కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా 22:1సుమారు క్రీ.పూ. 598

    యెహోవా ఇలా అంటున్నారు: “నీవు యూదారాజు యొక్క రాజభవనానికి వెళ్లి, అక్కడ ఈ సందేశాన్ని ప్రకటించు:

  2. యిర్మీయా 22:2సుమారు క్రీ.పూ. 598

    ‘దావీదు సింహాసనం మీద ఆసీనుడైయున్న యూదా రాజైన మీకు, మీ అధికారులకు, ఈ ద్వారాల గుండా వచ్చే మీ ప్రజలకు, యెహోవా ప్రకటిస్తున్న మాట వినండి.

  3. యిర్మీయా 22:3సుమారు క్రీ.పూ. 598

    యెహోవా ఇలా చెప్తున్నారు: నీతిన్యాయాల ప్రకారం చేయండి. అణచివేసే వారి చేతిలో నుండి దోపిడికి గురైన వారిని విడిపించండి. విదేశీయులకు, తండ్రిలేనివారికి, విధవరాండ్రకు ఎలాంటి అన్యాయం చేయవద్దు, హింసించవద్దు, ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించవద్దు.

  4. యిర్మీయా 22:4సుమారు క్రీ.పూ. 598

    ఎందుకంటే ఒకవేళ మీరు ఈ ఆజ్ఞలను పాటించడంలో జాగ్రత్త వహిస్తే, అప్పుడు దావీదు సింహాసనంపై కూర్చున్న రాజులు రథాలు, గుర్రాలపై స్వారీ చేస్తూ, వారి అధికారులు, వారి ప్రజలతో కలిసి ఈ రాజభవనం ద్వారాల గుండా వస్తారు.

  5. యిర్మీయా 22:5సుమారు క్రీ.పూ. 598

    ఒకవేళ మీరు ఈ ఆజ్ఞలను పాటించకపోతే, నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ రాజభవనం శిథిలమవుతుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.”

  6. యిర్మీయా 22:6సుమారు క్రీ.పూ. 598

    ఎందుకంటే యూదా రాజభవనం గురించి యెహోవా ఇలా అంటున్నారు: “నీవు నాకు గిలాదులా ఉన్నా, లెబానోను శిఖరంలా ఉన్నా, నిన్ను బంజరు భూమిలా, నివసించేవారు లేని పట్టణాల్లా చేస్తాను.

  7. యిర్మీయా 22:7సుమారు క్రీ.పూ. 598

    నేను నీ మీదికి నాశనం చేసేవారిని పంపుతాను, వారు తమ ఆయుధాలతో నీ శ్రేష్ఠమైన దేవదారు దూలాలను నరికి వాటిని అగ్నిలో పడవేస్తారు.

  8. యిర్మీయా 22:8సుమారు క్రీ.పూ. 598

    “అనేక దేశాల ప్రజలు ఈ పట్టణం గుండా వెళ్తూ, ‘యెహోవా ఈ గొప్ప పట్టణానికి ఎందుకు ఇలా చేశాడు?’ అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు. యెహోవా ఈ గొప్ప పట్టణానికి ఎందుకు ఇలా చేశాడు?

  9. యిర్మీయా 22:9సుమారు క్రీ.పూ. 598

    దానికి జవాబు: ‘ఎందుకంటే వారు తమ దేవుడైన యెహోవా నిబంధనను విడిచిపెట్టి, ఇతర దేవతలను ఆరాధించి సేవించారు.’ ”

  10. యిర్మీయా 22:10సుమారు క్రీ.పూ. 598

    చనిపోయిన రాజు కోసం ఏడవవద్దు అతన్ని కోల్పోయినందుకు దుఃఖించవద్దు; దానికి బదులు, బందీలుగా కొనిపోబడినవారి కోసం తీవ్రంగా ఏడవండి, ఎందుకంటే వారు ఎప్పటికీ తిరిగి రారు, తన స్వదేశాన్ని మళ్ళీ చూడరు.

  11. యిర్మీయా 22:11సుమారు క్రీ.పూ. 598

    తన తండ్రి తర్వాత యూదా రాజుగా ఆసీనుడైన యోషీయా కుమారుడైన షల్లూము గురించి యెహోవా ఇలా అంటున్నారు: “అతడు ఎప్పటికీ తిరిగి రాడు.

  12. యిర్మీయా 22:12సుమారు క్రీ.పూ. 598

    వారు అతన్ని బందీగా తీసుకెళ్లిన చోటే అతడు చనిపోతాడు; అతడు మళ్ళీ ఈ దేశాన్ని చూడడు.”

  13. యిర్మీయా 22:13సుమారు క్రీ.పూ. 598

    “అక్రమంతో తన రాజభవనాన్ని, అన్యాయంతో తన మేడగదులను కట్టించుకునే వారికి శ్రమ, ఏమి చెల్లించకుండ తన సొంత ప్రజలతో పని చేయించుకుని, వారి ప్రయాసానికి తగిన వేతనం ఇవ్వని వారికి శ్రమ.

  14. యిర్మీయా 22:14సుమారు క్రీ.పూ. 598

    ‘నేను విశాలమైన పై గదులున్న గొప్ప రాజభవనాన్ని నిర్మించుకుంటాను’ అని అతడు అనుకుంటాడు. కాబట్టి దానికి పెద్ద కిటికీలు చేయించుకుని, దేవదారుతో పలకలు అతికి వాటికి ఎరుపురంగు పూసి అలంకరిస్తాడు.

  15. యిర్మీయా 22:15సుమారు క్రీ.పూ. 598

    “ఎక్కువగా దేవదారు కలిగి ఉండడం అతడు నీతిని న్యాయాన్ని చేసినప్పుడు, నీ తండ్రికి అన్నపానాలు లేవా? అతడు సరియైనది, న్యాయమైనది చేశాడు, అతనికి అంతా బాగానే జరిగింది కదా.

  16. యిర్మీయా 22:16సుమారు క్రీ.పూ. 598

    అతడు పేదలు, అవసరతలో ఉన్న వారి పక్షంగా వాదించాడు, కాబట్టి అంతా బాగానే జరిగింది. నన్ను తెలుసుకోవడం అంటే అదే కదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  17. యిర్మీయా 22:17సుమారు క్రీ.పూ. 598

    “అయితే నీ కళ్లు, నీ హృదయం అన్యాయమైన సంపాదనపై, నిర్దోషుల రక్తాన్ని చిందించడంపై, అణచివేయడంపై, దోపిడీపై మాత్రమే దృష్టి పెట్టాయి.”

  18. యిర్మీయా 22:18సుమారు క్రీ.పూ. 598

    కాబట్టి యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము గురించి యెహోవా ఇలా అంటున్నారు: “ ‘అయ్యో, నా సోదరా! అయ్యో, నా సోదరీ!’ అంటూ అతని గురించి వారు దుఃఖించరు, ‘అయ్యో, నా యజమానీ! అయ్యో, అతని వైభవమా!’ అంటూ వారు అతని గురించి దుఃఖించరు.

  19. యిర్మీయా 22:19సుమారు క్రీ.పూ. 598

    అతడు యెరూషలేము గుమ్మాల బయటకు ఈడ్వబడి, అక్కడ విసిరివేయబడి ఒక గాడిదలా పాతిపెట్టబడతాడు.”

  20. యిర్మీయా 22:20సుమారు క్రీ.పూ. 598

    “లెబానోనుకు వెళ్లి కేకవేయి, నీ స్వరం బాషానులో వినబడాలి, అబారీము నుండి కేకవేయి, ఎందుకంటే నీ స్నేహితులంతా నలగ్గొట్టబడ్డారు.

  21. యిర్మీయా 22:21సుమారు క్రీ.పూ. 598

    నీవు క్షేమంగా ఉన్నావని భావించినప్పుడు నేను నిన్ను హెచ్చరించాను, కానీ ‘నేను వినను!’ అని నీవన్నావు, నీ చిన్నప్పటి నుండి ఇదే నీకు అలవాటు; నీవు నా మాటకు లోబడలేదు.

  22. యిర్మీయా 22:22సుమారు క్రీ.పూ. 598

    గాలికి నీ కాపరులందరు కొట్టుకుపోతారు, నీ స్నేహితులను బందీలుగా తీసుకెళ్తారు. అప్పుడు నీ దుష్టత్వమంతటిని బట్టి నీవు సిగ్గుపడి అవమానానికి గురవుతావు.

  23. యిర్మీయా 22:23సుమారు క్రీ.పూ. 598

    ‘లెబానోనులో’ నివసించే నీవు దేవదారు భవనాలలో గూడు కట్టుకుని ఉన్న నీవు, ప్రసవ వేదనలో ఉన్న స్త్రీకి కలిగే నొప్పిలాంటి నొప్పులు నీకు వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తావో!

  24. యిర్మీయా 22:24సుమారు క్రీ.పూ. 598

    “నా జీవం తోడు” అని యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “యూదా రాజైన యెహోయాకీము కుమారుడవైన యెహోయాకీనూ, నీవు నా కుడిచేతి ముద్ర ఉంగరంగా ఉన్నా, నేను నిన్ను పీకేస్తాను.

  25. యిర్మీయా 22:25సుమారు క్రీ.పూ. 598

    నిన్ను చంపాలనుకునే వారి చేతులకు, నీవు భయపడే బబులోను రాజైన నెబుకద్నెజరుకు, బబులోనీయుల చేతులకు నిన్ను అప్పగిస్తాను.