circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యిర్మీయా 28:12సుమారు క్రీ.పూ. 595
ప్రవక్తయైన హనన్యా యిర్మీయా ప్రవక్త మెడలోని కాడిని విరగ్గొట్టిన తర్వాత, యెహోవా వాక్కు యిర్మీయాకు ఇలా వచ్చింది:
- యిర్మీయా 28:13సుమారు క్రీ.పూ. 595
“నీవు, వెళ్లి హనన్యాతో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పేదేమిటంటే, నీవు చెక్క కాడి విరగ్గొట్టావు. కానీ దాని స్థానంలో నీవు ఇనుప కాడిని పొందుతావు.
- యిర్మీయా 28:14సుమారు క్రీ.పూ. 595
ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: బబులోను రాజైన నెబుకద్నెజరుకు సేవ చేసేలా ఈ దేశాలందరి మెడపై నేను ఇనుప కాడిని ఉంచుతాను. అడవి జంతువులపై కూడా నేను అతనికి అధికారం ఇస్తాను.’ ”
- యిర్మీయా 28:15సుమారు క్రీ.పూ. 595
అప్పుడు యిర్మీయా ప్రవక్త హనన్యా ప్రవక్తతో ఇలా అన్నాడు: “విను హనన్యా! యెహోవా నిన్ను పంపలేదు, అయినప్పటికీ నీ అబద్ధాలను ఈ ప్రజలు నమ్మేలా చేశావు.
- యిర్మీయా 28:16సుమారు క్రీ.పూ. 595
కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నిన్ను భూమి మీద నుండి తొలగించబోతున్నాను. మీరు ప్రభువుకు వ్యతిరేకంగా తిరుగుబాటు బోధించారు కాబట్టి ఈ సంవత్సరమే మీరు చనిపోతారు.’ ”
- యిర్మీయా 28:17సుమారు క్రీ.పూ. 595
అదే సంవత్సరం ఏడవ నెలలో హనన్యా ప్రవక్త చనిపోయాడు.
- యిర్మీయా 29:1సుమారు క్రీ.పూ. 599
నెబుకద్నెజరు యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన వారిలో మిగిలి ఉన్న పెద్దలకు, యాజకులకు, ప్రవక్తలకు, ఇతర ప్రజలందరికి యెరూషలేము నుండి యిర్మీయా ప్రవక్త పంపిన ఉత్తరంలోని మాటలు ఇవి.
- యిర్మీయా 29:2సుమారు క్రీ.పూ. 599
(యెహోయాకీను రాజు, రాజమాత, ఆస్థాన అధికారులు, యూదా, యెరూషలేము నాయకులు, నిపుణులైన పనివారు కళాకారులు యెరూషలేము నుండి బందీలుగా తీసుకువెళ్లిన తర్వాత ఈ ఉత్తరం పంపబడినది.)
- యిర్మీయా 29:3సుమారు క్రీ.పూ. 599
యూదా రాజైన సిద్కియా బబులోను రాజు నెబుకద్నెజరు దగ్గరకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశా, హిల్కీయా కుమారుడైన గెమర్యాలతో అతడు ఈ ఉత్తరాన్ని పంపించాడు. అందులో ఇలా ఉంది:
- యిర్మీయా 29:4సుమారు క్రీ.పూ. 599
ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా తన ఇష్టప్రకారం యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన వారందరితో ఇలా అంటున్నారు:
- యిర్మీయా 29:5సుమారు క్రీ.పూ. 599
“ఇల్లు కట్టుకుని స్థిరపడండి; తోటలు నాటి వాటి పండ్లను తినండి.
- యిర్మీయా 29:6సుమారు క్రీ.పూ. 599
పెళ్ళి చేసుకుని కుమారులు, కుమార్తెలను కనండి; మీ కుమారులకు భార్యలను తెచ్చుకోండి, మీ కుమార్తెలకు పెళ్ళి చేయండి, వారు కూడా కుమారులు కుమార్తెలను కంటారు. అప్పుడు మీ సంఖ్య తగ్గకుండ అధికమవుతుంది.
- యిర్మీయా 29:7సుమారు క్రీ.పూ. 599
అలాగే, నేను మిమ్మల్ని బందీలుగా తీసుకువెళ్లిన పట్టణంలో సమాధానం, అభివృద్ధి ఉండాలని కోరుకుని యెహోవాను ప్రార్థించండి, ఎందుకంటే అది అభివృద్ధి చెందితే, మీరు కూడా అభివృద్ధి చెందుతారు.”
- యిర్మీయా 29:8సుమారు క్రీ.పూ. 599
అవును, ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మీ మధ్య ఉన్న ప్రవక్తలు భవిష్యవాణి చెప్పేవారు మిమ్మల్ని మోసగించకుండ చూసుకోండి. మీలో కలలు కనేవారి మాటలు మీరు వినకండి.
- యిర్మీయా 29:9సుమారు క్రీ.పూ. 599
వారు నా పేరిట అబద్ధాలు ప్రవచిస్తున్నారు. నేను వారిని పంపలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 29:10సుమారు క్రీ.పూ. 599
యెహోవా ఇలా అంటున్నారు: “బబులోనుకు డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు, నేను మిమ్మల్ని దర్శించి నేను చేసిన మంచి వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మల్ని ఈ స్థలానికి తిరిగి రప్పిస్తాను.
- యిర్మీయా 29:11సుమారు క్రీ.పూ. 599
ఎందుకంటే మీ కోసం నేను ఏర్పరచుకున్న ప్రణాళికలు నాకు తెలుసు” అని యెహోవా అంటున్నారు. “అవి మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి, రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలిగించే సమాధానకరమైన ఉద్దేశాలే గాని మీకు హాని కలిగించడానికి కాదు.
- యిర్మీయా 29:12సుమారు క్రీ.పూ. 599
అప్పుడు మీరు నాకు మొరపెట్టి నాకు ప్రార్థిస్తారు, అప్పుడు నేను మీ మాట వింటాను.
- యిర్మీయా 29:13సుమారు క్రీ.పూ. 599
మీరు నన్ను వెదకినప్పుడు, మీ పూర్ణహృదయంతో నన్ను వెదికినప్పుడు నన్ను కనుగొంటారు.
- యిర్మీయా 29:14సుమారు క్రీ.పూ. 599
మీరు నన్ను కనుగొంటారు, మిమ్మల్ని చెర నుండి తిరిగి రప్పిస్తాను. నేను మిమ్మల్ని వెళ్లగొట్టిన అన్ని దేశాల నుండి అన్ని ప్రాంతాల నుండి మిమ్మల్ని సమకూరుస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను మిమ్మల్ని వెళ్లగొట్టిన దేశానికి తిరిగి తీసుకువస్తాను.
- యిర్మీయా 29:15సుమారు క్రీ.పూ. 599
“బబులోనులో యెహోవా మన కోసం ప్రవక్తలను లేవనెత్తారు” అని మీరు అనవచ్చు,
- యిర్మీయా 29:16సుమారు క్రీ.పూ. 599
అయితే దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజు గురించి, మీతో పాటు బందీలుగా వెళ్లకుండా ఈ పట్టణంలో మిగిలిన మీ తోటి సోదరులు ప్రజలందరి గురించి యెహోవా ఇలా అంటున్నారు.
- యిర్మీయా 29:17సుమారు క్రీ.పూ. 599
సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను ఖడ్గాన్ని, కరువును, తెగులును వారిపైకి పంపుతాను, వారిని తినడానికి పనికిరాని చెడ్డ అంజూర పండ్లలా చేస్తాను.
- యిర్మీయా 29:18సుమారు క్రీ.పూ. 599
నేను వారిని ఖడ్గంతో, కరువుతో, తెగుళ్ళతో వెంటాడి, వారిని ఏ దేశాల్లోకి తరుముతానో ఆ భూరాజ్యాలన్నిటికి వారిని అసహ్యమైన వారిగా, శాపంగా, భయానకంగా, హేళనగా నిందగా చేస్తాను.
- యిర్మీయా 29:19సుమారు క్రీ.పూ. 599
ఎందుకంటే వారు నా మాటలు వినలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నా సేవకులైన ప్రవక్తల ద్వారా నేను వారికి మళ్ళీ మళ్ళీ పంపిన మాటలు వారు వినలేదు. వారే కాదు బందీలుగా ఉన్న మీరు కూడా వినలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.