కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా 24:6సుమారు క్రీ.పూ. 598

    వారికి మేలు కలిగేలా వారిపై నా దృష్టి పెడతాను. వారిని మళ్ళీ ఈ దేశానికి రప్పిస్తాను. నేను వారిని కడతాను, కూల్చివేయను; నాటుతాను, పెరికివేయను.

  2. యిర్మీయా 24:7సుమారు క్రీ.పూ. 598

    నేనే యెహోవానని నన్ను తెలుసుకునే హృదయాన్ని వారికి ఇస్తాను. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారి దేవుడనై ఉంటాను, ఎందుకంటే వారు తమ పూర్ణహృదయంతో నా దగ్గరకు తిరిగి వస్తారు.

  3. యిర్మీయా 24:8సుమారు క్రీ.పూ. 598

    “ ‘అయితే, నేను యూదా రాజైన సిద్కియాకు, అతని అధికారులకు, యెరూషలేములో మిగిలిన వారికి ఈజిప్టులో నివసిస్తున్న వారికి తినలేనంతగా పాడైన అంజూర పండ్లకు చేసినట్టు చేస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.

  4. యిర్మీయా 24:9సుమారు క్రీ.పూ. 598

    నేను వారిని చెదరగొట్టిన అన్ని భూరాజ్యాలకు నేను వారిని అసహ్యమైన వారిగా, అభ్యంతరకరమైన వారిగా నిందగా, ఒక సామెతగా, ఒక శాపంగా, హేళనకు కారణంగా చేస్తాను.

  5. యిర్మీయా 24:10సుమారు క్రీ.పూ. 598

    నేను వారికి, వారి పూర్వికులకు ఇచ్చిన దేశంలో నుండి వారు పూర్తిగా నాశనమయ్యే వరకు నేను వారి మీదికి ఖడ్గాన్ని కరువును తెగులును పంపుతాను.’ ”

  6. యిర్మీయా 25:1సుమారు క్రీ.పూ. 606

    యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడి నాల్గవ సంవత్సరంలో అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి మొదటి సంవత్సరంలో యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చింది.

  7. యిర్మీయా 25:2సుమారు క్రీ.పూ. 606

    కాబట్టి యిర్మీయా ప్రవక్త యూదా ప్రజలందరితో, యెరూషలేములో నివసిస్తున్న వారందరితో ఇలా అన్నాడు:

  8. యిర్మీయా 25:3సుమారు క్రీ.పూ. 606

    యూదా రాజైన ఆమోను కుమారుడైన యోషీయా పాలనలో పదమూడవ సంవత్సరం నుండి ఈ రోజు వరకు ఇరవై మూడు సంవత్సరాలు యెహోవా వాక్కు నాకు వస్తూ ఉండింది. నేను మీతో పదే పదే మాట్లాడాను కానీ మీరు వినలేదు.

  9. యిర్మీయా 25:4సుమారు క్రీ.పూ. 606

    యెహోవా తన సేవకులైన ప్రవక్తలందరినీ మీ దగ్గరకు మళ్ళీ మళ్ళీ పంపినా మీరు వినలేదు లేదా పట్టించుకోలేదు.

  10. యిర్మీయా 25:5సుమారు క్రీ.పూ. 606

    వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరు మీ చెడు మార్గాలను, మీ చెడు ఆచారాలను ఇప్పటికైనా విడిచిపెట్టండి, యెహోవా మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు శాశ్వతంగా ఉండగలరు.

  11. యిర్మీయా 25:6సుమారు క్రీ.పూ. 606

    ఇతర దేవుళ్ళ విగ్రహాలను మీరు సేవించవద్దు, పూజించవద్దు, వాటిని అనుసరించవద్దు; మీ చేతిపనుల వలన మీరు నాకు కోపం రేపవద్దు; అప్పుడు నేను మీకు హాని చేయను” అని చెప్పారు.

  12. యిర్మీయా 25:7సుమారు క్రీ.పూ. 606

    “కాని మీరు నా మాట వినలేదు, మీ చేతులు చేసిన వాటితో మీరు నా కోపాన్ని రేపి, మీకే హాని తెచ్చుకున్నారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  13. యిర్మీయా 25:8సుమారు క్రీ.పూ. 606

    కాబట్టి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మీరు నా మాటలు వినలేదు కాబట్టి,

  14. యిర్మీయా 25:9సుమారు క్రీ.పూ. 606

    నేను ఉత్తరాది జనాంగాలను, నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరును పిలిపిస్తాను” అని యెహోవా అంటున్నారు. నేను వారిని ఈ దేశం మీదికి, దాని నివాసుల మీదికి, చుట్టుప్రక్కల ఉన్న అన్ని దేశాల మీదికి తీసుకువస్తాను. నేను ఈ ప్రజలను పూర్తిగా నాశనం చేస్తాను. వారిని భయానకంగా, హేళనగా శాశ్వతమైన నాశనంగా చేస్తాను.

  15. యిర్మీయా 25:10సుమారు క్రీ.పూ. 606

    నేను సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను, తిరుగటిరాళ్ల శబ్దాన్ని దీపపు వెలుగును వారి నుండి దూరం చేస్తాను.

  16. యిర్మీయా 25:11సుమారు క్రీ.పూ. 606

    ఈ దేశమంతా నిర్జనమైన బంజరుగా మారుతుంది, ఈ దేశాలు డెబ్బై సంవత్సరాలు బబులోను రాజుకు సేవ చేస్తాయి.

  17. యిర్మీయా 25:12సుమారు క్రీ.పూ. 606

    “అయితే డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు, నేను బబులోను రాజును, అతని ప్రజలను, బబులోనీయుల దేశాన్ని వారి దోషాన్ని బట్టి శిక్షిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “దానిని శాశ్వతంగా నిర్జనం చేస్తాను.

  18. యిర్మీయా 25:13సుమారు క్రీ.పూ. 606

    నేను ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాటన్నిటిని, ఈ పుస్తకంలో వ్రాసి ఉన్నవాటన్నిటిని, యిర్మీయా ప్రవచించిన ప్రకారం ఆ దేశం మీదికి రప్పిస్తాను.

  19. యిర్మీయా 25:14సుమారు క్రీ.పూ. 606

    వారే అనేక దేశాలకు, గొప్ప రాజులకు బానిసలుగా ఉంటారు; వారి క్రియలనుబట్టి వారి చేతి పనులను బట్టి నేను వారికి ప్రతిఫలమిస్తాను.”

  20. యిర్మీయా 25:15సుమారు క్రీ.పూ. 606

    ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “నా ఉగ్రత అనే ద్రాక్షరసంతో నిండిన ఈ గిన్నెను నా చేతిలో నుండి తీసివేసి, నేను నిన్ను పంపే దేశాలన్నిటిని త్రాగనివ్వు.

  21. యిర్మీయా 25:16సుమారు క్రీ.పూ. 606

    వారు దానిని త్రాగినప్పుడు, నేను వారి మధ్యకు పంపబోయే ఖడ్గాన్ని చూసి వారు తడబడి పిచ్చివారైపోతారు.”

  22. యిర్మీయా 25:17సుమారు క్రీ.పూ. 606

    కాబట్టి నేను యెహోవా చేతిలో నుండి గిన్నె తీసుకుని, ఆయన నన్ను పంపిన దేశాలన్నిటిని త్రాగేలా చేశాను:

  23. యిర్మీయా 25:18సుమారు క్రీ.పూ. 606

    అవి నేడు ఉన్నట్లుగా నాశనం చేయడానికి వాటిని నిర్జనంగా ఎగతాళిగా ఒక శాపంగా మార్చడానికి యెరూషలేముకు, యూదా పట్టణాలకు, దాని రాజులకు అధికారులకు దానిని త్రాగించాను;

  24. యిర్మీయా 25:19సుమారు క్రీ.పూ. 606

    ఈజిప్టు రాజు ఫరో, అతని పరిచారకులు, అధికారులు, అతని ప్రజలందరూ,

  25. యిర్మీయా 25:20సుమారు క్రీ.పూ. 606

    అక్కడున్న విదేశీయులందరు అనగా ఊజు రాజులందరూ; ఫిలిష్తీయ పట్టణాలైన అష్కెలోను, గాజా, ఎక్రోను రాజులందరూ అష్డోదులో మిగిలిన ప్రజలు;