కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా 22:26సుమారు క్రీ.పూ. 598

    నిన్ను, నీ కన్నతల్లినీ మరో దేశంలోకి విసిరివేస్తాను. అది నీ జన్మస్థలం కాదు, అక్కడే మీరు చస్తారు.

  2. యిర్మీయా 22:27సుమారు క్రీ.పూ. 598

    తిరిగి రావాలని మీరెంతో ఆశిస్తారు, కాని ఇక్కడకు మీరు తిరిగి రారు.”

  3. యిర్మీయా 22:28సుమారు క్రీ.పూ. 598

    ఈ యెహోయాకీను హేయమైన పగిలిన కుండ వంటివాడా, ఎవరూ కోరుకోని వస్తువా? అతడు అతని పిల్లలు విసిరివేయబడి, వారికి తెలియని దేశంలోకి త్రోసివేయబడతారు?

  4. యిర్మీయా 22:29సుమారు క్రీ.పూ. 598

    ఓ దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినండి!

  5. యిర్మీయా 22:30సుమారు క్రీ.పూ. 598

    యెహోవా చెప్పేదేమిటంటే, “అతడు సంతానం లేనివాడని, తన జీవితకాలంలో వృద్ధిచెందలేడని అతని గురించి వ్రాయండి, అతని సంతానంలో ఎవరూ వర్ధిల్లరు, దావీదు సింహాసనం మీద ఎవరూ కూర్చోరు, యూదాలో ఇకపై పరిపాలన చేయరు.”

  6. “నా పచ్చిక బయళ్లలోని గొర్రెలను నాశనం చేసి చెదరగొట్టే కాపరులకు శ్రమ!” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  7. కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలను మేపుతున్న గొర్రెల కాపరులతో ఇలా అంటున్నారు: “మీరు నా మందను చెదరగొట్టి వాటిని తరిమివేసి వాటిని పట్టించుకోనందున, మీరు చేసిన దుర్మార్గానికి నేను మీకు శిక్ష విధిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  8. “నేను వాటిని తరిమికొట్టిన దేశాలన్నిటిలో నుండి నా మందలో మిగిలిన వాటిని నేనే పోగుచేసి, వాటి పచ్చిక బయళ్లకు తిరిగి వాటిని తీసుకువస్తాను, అక్కడ అవి ఫలించి వృద్ధిచెందుతాయి.

  9. వాటిని మేపడానికి నేను గొర్రెల కాపరులను నియమిస్తాను, అవి ఇకపై భయపడవు, బెదిరిపోవు, వాటిలో ఒక్కటి కూడా తప్పిపోదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  10. “రాబోయే రోజుల్లో, నేను దావీదుకు నీతి అనే చిగురును పుట్టిస్తాను, జ్ఞానయుక్తంగా పరిపాలించే రాజు, దేశంలో నీతి న్యాయాలు జరిగించేవాన్ని” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  11. అతని పరిపాలనలో యూదాకు కాపుదల ఉంటుంది ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తుంది. యెహోవా మన నీతిమంతుడైన రక్షకుడు అని పిలువబడతాడు.

  12. యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో, ఇకపై ప్రజలు, ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన సజీవుడైన యెహోవా పేరిట అని చెప్పరు’

  13. అయితే, ‘ఇశ్రాయేలీయుల సంతానాన్ని ఉత్తర దేశంలో నుండి, ఆయన వారిని బహిష్కరించిన అన్ని దేశాల నుండి బయటకు రప్పించిన సజీవుడైన యెహోవా పేరిట’ అని వారు చెప్తారు. అప్పుడు వారు వారి స్వదేశంలో నివసిస్తారు.”

  14. యిర్మీయా 23:9సుమారు క్రీ.పూ. 605

    ప్రవక్తల గురించి: యెహోవాను బట్టి ఆయన మాట్లాడిన మాటలనుబట్టి నా హృదయం నాలో పగిలిపోయింది; నా ఎముకలన్నీ వణుకుతున్నాయి. త్రాగిన మత్తులో ఉన్నవాడిలా, ద్రాక్షరసానికి లొంగిపోయిన బలవంతునిలా ఉన్నాను,

  15. యిర్మీయా 23:10సుమారు క్రీ.పూ. 605

    దేశమంతా వ్యభిచారులతో నిండిపోయింది; శాపం కారణంగా భూమి ఎండిపోయింది అరణ్యంలో పచ్చికబయళ్లు ఎండిపోయాయి. ప్రవక్తలు చెడు మార్గం అనుసరిస్తారు తమ అధికారాన్ని అన్యాయంగా ఉపయోగిస్తారు.

  16. యిర్మీయా 23:11సుమారు క్రీ.పూ. 605

    “ప్రవక్త యాజకుడు ఇద్దరూ భక్తిహీనులే; నా మందిరంలో కూడా వారి దుర్మార్గాన్ని నేను చూస్తున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  17. యిర్మీయా 23:12సుమారు క్రీ.పూ. 605

    “కాబట్టి వారి దారి జారే నేలలా అవుతుంది; వారు చీకటిలోకి వెళ్లగొట్టబడతారు అక్కడ వారు పడిపోతారు. వారు శిక్షించబడే సంవత్సరంలో నేను వారి మీదికి విపత్తు రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  18. యిర్మీయా 23:13సుమారు క్రీ.పూ. 605

    “సమరయ ప్రవక్తల్లో నేను ఇలాంటి అసహ్యకరమైన దాన్ని చూశాను: వారు బయలు పేరిట ప్రవచించి నా ప్రజలైన ఇశ్రాయేలీయులను తప్పుదారి పట్టించారు.

  19. యిర్మీయా 23:14సుమారు క్రీ.పూ. 605

    యెరూషలేము ప్రవక్తల్లో భయంకరమైనది నేను చూశాను: వారు వ్యభిచారం చేస్తారు, అబద్ధాలతో జీవిస్తారు. వారు దుర్మార్గుల చేతులను బలపరుస్తారు, వారిలో ఒక్కరు కూడా తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టరు. వారందరూ నాకు సొదొమలాంటివారు; యెరూషలేము ప్రజలు గొమొర్రా వంటివారు.”

  20. యిర్మీయా 23:15సుమారు క్రీ.పూ. 605

    కాబట్టి సైన్యాల యెహోవా ప్రవక్తలను గురించి ఇలా అంటున్నారు: “నేను వారిని చేదు ఆహారం తినేలా చేస్తాను, విషపూరితమైన నీళ్లు త్రాగేలా చేస్తాను, ఎందుకంటే యెరూషలేము ప్రవక్తల భక్తిహీనత దేశమంతటా వ్యాపించింది.”

  21. యిర్మీయా 23:16సుమారు క్రీ.పూ. 605

    సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “ప్రవక్తలు మీకు చెప్పే ప్రవచనాలను వినవద్దు; అవి మిమ్మల్ని భ్రమ పెడతాయి. వారి సొంత మనస్సులోని దర్శనాలు చెప్తారు, కాని యెహోవా నోటి నుండి వచ్చినవి కాదు.

  22. యిర్మీయా 23:17సుమారు క్రీ.పూ. 605

    ‘మీకు సమాధానం కలుగుతుంది యెహోవా చెప్తున్నారు’ అని నన్ను తృణీకరించే వారితో అంటారు. ‘మీకు హాని జరగదు’ అని వారు హృదయ కాఠిన్యం గలవారితో అంటారు.

  23. యిర్మీయా 23:18సుమారు క్రీ.పూ. 605

    అయితే ఆయనను చూడడానికి, ఆయన మాట వినడానికి వారిలో ఎవరు యెహోవా సభలో నిలబడి ఉన్నారు? ఆయన మాటను ఎవరు విన్నారు ఎవరు ఆలకించారు?

  24. యిర్మీయా 23:19సుమారు క్రీ.పూ. 605

    చూడండి, యెహోవా ఉగ్రత తుఫానులా విరుచుకుపడుతుంది, అది సుడిగాలిలా దుష్టుల తలలపైకి దూసుకెళ్తుంది.

  25. యిర్మీయా 23:20సుమారు క్రీ.పూ. 605

    యెహోవా తన హృదయ ఉద్దేశాలను పూర్తిగా నెరవేర్చే వరకు ఆయన కోపం తగ్గదు. ఈ విషయాన్ని రాబోయే రోజుల్లో మీరు స్పష్టంగా గ్రహిస్తారు.