కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మత్తయి 10:28సుమారు క్రీ.శ. 33

    శరీరాన్ని చంపి ఆత్మను చంపలేనివారికి భయపడకండి. కానీ శరీరాన్ని, ఆత్మను రెండింటిని నరకంలో నాశనం చేయగలవానికి భయపడండి.

  2. మత్తయి 10:29సుమారు క్రీ.శ. 33

    రెండు పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడడం లేదా! అయినా వాటిలో ఒకటి కూడా మీ పరమతండ్రి అనుమతి లేకుండా నేల కూలదు.

  3. మత్తయి 10:30సుమారు క్రీ.శ. 33

    అలాగే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి.

  4. మత్తయి 10:31సుమారు క్రీ.శ. 33

    కాబట్టి భయపడకండి; మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు.

  5. మత్తయి 10:32సుమారు క్రీ.శ. 33

    “ఎవరు ఇతరుల ముందు బహిరంగంగా నన్ను ఒప్పుకుంటారో, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు ఒప్పుకుంటాను.

  6. మత్తయి 10:33సుమారు క్రీ.శ. 33

    ఎవరు ఇతరుల ముందు నన్ను నిరాకరిస్తారో, పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేను వారిని నిరాకరిస్తాను.

  7. మత్తయి 10:34సుమారు క్రీ.శ. 33

    “భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని అనుకోకండి. నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చానే గాని సమాధానం తేవడానికి కాదు.

  8. మత్తయి 10:35సుమారు క్రీ.శ. 33

    ఎలాగంటే, “ ‘తన తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు తన తల్లికి వ్యతిరేకంగా కుమార్తె, తన అత్తకు వ్యతిరేకంగా కోడలు తిరగబడతారు.

  9. మత్తయి 10:36సుమారు క్రీ.శ. 33

    ఒక మనుష్యుని శత్రువులు తన సొంత ఇంటివారే.’

  10. మత్తయి 10:37సుమారు క్రీ.శ. 33

    “తన తండ్రిని గాని తల్లిని గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు. తన కుమారుని గాని కుమార్తెను గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు.

  11. మత్తయి 10:38సుమారు క్రీ.శ. 33

    తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు యోగ్యులు కారు.

  12. మత్తయి 10:39సుమారు క్రీ.శ. 33

    తన ప్రాణాన్ని దక్కించుకొనే వారు దానిని పోగొట్టుకుంటారు. నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని దక్కించుకుంటారు.

  13. మత్తయి 10:40సుమారు క్రీ.శ. 33

    “మిమ్మల్ని చేర్చుకొనేవారు నన్ను చేర్చుకొంటారు. నన్ను చేర్చుకొనేవారు నన్ను పంపినవానిని చేర్చుకొంటారు.

  14. మత్తయి 10:41సుమారు క్రీ.శ. 33

    ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనేవారు ప్రవక్త ఫలం పొందుతారు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనేవారు నీతిమంతుని ఫలం పొందుతారు.

  15. మత్తయి 10:42సుమారు క్రీ.శ. 33

    నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకరికి ఒక గిన్నెడు చల్లని నీళ్లను ఇస్తే వారు తమ ఫలాన్ని పోగొట్టుకోరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.”

  16. మత్తయి 11:1సుమారు క్రీ.శ. 31

    యేసు తన పన్నెండుమంది శిష్యులకు ఆదేశాలు ఇవ్వడం ముగించిన తర్వాత, ఆయన అక్కడినుండి గలిలయలోని పట్టణాల్లో ఉపదేశించడానికి, సువార్తను ప్రకటించడానికి వెళ్లారు.

  17. మత్తయి 11:2సుమారు క్రీ.శ. 31

    క్రీస్తు చేస్తున్న క్రియలను గురించి చెరసాలలో ఉన్న యోహాను విని, ఆయన దగ్గరకు తన శిష్యులను పంపించి,

  18. మత్తయి 11:3సుమారు క్రీ.శ. 31

    “రావలసిన వాడవు నీవేనా, లేదా మేము వేరొకరి కోసం ఎదురుచూడాలా?” అని ఆయనను అడగమన్నాడు.

  19. మత్తయి 11:4సుమారు క్రీ.శ. 31

    యేసు వారికి ఇలా జవాబిచ్చారు, “మీరు వెళ్లి చూసినవాటిని, విన్నవాటిని యోహానుకు చెప్పండి.

  20. మత్తయి 11:5సుమారు క్రీ.శ. 31

    గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయినవారు తిరిగి బ్రతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటించబడుతుంది.

  21. మత్తయి 11:6సుమారు క్రీ.శ. 31

    నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు.”

  22. మత్తయి 11:7సుమారు క్రీ.శ. 31

    యోహాను శిష్యులు వెళ్లిపోతుండగా, యేసు జనంతో యోహాను గురించి మాట్లాడటం ప్రారంభించాడు, “ఏమి చూడడానికి మీరు అరణ్యంలోనికి వెళ్లారు? గాలికి ఊగే రెల్లునా?

  23. మత్తయి 11:8సుమారు క్రీ.శ. 31

    అది కాకపోతే, మరి ఏమి చూడడానికి వెళ్లారు? విలువైన వస్త్రాలను ధరించిన ఒక వ్యక్తినా? కాదు, విలువైన వస్త్రాలను ధరించిన వ్యక్తులు రాజభవనాల్లో ఉంటారు.

  24. మత్తయి 11:9సుమారు క్రీ.శ. 31

    మరి ఏమి చూడడానికి మీరు వెళ్లారు? ఒక ప్రవక్తనా? అవును, ప్రవక్తకంటే కూడా గొప్పవాడు అని మీతో చెప్తున్నాను.

  25. మత్తయి 11:10సుమారు క్రీ.శ. 31

    అతని గురించి ఇలా వ్రాయబడింది: “ ‘ఇదిగో, నీకు ముందుగా దూతను పంపుతాను, అతడు నీ ముందర నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.’