కంటెంట్‌కు వెళ్లండి

Ark of the Covenant గురించి బైబిల్ వచనాలు

88 వచనాలు · 37 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆ బండి బేత్-షెమెషుకు చెందిన యెహోషువ పొలంలోనికి వచ్చి, అక్కడ ఉన్న ఒక పెద్ద బండ ప్రక్కన ఆగింది. ప్రజలు ఆ బండి కర్రలను నరికి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించారు.

  2. లేవీయులు యెహోవా మందసాన్ని, బంగారపు వస్తువులు ఉన్న ఆ చిన్న పెట్టెను దించి వాటిని ఆ పెద్ద బండ మీద పెట్టారు. ఆ రోజే బేత్-షెమెషు ప్రజలు యెహోవాకు దహనబలులు అర్పించి, బలులు వధించారు.

  3. అయిదుగురు ఫిలిష్తీయుల పాలకులు అదంతా చూసి ఆ రోజే ఎక్రోనుకు తిరిగి వెళ్లిపోయారు.

  4. ఫిలిష్తీయులు యెహోవాకు అపరాధపరిహార అర్పణగా పంపిన బంగారు గడ్డలు అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోనులకు ఒక్కొక్కటి.

  5. బంగారు ఎలుకల సంఖ్య అయిదుగురు ఫిలిష్తీయుల పాలకులకు చెందిన కోటగోడలు గల పట్టణాలు చుట్టుప్రక్కల గ్రామాల లెక్క ప్రకారం ఉంది. బేత్-షెమెషులోని యెహోషువ పొలంలో లేవీయులు యెహోవా మందసాన్ని పెట్టిన పెద్ద బండ నేటికీ సాక్షిగా ఉంది.

  6. దావీదు మరలా ఇశ్రాయేలీయులలో ముప్పైవేలమంది సామర్థ్యంగల యువకులను సమకూర్చుకున్నాడు.

  7. కెరూబుల మధ్య ఆసీనుడైన సైన్యాల యెహోవా అని పిలువబడే దేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు, అతనితో ఉన్న మనుష్యులందరు యూదాలోని బయలాకు వెళ్లారు.

  8. వారు కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటి నుండి దేవుని మందసాన్ని క్రొత్త బండిమీద ఎక్కించారు. అబీనాదాబు కుమారులైన ఉజ్జా, అహియోలు ఆ బండిని తోలుతుండగా అహియో దాని ముందు నడిచాడు.

  9. And they brought it out of the house of Abinadab which was at Gibeah, accompanying the ark of God: and Ahio went before the ark.

  10. దావీదు, ఇశ్రాయేలీయులందరు పాటలు పాడుతూ, దేవదారు కర్రతో చేసిన చిరతలు, సితారలు, వీణలు, తంబురలు, డప్పులు, తాళాలు వాయిస్తూ తమ శక్తి అంతటితో యెహోవా ఎదుట ఉత్సహిస్తూ ఉన్నారు.

  11. వారు నాకోను నూర్పిడి కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు, ఎడ్లు తడబడినందుకు ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు.

  12. ఉజ్జా చేసిన తప్పును బట్టి యెహోవా కోపం అతని మీద రగులుకుని దేవుడు అతన్ని మొత్తగా అతడు దేవుని మందసం ప్రక్కనే పడి చనిపోయాడు.

  13. యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకున్నందుకు దావీదుకు కోపం వచ్చింది కాబట్టి ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకు దానికి అదే పేరు.

  14. ఆ రోజు దావీదు యెహోవాకు భయపడి, “యెహోవా మందసాన్ని నా దగ్గరకు ఎలా తెచ్చుకోవాలి?” అని అనుకున్నాడు.

  15. యెహోవా మందసాన్ని తనతో పాటు దావీదు పట్టణానికి తీసుకెళ్లడానికి అతడు ఇష్టపడలేదు, కాబట్టి దావీదు దానిని గిత్తీయుడైన ఓబేద్-ఎదోము ఇంటికి తీసుకెళ్లాడు.

  16. యెహోవా మందసం గిత్తీయుడైన ఓబేద్-ఎదోము ఇంట్లోనే మూడు నెలలు ఉంది. యెహోవా అతన్ని, అతని ఇంటి వారినందరిని దీవించారు.

  17. “దేవుని మందసం ఇంట్లో ఉండడం వల్ల ఓబేద్-ఎదోము కుటుంబమంతటిని అతనికి ఉన్న వాటినన్నిటిని యెహోవా ఆశీర్వదించారు” అని రాజైన దావీదుకు తెలిసింది. దేవుని మందసాన్ని ఓబేద్-ఎదోము ఇంటి నుండి దావీదు పట్టణానికి ఉత్సాహంతో తీసుకురావడానికి దావీదు వెళ్లాడు.

  18. యెహోవా మందసాన్ని మోస్తున్న వ్యక్తులు నడిచేటప్పుడు దావీదు ప్రతి ఆరు అడుగులకు ఒక ఎద్దును, క్రొవ్విన దూడను బలిగా అర్పించాడు.

  19. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించి తన శక్తంతటితో యెహోవా సన్నిధిలో నాట్యం చేశాడు.

  20. ఇలా దావీదు, ఇశ్రాయేలీయులందరు ఆనందోత్సాహాలతో బూరల ధ్వనితో యెహోవా మందసాన్ని తీసుకువచ్చారు.

  21. అప్పుడు రాజైన సొలొమోను దావీదు పట్టణమైన సీయోను నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాల పెద్దలను, ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులందరిని యెరూషలేములో తన దగ్గరకు పిలిపించాడు.

  22. ఏతనీము అనే ఏడవ నెలలో, పండుగ సమయంలో ఇశ్రాయేలీయులందరు రాజైన సొలొమోను ఎదుట సమావేశమయ్యారు.

  23. ఇశ్రాయేలు పెద్దలందరు వచ్చాక, యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని తీసుకుని,

  24. వారు యెహోవా మందసాన్ని, సమావేశ గుడారాన్ని, అందులోని పవిత్ర వస్తువులన్నీ తీసుకువచ్చారు. యాజకులు, లేవీయులు వాటిని పైకి మోసుకెళ్లారు.

  25. రాజైన సొలొమోను, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మందసం ముందు సమావేశమై, లెక్కలేనన్ని గొర్రెలను పశువులను బలి ఇచ్చారు.