కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా 25:21సుమారు క్రీ.పూ. 606

    ఎదోము, మోయాబు, అమ్మోను;

  2. యిర్మీయా 25:22సుమారు క్రీ.పూ. 606

    తూరు సీదోను రాజులందరూ; సముద్ర తీర ప్రాంతాల రాజులు;

  3. యిర్మీయా 25:23సుమారు క్రీ.పూ. 606

    దేదాను, తేమా, బూజీయులు దూర ప్రాంతాల్లో ఉన్నవారందరు;

  4. యిర్మీయా 25:24సుమారు క్రీ.పూ. 606

    అరేబియా రాజులందరూ అరణ్యంలో నివసించే పరదేశి ప్రజల రాజులందరూ;

  5. యిర్మీయా 25:25సుమారు క్రీ.పూ. 606

    జిమ్రీ, ఏలాము, మాదీయుల రాజులందరూ;

  6. యిర్మీయా 25:26సుమారు క్రీ.పూ. 606

    ఉత్తరాన ఉన్న రాజులందరూ, సమీపంలో దూరంగా, ఒకదాని తర్వాత ఒకటి భూమిపై ఉన్న అన్ని రాజ్యాలు త్రాగుతారు. వారందరి తర్వాత షేషకు రాజు కూడా దానిని త్రాగుతాడు.

  7. యిర్మీయా 25:27సుమారు క్రీ.పూ. 606

    “అప్పుడు వారితో, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ మధ్యకు పంపే ఖడ్గాన్ని బట్టి ఇకపై లేవకుండా పడిపోండి, త్రాగండి, త్రాగి వాంతులు చేసుకోండి.’

  8. యిర్మీయా 25:28సుమారు క్రీ.పూ. 606

    అయితే వారు మీ చేతిలో నుండి పాత్ర తీసుకుని త్రాగడానికి నిరాకరిస్తే, నీవు వారితో ఇలా చెప్పు, ‘మీరు దీన్ని త్రాగాలి అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.

  9. యిర్మీయా 25:29సుమారు క్రీ.పూ. 606

    ఇదిగో, నా పేరు ఉన్న పట్టణం మీదికి నేను విపత్తు రప్పించబోతున్నాను, మీరు నిజంగా శిక్షించబడరా? మీరు శిక్షించబడకుండా ఉండరు, ఎందుకంటే నేను భూమిపై నివసించే వారందరిపై ఖడ్గాన్ని రప్పిస్తున్నాను, అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.’

  10. యిర్మీయా 25:30సుమారు క్రీ.పూ. 606

    “ఇప్పుడు నీవు వారికి ఈ మాటలన్నీ ప్రవచించి వారితో ఇలా చెప్పు: “ ‘యెహోవా పైనుండి గర్జిస్తారు; ఆయన తన పవిత్ర నివాసం నుండి ఉరుముతారు; ఈ దేశానికి వ్యతిరేకంగా బలంగా గర్జిస్తారు. ద్రాక్షపండ్లను త్రొక్కేవారి మీద ఆయన గట్టిగా అరుస్తారు, భూమిపై నివసించే వారందరికి వ్యతిరేకంగా కేకలు వేస్తారు.

  11. యిర్మీయా 25:31సుమారు క్రీ.పూ. 606

    భూదిగంతముల వరకు ఆ సందడి ప్రతిధ్వనిస్తుంది, ఎందుకంటే యెహోవా దేశాల మీద ఆరోపణలు చేస్తాడు; అతడు సమస్త మానవాళికి తీర్పు తెచ్చి, దుర్మార్గులను ఖడ్గానికి గురి చేస్తాడు’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  12. యిర్మీయా 25:32సుమారు క్రీ.పూ. 606

    సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “ఇదిగో! దేశం నుండి దేశానికి విపత్తు విస్తరిస్తుంది; పెను తుఫాను భూమి అంచుల నుండి ఎగసిపడుతుంది.”

  13. యిర్మీయా 25:33సుమారు క్రీ.పూ. 606

    ఆ సమయంలో యెహోవాచేత చంపబడినవారు భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు ప్రతిచోటా ఉంటారు. వారి కోసం ఎవరూ దుఃఖించరు, వారి మృతదేహాలను సేకరించి పాతిపెట్టరు, అవి నేలమీద పెంటలా పడి ఉంటాయి.

  14. యిర్మీయా 25:34సుమారు క్రీ.పూ. 606

    కాపరులారా, ఏడవండి రోదించండి; మంద నాయకులారా, దుమ్ములో దొర్లండి. ఎందుకంటే మీరు వధించబడే సమయం ఆసన్నమైంది; మీరు శ్రేష్ఠమైన పొట్టేళ్లలా పడిపోతారు.

  15. యిర్మీయా 25:35సుమారు క్రీ.పూ. 606

    గొర్రెల కాపరులకు పారిపోవడానికి చోటు ఉండదు, మందలోని నాయకులు తప్పించుకోవడానికి స్థలం ఉండదు.

  16. యిర్మీయా 25:36సుమారు క్రీ.పూ. 606

    గొర్రెల కాపరుల మొర, మంద నాయకుల ఏడ్పులు వినబడుతున్నాయి, యెహోవా వారి పచ్చికను నాశనం చేస్తున్నారు.

  17. యిర్మీయా 25:37సుమారు క్రీ.పూ. 606

    నెమ్మదిగల పచ్చికభూములు యెహోవా కోపాగ్నికి పాడవుతాయి.

  18. యిర్మీయా 25:38సుమారు క్రీ.పూ. 606

    సింహం తన గుహలో నుంచి వచ్చినట్లు ఆయన వస్తారు, అణచివేసే వారి ఖడ్గం కారణంగా యెహోవా తీవ్రమైన కోపం కారణంగా వారి భూమి నిర్జనమైపోతుంది.

  19. యిర్మీయా 26:1సుమారు క్రీ.పూ. 610

    యూదారాజు యోషీయా కుమారుడైన యెహోయాకీము పరిపాలన ప్రారంభంలో, యెహోవా నుండి ఈ మాట వచ్చింది:

  20. యిర్మీయా 26:2సుమారు క్రీ.పూ. 610

    “యెహోవా ఇలా అంటున్నారు: యెహోవా ఆలయ ఆవరణలో నిలబడి, యూదా పట్టణాల నుండి యెహోవా మందిరంలో ఆరాధించడానికి వచ్చే ప్రజలందరితో మాట్లాడు. ఒక్క మాట కూడా వదలకుండ నేను నీకు ఆజ్ఞాపిస్తున్నదంతా వారికి చెప్పు.

  21. యిర్మీయా 26:3సుమారు క్రీ.పూ. 610

    బహుశా వారు విని తమ చెడు మార్గాలను విడిచిపెట్టవచ్చు. అప్పుడు నేను నా మనస్సు మార్చుకుని వారి దుర్మార్గాన్ని బట్టి నేను వారి మీదికి రప్పించాలనుకున్న విపత్తును రప్పించను.

  22. యిర్మీయా 26:4సుమారు క్రీ.పూ. 610

    వారితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు నా మాట వినకపోయినా, నేను మీ ముందు ఉంచిన నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినా,

  23. యిర్మీయా 26:5సుమారు క్రీ.పూ. 610

    పదే పదే నేను మీ దగ్గరకు పంపిన నా సేవకులైన ప్రవక్తల మాటలు మీరు వినకపోయినా,

  24. యిర్మీయా 26:6సుమారు క్రీ.పూ. 610

    నేను ఈ మందిరానికి షిలోహుకు చేసినట్లు చేస్తాను, ఈ పట్టణాన్ని భూమ్మీద ఉన్న అన్ని దేశాల్లో ఒక శాపంగా చేస్తాను.’ ”

  25. యిర్మీయా 26:7సుమారు క్రీ.పూ. 610

    యిర్మీయా యెహోవా మందిరంలో ఈ మాటలు మాట్లాడడం యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరూ విన్నారు.