కంటెంట్‌కు వెళ్లండి

Afflictions and Adversities గురించి బైబిల్ వచనాలు

526 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కరువు కాలంలో చావు నుండి, యుద్ధంలో ఖడ్గం అంచు నుండి ఆయన నిన్ను తప్పిస్తారు.

  2. కొరడాలవంటి నోటిమాటల నుండి నిన్ను కాపాడతారు, నాశనం వచ్చినా నీవు భయపడవు.

  3. కరువు నాశనం వచ్చినప్పుడు నీవు నవ్వుతావు, అడవి మృగాలకు నీవు భయపడే అవసరం లేదు.

  4. ఎందుకంటే పొలం లోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుంటావు, అడవి జంతువులు నీతో సమాధానంగా ఉంటాయి.

  5. నీ గుడారం క్షేమనివాసమని నీవు తెలుసుకుంటావు; నీ ఆస్తులను లెక్క చూడగా వాటిలో ఒకటి కూడా పోదు.

  6. నీకు చాలామంది పిల్లలు ఉంటారని, నీ సంతానం భూమిమీది గడ్డిని పోలి ఉంటుందని నీవు తెలుసుకుంటావు.

  7. పంట కాలంలో ధాన్యం సేకరించబడినట్లు పూర్తి వయస్సు నిండిన తర్వాత నీవు సమాధికి చేరతావు.

  8. “మేము ఇది పరిశీలించాము, ఇది నిజము. కాబట్టి ఈ మాటలు విని నీ మంచి కోసం తెలుసుకో.”

  9. సర్వశక్తిమంతుడైన దేవుని బాణాలు నాకు గుచ్చుకున్నాయి, నా ఆత్మ వాటికున్న విషం త్రాగింది; దేవుని భయంకరకార్యాలు నాకు వ్యతిరేకంగా మోహరించి ఉన్నాయి.

  10. ఆయన లాక్కుంటే ఎవరు ఆయనను ఆపగలరు? ‘మీరు ఏమి చేస్తున్నారు?’ అని ఆయనను ఎవరు అడగగలరు?

  11. నేను పిలిచినప్పుడు ఆయన సమాధానం ఇచ్చిన కూడా, ఆయన నా మాట వింటారని నేను నమ్మలేను.

  12. తుఫానుతో ఆయన నన్ను నలుగగొడతారు, ఏ కారణం లేకుండా నా గాయాలను ఎక్కువ చేస్తారు.

  13. ఆయన నన్ను ఊపిరి తీసుకోనివ్వరు కాని చేదైన వాటిని నాకు తినిపిస్తారు.

  14. బలం విషయానికొస్తే, ఆయన మహాబలవంతుడు! న్యాయం విషయానికొస్తే, ఆయనకు ప్రతివాదిగా ఎవరు ఉండగలరు?

  15. నేను నిర్దోషినైనా కూడా నా నోరే నన్ను నిందిస్తుంది; నేను నిర్దోషినైనా అదే నన్ను దోషిగా ప్రకటిస్తుంది.

  16. “నేను నిర్దోషినినైనా నా గురించి నాకు శ్రద్ధ లేదు. నా ప్రాణాన్ని నేను తృణీకరిస్తున్నాను.

  17. ఏమి చేసినా ఒక్కటే; అందుకే నేను, దేవుడు నిర్దోషులని దుర్మార్గులని ఏ తేడా లేకుండ నాశనం చేస్తారు అని అంటున్నాను.

  18. ఉపద్రవం అకస్మాత్తుగా వచ్చి నాశనం చేస్తే, నిర్దోషుల దురవస్థను చూసి దేవుడు వెక్కిరిస్తారు.

  19. భూమి దుష్టుల చేతికి ఇవ్వబడినప్పుడు, ఆయన దాని న్యాయాధిపతుల కళ్లను మూసివేస్తారు. ఆయన కాక ఈ పని ఇంకెవరు చేస్తారు?

  20. “పరుగెత్తేవాని కంటే నా రోజులు వేగంగా పరుగెడుతున్నాయి; ఏ సంతోషం లేకుండానే అవి ఎగిరిపోతున్నాయి.

  21. రెల్లు పడవలు దాటిపోతున్నట్లు, గ్రద్ద తన ఎరను తన్నుకుపోయినట్లు అవి గడిచిపోతున్నాయి.

  22. నా ఫిర్యాదు మరచిపోయి, నా విచారం విడిచిపెట్టి సంతోషంగా ఉంటానని నేను అనుకుంటే,

  23. నా బాధలన్నిటికి భయపడతాను ఎందుకంటే మీరు నన్ను నిర్దోషిగా ప్రకటించరని నాకు తెలుసు.

  24. నేను దోషినని తేలినప్పుడు, నాకెందుకు ఈ వృధా ప్రయాస?

  25. సబ్బుతో నన్ను నేను కడుక్కున్నా, శుభ్రం చేసే పొడితో నా చేతులు కడుక్కున్నా,