస్తూ సైన్యాలకు అధిపతియైన యెహోవా ఎదుట దుఃఖా క్రాంతులై తిరుగుతూ ఉండి ప్రయోజనం ఏంటి?

  6. “ఆ తర్వాత ఒక తలాంతు బంగారం తీసికొన్నవాడు వచ్చి, ‘యజమానుడా, నీవు కఠినుడవని, విత్తనాలు విత్తని చోట పంట కోసేవాడవు, వెదజల్లని చోట పంట కూర్చుకునే వాడవని నాకు తెలుసు.

  7. కాబట్టి నేను భయపడి వెళ్లి, నీ తలాంతు బంగారాన్ని భూమిలో దాచి పెట్టాను’ అని చెప్పాడు.

  8. “అందుకు అతని యజమానుడు వానితో, ‘సోమరియైన చెడ్డ దాసుడా! నేను విత్తనాలు విత్తని చోట కోసే వాడను అని, వెదజల్లని చోట పంట కూర్చుకునే వాడనని నీకు తెలుసు కదా?

  9. అలాగైతే, నీవు నా సొమ్మును వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టాల్సింది, అప్పుడు నేను వచ్చి దానిని వడ్డీతో కలిపి తీసుకునేవాన్ని’ అన్నాడు.

  10. ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ,

  11. “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతానన్నావు, నిన్ను నీవే రక్షించుకో! నీవు దేవుని కుమారుడవైతే, సిలువ మీద నుండి దిగిరా” అని అంటూ దూషించారు.

  12. అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నాయకులు కూడా ఆయనను ఎగతాళి చేశారు,

  13. “వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు! ఇశ్రాయేలీయుల రాజు కదా! ఇప్పుడు సిలువ మీది నుండి దిగివస్తే, మేము ఇతన్ని నమ్ముతాము.

  14. వీడు దేవుని నమ్మాడు. ‘నేను దేవుని కుమారుడనని’ చెప్పుకొన్నాడు కదా, దేవునికి ఇష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అన్నారు.

  15. ఆయనతో కూడా సిలువవేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు.

  16. కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? “నీవు నన్ను ఇలా ఎందుకు చేశావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?”

  17. ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరివానికి అధికారం లేదా?

  18. అన్నిటికి మించి, అంత్యదినాలలో తమ చెడు కోరికలనే అనుసరించే అపహాసకులు వస్తారని మీరు గ్రహించాలి.

  19. “ ‘వస్తాను’ అని ఆయన చేసిన వాగ్దానం ఎక్కడ ఉంది? మన పితరులు ఎప్పుడో చనిపోయారు, సృష్టి ఆరంభం నుండి ఎలా ఉందో, మార్పు లేకుండా అంతా అలాగే జరుగుతుంది” అని వారు చెప్తారు.

  20. అయితే, పూర్వకాలంలో దేవుని వాక్యం వలన ఆకాశాలు సృజింపబడ్డాయని, నీళ్ల నుండి నీళ్ల ద్వారా భూమి ఏర్పడిందని వారు ఉద్దేశపూర్వకంగా మరచిపోతారు.

  21. “అంత్యదినాలలో తమ చెడు కోరికలనే అనుసరించే అపహాసకులు ఉంటారు” అని వారు మీకు చెప్పారు.

  22. అలాంటివారు సహజ సంబంధులు, వీరు ఆత్మలేనివారిగా ఉండి, మీలో విభేదాలు పుట్టిస్తారు.