circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
ఈ కాలపు వచనాలు
- మత్తయి 10:3సుమారు క్రీ.శ. 33
ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, పన్ను వసూలు చేసే మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, తద్దయి;
- మత్తయి 10:4సుమారు క్రీ.శ. 33
జెలోతే అని పిలువబడిన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
- మత్తయి 10:5సుమారు క్రీ.శ. 33
యేసు ఆ పన్నెండు మందికి ఈ సూచనలు ఇచ్చి పంపారు: “యూదేతరుల ప్రాంతాల్లోనికి గాని సమరయ పట్టణాలకు గాని వెళ్లకండి.
- మత్తయి 10:6సుమారు క్రీ.శ. 33
ఇశ్రాయేలీయులలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకు వెళ్లండి.
- మత్తయి 10:7సుమారు క్రీ.శ. 33
మీరు వెళ్తూ, ‘పరలోక రాజ్యం సమీపించింది’ అనే సందేశాన్ని ప్రకటించండి.
- మత్తయి 10:8సుమారు క్రీ.శ. 33
రోగులను స్వస్థపరచండి, చనిపోయినవారిని లేపండి, కుష్ఠురోగులను శుద్ధులుగా చేయండి, దయ్యాలను వెళ్లగొట్టండి. మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి.
- మత్తయి 10:9సుమారు క్రీ.శ. 33
“మీ నడికట్టులో బంగారం గాని వెండి గాని రాగి గాని పెట్టుకోకండి.
- మత్తయి 10:10సుమారు క్రీ.శ. 33
ప్రయాణం కోసం సంచి గాని రెండవ చొక్కా గాని చెప్పులు గాని చేతికర్ర గాని తీసుకెళ్లకండి, ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు.
- మత్తయి 10:11సుమారు క్రీ.శ. 33
మీరు ఏ పట్టణంలో గాని గ్రామంలో గాని ప్రవేశించినప్పుడు అక్కడ యోగ్యులెవరో అడిగి తెలుసుకొని అక్కడినుండి వెళ్లేవరకు ఆ ఇంట్లోనే బసచేయండి.
- మత్తయి 10:12సుమారు క్రీ.శ. 33
ఒక గృహంలో ప్రవేశించినప్పుడు ఆ ఇంటివారికి శుభమని చెప్పండి.
- మత్తయి 10:13సుమారు క్రీ.శ. 33
ఆ ఇంటికి ఆ యోగ్యత ఉంటే మీ శాంతి ఆ ఇంటి మీద నిలుస్తుంది. ఆ యోగ్యత ఆ ఇంటికి లేకపోతే మీ శాంతి మీకే తిరిగి వస్తుంది.
- మత్తయి 10:14సుమారు క్రీ.శ. 33
ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే లేదా మీ మాటలు వినకపోతే, ఆ ఇంటిని లేదా ఆ గ్రామాన్ని విడిచి వెళ్లేటప్పుడు మీ పాదాల దుమ్మును దులిపి వెళ్లండి.
- మత్తయి 10:15సుమారు క్రీ.శ. 33
తీర్పు దినాన ఆ గ్రామానికి పట్టిన గతికంటే సొదొమ, గొమొర్రాల గతి భరించ గలదిగా ఉంటుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
- మత్తయి 10:16సుమారు క్రీ.శ. 33
“చూడండి, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. కాబట్టి మీరు పాముల్లా వివేకంగాను పావురాల్లా కపటం లేనివారిగాను ఉండండి.
- మత్తయి 10:17సుమారు క్రీ.శ. 33
మనుష్యుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు న్యాయసభలకు అప్పగించబడతారు, సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టబడతారు.
- మత్తయి 10:18సుమారు క్రీ.శ. 33
అయితే వారికి, అలాగే యూదేతరులకు మీరు సాక్షులుగా ఉండడానికి నన్ను బట్టి మీరు అధికారుల ఎదుటకు రాజుల ఎదుటకు కొనిపోబడతారు.
- మత్తయి 10:19సుమారు క్రీ.శ. 33
అయితే వారు మిమ్మల్ని బంధించినప్పుడు, మీరు ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో అని చింతించకండి. మీరు ఏమి చెప్పాలనేది ఆ సమయంలోనే మీకు ఇవ్వబడుతుంది;
- మత్తయి 10:20సుమారు క్రీ.శ. 33
ఎందుకంటే, ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు; మీ తండ్రి ఆత్మయే మీ ద్వారా మాట్లాడతారు.
- మత్తయి 10:21సుమారు క్రీ.శ. 33
“సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు; పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు.
- మత్తయి 10:22సుమారు క్రీ.శ. 33
నన్ను బట్టి మీరు వారందరిచేత ద్వేషించబడతారు, అయితే అంతం వరకు స్థిరంగా నిలిచి ఉండేవారే రక్షించబడతారు.
- మత్తయి 10:23సుమారు క్రీ.శ. 33
మిమ్మల్ని ఒక గ్రామంలో హింసిస్తే మరో గ్రామానికి పారిపోండి. మనుష్యకుమారుడు వచ్చేలోగా మీరు ఇశ్రాయేలు గ్రామాలన్నింటికి వెళ్లడం పూర్తి చేయలేరు” అని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను.
- మత్తయి 10:24సుమారు క్రీ.శ. 33
ఒక శిష్యుడు బోధకుని కంటే లేదా సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాడు.
- మత్తయి 10:25సుమారు క్రీ.శ. 33
శిష్యుడు తన బోధకునిలా, సేవకుడు తన యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు అని పిలిస్తే అతని ఇంటివారిని ఇంకా ఎలా పిలుస్తారో గదా!
- మత్తయి 10:26సుమారు క్రీ.శ. 33
“కాబట్టి వారికి భయపడకండి, ఎందుకంటే దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు.
- మత్తయి 10:27సుమారు క్రీ.శ. 33
నేను మీతో చీకట్లో చెప్పేదానిని మీరు పగటి వెలుగులో చెప్పండి; మీ చెవిలో చెప్పబడినదానిని పైకప్పుల నుండి ప్రకటించండి.