కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా 18:21సుమారు క్రీ.పూ. 608

    కాబట్టి వారి పిల్లలను కరువుకు అప్పగించండి; ఖడ్గానికి వారిని అప్పగించండి. వారి భార్యలు సంతానం లేనివారుగా, విధవరాండ్రుగా ఉండాలి; వారి మనుష్యులు చంపబడాలి, వారి యువకులు యుద్ధంలో కత్తివేటుతో చంపబడాలి.

  2. యిర్మీయా 18:22సుమారు క్రీ.పూ. 608

    మీరు అకస్మాత్తుగా వారిపైకి దండెత్తే వారిని రప్పించినప్పుడు, వారి ఇళ్ళలో నుండి కేకలు వినబడాలి, ఎందుకంటే వారు నన్ను పట్టుకోవడానికి గొయ్యి త్రవ్వారు, నా పాదాలకు రహస్య ఉచ్చులు బిగించారు.

  3. యిర్మీయా 18:23సుమారు క్రీ.పూ. 608

    అయితే యెహోవా, నన్ను చంపడానికి వారు పన్నిన కుట్రలన్నీ మీకు తెలుసు. వారి నేరాలను క్షమించకండి మీ దృష్టి నుండి వారి పాపాలను తుడిచివేయకండి. వారిని మీ ఎదుట కూలనివ్వండి; మీరు కోపంలో ఉన్నప్పుడే వారికి తగిన శాస్తి చేయండి.

  4. యిర్మీయా 19:1సుమారు క్రీ.పూ. 607

    యెహోవా ఇలా అంటున్నారు: “వెళ్లి కుమ్మరి దగ్గర ఒక మట్టి పాత్ర కొను. నీతో పాటు ప్రజల పెద్దలను, యాజకులలో కొందరిని తీసుకుని,

  5. యిర్మీయా 19:2సుమారు క్రీ.పూ. 607

    హర్సీతు ద్వారం దగ్గర ఉన్న బెన్ హిన్నోము లోయకు వెళ్లి అక్కడ నేను మీకు చెప్పే మాటలు ప్రకటిస్తూ,

  6. యిర్మీయా 19:3సుమారు క్రీ.పూ. 607

    ఇలా చెప్పు, ‘యూదా రాజులారా, యెరూషలేము ప్రజలారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: వినండి! నేను ఈ స్థలం మీదికి ఒక విపత్తును తెచ్చి, దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేలా చేస్తాను.

  7. యిర్మీయా 19:4సుమారు క్రీ.పూ. 607

    ఎందుకంటే వారు నన్ను విడిచిపెట్టి, ఈ స్థలాన్ని ఇతర దేవతల స్థలంగా చేశారు. వారికి గాని, వారి పూర్వికులకు గాని, యూదా రాజులకు గాని తెలియని దేవతలకు ధూపం వేసి, ఈ స్థలాన్ని నిర్దోషుల రక్తంతో నింపారు.

  8. యిర్మీయా 19:5సుమారు క్రీ.పూ. 607

    వారు తమ పిల్లలను బయలుకు దహనబలులుగా అగ్నిలో కాల్చడానికి బయలుకు క్షేత్రాలను నిర్మించారు. అలా చేయమని నేను వారికి ఆజ్ఞాపించలేదు, కనీసం ప్రస్తావించలేదు, అసలు అది నా మనస్సులోకి కూడా రాలేదు.

  9. యిర్మీయా 19:6సుమారు క్రీ.పూ. 607

    ప్రజలు ఇకపై ఈ ప్రదేశాన్ని తోఫెతు లేదా బెన్ హిన్నోము లోయ అని పిలువకుండా, వధ లోయ అని పిలిచే రోజులు రాబోతున్నాయి, కాబట్టి జాగ్రత్త వహించండి, అని యెహోవా హెచ్చరించారు.

  10. యిర్మీయా 19:7సుమారు క్రీ.పూ. 607

    “ ‘ఈ స్థలంలో నేను యూదా, యెరూషలేము ప్రణాళికలను నాశనం చేస్తాను. వారిని చంపాలనుకునే శత్రువుల చేతిలో వారు కత్తివేటుకు గురయ్యేలా చేస్తాను, వారి శవాలను పక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను.

  11. యిర్మీయా 19:8సుమారు క్రీ.పూ. 607

    నేను ఈ పట్టణాన్ని నాశనం చేస్తాను; దానిని భయానకంగా, ఎగతాళిగా చేస్తాను; దారిన వెళ్లేవారంతా నివ్వెరపోతారు, దాని గాయాలన్నిటిని చూసి అపహాస్యం చేస్తారు.

  12. యిర్మీయా 19:9సుమారు క్రీ.పూ. 607

    వారు తమ కుమారుల, కుమార్తెల మాంసాన్ని తినేలా చేస్తాను, వారు ఒకరి మాంసాన్ని మరొకరు తింటారు, ఎందుకంటే వారి శత్రువులు వారిని నాశనం చేయడానికి వారిని పూర్తిగా ముట్టడిస్తారు.’

  13. యిర్మీయా 19:10సుమారు క్రీ.పూ. 607

    “నీతో పాటు వచ్చినవారు చూస్తుండగానే ఆ కుండను పగలగొట్టి,

  14. యిర్మీయా 19:11సుమారు క్రీ.పూ. 607

    వారితో ఇలా చెప్పు, ‘సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మరలా బాగుచేయడానికి వీలు లేకుండ ఈ కుమ్మరి కుండను పగలగొట్టినట్లు నేను ఈ దేశాన్ని, ఈ పట్టణాన్ని ధ్వంసం చేస్తాను. తోఫెతులో స్థలం లేకపోయేంతగా అక్కడే చనిపోయినవారిని పాతిపెడతారు.

  15. యిర్మీయా 19:12సుమారు క్రీ.పూ. 607

    నేను ఈ ప్రదేశానికి, ఇక్కడ నివసించేవారికి ఇదే చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు. నేను ఈ పట్టణాన్ని తోఫెతులా చేస్తాను.

  16. యిర్మీయా 19:13సుమారు క్రీ.పూ. 607

    యెరూషలేములోని ఇల్లు, యూదా రాజుల భవనాలు ఆ తోఫెతు స్థలంలా అపవిత్రం చేయబడతాయి. అన్ని ఇళ్ల మీద ప్రజలు ఆకాశ సైన్యాలకు ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించారు.’ ”

  17. యిర్మీయా 19:14సుమారు క్రీ.పూ. 607

    ప్రవచించడానికి యెహోవా అతన్ని పంపిన తోఫెతు నుండి యిర్మీయా తిరిగివచ్చి యెహోవా ఆలయ ఆవరణంలో నిలబడ్డాడు.

  18. యిర్మీయా 19:15సుమారు క్రీ.పూ. 607

    “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘వినండి! వారు మెడవంచని వారై నా మాటలు వినలేదు కాబట్టి నేను ఈ పట్టణం మీద దాని చుట్టుప్రక్కల గ్రామాలన్నిటి మీదికి నేను చెప్పిన ప్రతి విపత్తును తీసుకురాబోతున్నాను.’ ”

  19. యిర్మీయా 20:1సుమారు క్రీ.పూ. 607

    యిర్మీయా ఈ విషయాలు ప్రవచించడం ఇమ్మేరు కుమారుడు, యాజకుడు, యెహోవా ఆలయానికి అధికారియైన పషూరు విని,

  20. యిర్మీయా 20:2సుమారు క్రీ.పూ. 607

    అతడు యిర్మీయా ప్రవక్తను కొట్టించి, యెహోవా మందిరం దగ్గర బెన్యామీను ఎగువ ద్వారం దగ్గర ఉన్న కొయ్యకు బంధించాడు.

  21. యిర్మీయా 20:3సుమారు క్రీ.పూ. 607

    మరుసటిరోజు, పషూరు అతన్ని కొయ్య నుండి విడిపించినప్పుడు, యిర్మీయా అతనితో, “నీకు యెహోవా ఇచ్చిన పేరు పషూరు కాదు, నీ పేరు మాగోర్-మిస్సాబీబు.

  22. యిర్మీయా 20:4సుమారు క్రీ.పూ. 607

    ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను నిన్ను నీకు, నీ స్నేహితులందరికీ భయంగా చేస్తాను; వారు తమ శత్రువుల ఖడ్గం చేత పడిపోవుట నీ కళ్లతో చూస్తావు. నేను యూదా ప్రజలందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను, అతడు వారిని బబులోనుకు తీసుకెళ్తాడు, ఖడ్గంతో హతమారుస్తాడు.

  23. యిర్మీయా 20:5సుమారు క్రీ.పూ. 607

    నేను ఈ పట్టణంలోని సంపాదనంతటిని అంటే దాని ఉత్పత్తులన్నిటినీ, విలువైన వస్తువులన్నిటినీ, యూదా రాజుల సంపదలన్నిటినీ వాళ్ల శత్రువుల చేతికి అప్పగిస్తాను. వారు దానిని దోచుకుని బబులోనుకు తీసుకెళ్తారు.

  24. యిర్మీయా 20:6సుమారు క్రీ.పూ. 607

    పషూరు, నీవు, నీ ఇంట్లో నివసించే వారందరూ బబులోనుకు బందీలుగా వెళ్తారు. అక్కడ మీరు, మీ అబద్ధాల ప్రవచనాలతో మీరు మోసగించిన మీ స్నేహితులందరూ చనిపోయి పాతిపెట్టబడతారు.’ ”

  25. యిర్మీయా 20:7సుమారు క్రీ.పూ. 607

    యెహోవా! మీరే నన్ను మోసగించావు, నేను లోబడ్డాను, మీరు నాకంటే బలవంతులు, మీరే గెలిచారు, రోజంతా అందరు నన్ను చూసి నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు.