కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా 27:9సుమారు క్రీ.పూ. 595

    కాబట్టి, ‘మీరు బబులోను రాజుకు సేవ చేయరు’ అని మీతో చెప్పే మీ ప్రవక్తలు, భవిష్యవాణి చెప్పేవారు, కలల భావం చెప్పేవారు, మృతుల ఆత్మతో మాట్లాడేవారు, మంత్రగాళ్ల మాటలు మీరు వినవద్దు.

  2. యిర్మీయా 27:10సుమారు క్రీ.పూ. 595

    మిమ్మల్ని మీ దేశం నుండి దూరం చేయడానికే వారు మీతో అబద్ధాలు ప్రవచిస్తారు; నేను నిన్ను వెళ్లగొడతాను మీరు నశిస్తారు.

  3. యిర్మీయా 27:11సుమారు క్రీ.పూ. 595

    అయితే ఏ దేశమైనా బబులోను రాజు కాడి క్రింద మెడ వంచి అతనికి సేవ చేస్తే, నేను ఆ దేశాన్ని దాని సొంత దేశంలోనే ఉండి, దానిలో వ్యవసాయం చేయడానికి అక్కడ నివసించడానికి అనుమతిస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.” ’ ”

  4. యిర్మీయా 27:12సుమారు క్రీ.పూ. 595

    నేను యూదా రాజైన సిద్కియాకు కూడా అదే సందేశం ఇచ్చాను. నేను, “బబులోను రాజు కాడి క్రింద నీ మెడను వంచు; అతనికి అతని ప్రజలకు సేవ చేయండి, మీరు జీవిస్తారు.

  5. యిర్మీయా 27:13సుమారు క్రీ.పూ. 595

    బబులోను రాజుకు సేవ చేయని ఏ దేశానికైనా యెహోవా హెచ్చరించినట్లు కత్తితో కరువుతో తెగులుతో నీవు, నీ ప్రజలు ఎందుకు చావాలి?

  6. యిర్మీయా 27:14సుమారు క్రీ.పూ. 595

    ప్రవక్తల మాటలను వినవద్దు, వారు మీతో, ‘నీవు బబులోను రాజుకు సేవ చేయవు’ అని అబద్ధాలు ప్రవచిస్తున్నారు.

  7. యిర్మీయా 27:15సుమారు క్రీ.పూ. 595

    యెహోవా ఇలా చెప్తున్నారు, ‘నేను వారిని పంపలేదు, నా పేరుతో వారు అబద్ధాలు ప్రవచిస్తున్నారు. కాబట్టి, నేను నిన్ను వెళ్లగొడతాను, మీరూ మీతో పాటు ప్రవచించే ప్రవక్తలు కూడా నశిస్తారు.’ ”

  8. యిర్మీయా 27:16సుమారు క్రీ.పూ. 595

    అప్పుడు నేను యాజకులతో, ఈ ప్రజలందరితో ఇలా అన్నాను: “యెహోవా ఇలా చెప్తున్నారు: ‘అతిత్వరలో యెహోవా ఆలయ పాత్రలు బబులోను నుండి మళ్ళీ తేబడతాయి’ అని చెప్పే ప్రవక్తల మాటలను మీరు వినవద్దు, వారు మీకు అబద్ధాలు ప్రవచిస్తున్నారు.

  9. యిర్మీయా 27:17సుమారు క్రీ.పూ. 595

    వారి మాట వినవద్దు. బబులోను రాజును సేవించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఈ పట్టణం ఎందుకు నాశనమవ్వాలి?

  10. యిర్మీయా 27:18సుమారు క్రీ.పూ. 595

    ఒకవేళ వారు ప్రవక్తలైతే వారు యెహోవా మాటలు కలిగి ఉన్నట్లయితే, యెహోవా మందిరంలో, యూదారాజు రాజభవనంలో యెరూషలేములో మిగిలి ఉన్న వస్తువులను బబులోనుకు తీసుకెళ్లవద్దని వారు సైన్యాల యెహోవాను వేడుకోవడం మంచిది.

  11. యిర్మీయా 27:19సుమారు క్రీ.పూ. 595

    ఎందుకంటే స్తంభాలు, ఇత్తడి నీళ్ల తొట్టె, కదిలే పీటలు ఈ పట్టణంలో మిగిలి ఉన్న ఇతర వస్తువుల గురించి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు,

  12. యిర్మీయా 27:20సుమారు క్రీ.పూ. 595

    వేటినైతే యూదా రాజైన యెహోయాకీము కుమారుడైన యెహోయాకీనును, యూదా యెరూషలేము పెద్దలందరిని యెరూషలేము నుండి బబులోనుకు బందీగా తీసుకెళ్లినప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు తీసుకెళ్లలేదో,

  13. యిర్మీయా 27:21సుమారు క్రీ.పూ. 595

    యెహోవా మందిరంలో, అలాగే యూదారాజు యొక్క రాజభవనంలో యెరూషలేములోను మిగిలిపోయిన వాటి గురించి ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా చెప్పారు:

  14. యిర్మీయా 27:22సుమారు క్రీ.పూ. 595

    ‘వాటిని బబులోనుకు తీసుకెళ్తారు; నేను వాటిని దర్శించి ఇక్కడికి తీసుకువచ్చి ఈ స్థలంలో పెట్టే వరకు అవి అక్కడే ఉంటాయి’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  15. యిర్మీయా 28:1సుమారు క్రీ.పూ. 595

    అదే సంవత్సరం అంటే, యూదారాజు సిద్కియా ఏలుబడిలో నాల్గవ సంవత్సరం అయిదవ నెలలో, గిబియోనుకు చెందిన అజ్జూరు కుమారుడైన హనన్యా ప్రవక్త యెహోవా మందిరంలో యాజకులు ప్రజలందరి సమక్షంలో నాతో ఇలా అన్నాడు,

  16. యిర్మీయా 28:2సుమారు క్రీ.పూ. 595

    “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను బబులోను రాజు కాడిని విరగ్గొడతాను.

  17. యిర్మీయా 28:3సుమారు క్రీ.పూ. 595

    బబులోను రాజైన నెబుకద్నెజరు ఇక్కడినుండి బబులోనుకు తీసుకెళ్లిన యెహోవా మందిరంలోని పాత్రలన్నిటిని రెండు సంవత్సరాల లోపు తిరిగి తెప్పిస్తాను.

  18. యిర్మీయా 28:4సుమారు క్రీ.పూ. 595

    నేను బబులోను రాజు కాడిని విరగ్గొట్టి, యూదా రాజును యెహోయాకీము కుమారుడునైన యెహోయాకీనును, బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన యూదావారందరిని తిరిగి ఇక్కడకు రప్పిస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.”

  19. యిర్మీయా 28:5సుమారు క్రీ.పూ. 595

    అప్పుడు యిర్మీయా ప్రవక్త యెహోవా మందిరంలో నిలబడి ఉన్న యాజకుల ముందు, ప్రజలందరి ముందు ప్రవక్తయైన హనన్యాకు జవాబిచ్చాడు.

  20. యిర్మీయా 28:6సుమారు క్రీ.పూ. 595

    యిర్మీయా ఇలా అన్నాడు, “ఆమేన్! యెహోవా అలా చేయును గాక! బబులోను నుండి యెహోవా మందిరానికి సంబంధించిన వస్తువులను బందీలుగా తీసుకెళ్లిన వారందరిని తిరిగి ఈ ప్రదేశానికి తీసుకువచ్చి నీవు ప్రవచించిన మాటలను యెహోవా నెరవేరుస్తారు.

  21. యిర్మీయా 28:7సుమారు క్రీ.పూ. 595

    అయితే, నీవు వింటుండగా, ఈ ప్రజలందరు వింటుండగా నేను చెప్పేది విను:

  22. యిర్మీయా 28:8సుమారు క్రీ.పూ. 595

    నీకు నాకు ముందు ఉన్న ప్రవక్తలు చాలా దేశాలకు గొప్ప రాజ్యాలకు వ్యతిరేకంగా యుద్ధాలు, విపత్తు, తెగులు గురించి చాలా కాలం నుండి ప్రవచించారు.

  23. యిర్మీయా 28:9సుమారు క్రీ.పూ. 595

    అయితే క్షేమం కలుగుతుందని ప్రవచించే ప్రవక్త తన అంచనా నిజమైతేనే యెహోవా పంపిన వ్యక్తిగా గుర్తించబడతాడు.”

  24. యిర్మీయా 28:10సుమారు క్రీ.పూ. 595

    అప్పుడు ప్రవక్తయైన హనన్యా యిర్మీయా ప్రవక్త మెడలోని కాడిని తీసి, దాన్ని విరిచి,

  25. యిర్మీయా 28:11సుమారు క్రీ.పూ. 595

    ప్రజలందరి ముందు, “యెహోవా ఇలా అంటున్నారు: ‘రెండు సంవత్సరాల్లో అన్ని దేశాల మెడ మీద నుండి బబులోను రాజై నెబుకద్నెజరు కాడిని నేను అలాగే విరగ్గొడతాను.’ ” అది వినగానే యిర్మీయా ప్రవక్త అక్కడినుండి వెళ్లిపోయాడు.