circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యిర్మీయా 30:13సుమారు క్రీ.పూ. 606
నీ పక్షంగా వాదించడానికి ఎవరు లేరు, నీ పుండుకు నివారణ లేదు, నీకు స్వస్థత లేదు.
- యిర్మీయా 30:14సుమారు క్రీ.పూ. 606
నీ స్నేహితులందరు నిన్ను మరచిపోయారు; వారు నీ గురించి ఏమీ పట్టించుకోరు. శత్రువు కొట్టినట్లుగా నేను నిన్ను కొట్టి, క్రూరమైనవానిలా నిన్ను శిక్షించాను, ఎందుకంటే నీ అపరాధం చాలా పెద్దది, నీ పాపాలు చాలా ఎక్కువ.
- యిర్మీయా 30:15సుమారు క్రీ.పూ. 606
నీ గాయం గురించి, తీరని నీ బాధ గురించి ఎందుకు ఏడుస్తున్నావు? నీ గొప్ప అపరాధం అనేక పాపాల కారణంగా నేను నీకు ఇవన్నీ చేశాను.
- యిర్మీయా 30:16సుమారు క్రీ.పూ. 606
“ ‘అయితే నిన్ను మ్రింగివేసేవాళ్లంతా మ్రింగివేయబడతారు; నీ శత్రువులందరూ బందీలుగా కొనిపోబడతారు. నిన్ను దోచుకునేవారు దోచుకోబడతారు; నిన్ను పాడుచేసే వారందరిని నేను పాడుచేస్తాను.
- యిర్మీయా 30:17సుమారు క్రీ.పూ. 606
అయితే నేను నీకు స్వస్థత కలుగజేసి నీ గాయాలను బాగుచేస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ఎందుకంటే ‘నీవు వెలివేయబడినవాడవని, సీయోనును ఎవ్వరూ పట్టించుకోరు’ అని నీ గురించి అన్నారు.
- యిర్మీయా 30:18సుమారు క్రీ.పూ. 606
“యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నేను యాకోబు ఇంటివారిని చెర నుండి తిరిగి రప్పించి, అతని నివాసాలపై కనికరం చూపుతాను. పట్టణం దాని శిథిలాల మీద మరలా కట్టబడుతుంది, రాజభవనం దాని స్థలంలోనే ఉంటుంది.
- యిర్మీయా 30:19సుమారు క్రీ.పూ. 606
వాటినుండి కృతజ్ఞతాగీతాలు ఆనంద ధ్వనులు వస్తాయి. నేను వారి సంఖ్యను తగ్గించకుండ, అధికం చేస్తాను; నేను వారికి ఘనతను తెస్తాను, వారు అసహ్యానికి గురికారు.
- యిర్మీయా 30:20సుమారు క్రీ.పూ. 606
వారి పిల్లలు పూర్వకాలంలో ఉన్నట్లే ఉంటారు, వారి సంఘం నా ముందు స్థిరపడుతుంది; వారిని హింసించే వారందరినీ నేను శిక్షిస్తాను.
- యిర్మీయా 30:21సుమారు క్రీ.పూ. 606
వారి నాయకుడు వారిలో ఒకడు; వారి పాలకుడు వారి మధ్య నుండి లేస్తాడు. నేను అతన్ని దగ్గరికి తీసుకువస్తాను, అతడు నా దగ్గరికి వస్తాడు నన్ను సమీపించే సాహసం చేయగల వ్యక్తి ఎవరు?’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 30:22సుమారు క్రీ.పూ. 606
‘కాబట్టి మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడను.’ ”
- యిర్మీయా 30:23సుమారు క్రీ.పూ. 606
చూడండి, యెహోవా ఉగ్రత తుఫానులా విరుచుకుపడుతుంది, అది సుడిగాలిలా వీస్తూ దుష్టుల తలలపైకి తిరుగుతుంది.
- యిర్మీయా 30:24సుమారు క్రీ.పూ. 606
ఆయన తన హృదయ ఉద్దేశాలను పూర్తిగా నెరవేర్చే వరకు యెహోవా తీవ్రమైన కోపం చల్లారదు. రాబోయే రోజుల్లో మీరు దీన్ని గ్రహిస్తారు.
- యిర్మీయా 31:1సుమారు క్రీ.పూ. 606
యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఆ సమయంలో నేను ఇశ్రాయేలు కుటుంబాలన్నిటికీ దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు.”
- యిర్మీయా 31:2సుమారు క్రీ.పూ. 606
యెహోవా చెప్పేదేమిటంటే: “ఖడ్గం నుండి తప్పించుకున్న ప్రజలు అరణ్యంలో దయ పొందుతారు; ఇశ్రాయేలీయులకు విశ్రాంతి ఇవ్వడానికి నేను వస్తాను.”
- యిర్మీయా 31:3సుమారు క్రీ.పూ. 606
గతంలో యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: “నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను; నేను మారని ప్రేమతో నిన్ను నా వైపు ఆకర్షించాను.
- యిర్మీయా 31:4సుమారు క్రీ.పూ. 606
నేను నిన్ను మళ్ళీ నిర్మిస్తాను, ఇశ్రాయేలు కన్యా, నీవు తిరిగి కట్టబడతావు. మళ్ళీ నీవు నీ తంబురలు తీసుకుని ఆనందించే వారితో కలిసి నాట్యం చేస్తావు.
- యిర్మీయా 31:5సుమారు క్రీ.పూ. 606
మళ్ళీ సమరయ కొండలపై నీవు ద్రాక్షతోటలు నాటుతావు. రైతులు వాటిని నాటుతారు నీవు వాటి ఫలాలను తింటూ ఆనందిస్తావు.
- యిర్మీయా 31:6సుమారు క్రీ.పూ. 606
ఎఫ్రాయిం కొండలమీద కావలివారు, ‘రండి, మనం సీయోనుకు, మన దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్దాం’ అని కేకలు వేసే రోజు వస్తుంది.”
- యిర్మీయా 31:7సుమారు క్రీ.పూ. 606
యెహోవా ఇలా అంటున్నారు: “యాకోబు కోసం ఆనందంగా పాడండి; దేశాల్లో గొప్పదాని కోసం కేకవేయండి. స్తుతులు చెల్లిస్తూ, ‘యెహోవా, ఇశ్రాయేలీయులలో మిగిలిన, నీ ప్రజలను రక్షించండి’ అని అనండి.
- యిర్మీయా 31:8సుమారు క్రీ.పూ. 606
చూడు, నేను వారిని ఉత్తర దేశం నుండి రప్పించి, భూమి మూలల నుండి వారిని పోగుచేస్తాను. వారిలో గ్రుడ్డివారు, కుంటివారు, తల్లి కాబోతున్నవారు పురిటినొప్పులు పడుతున్న స్త్రీలు ఉంటారు; గొప్ప గుంపు తరలివస్తుంది.
- యిర్మీయా 31:9సుమారు క్రీ.పూ. 606
వారు ఏడుస్తూ వస్తారు; నేను వారిని వెనుకకు తీసుకువస్తున్నప్పుడు వారు ప్రార్థన చేస్తారు. నేను వారిని నీటి ప్రవాహాల ప్రక్కన వారు తడబడని తిన్నని దారిలో నడిపిస్తాను ఎందుకంటే నేను ఇశ్రాయేలీయుల తండ్రిగా ఉంటాను, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారునిగా ఉంటాడు.
- యిర్మీయా 31:10సుమారు క్రీ.పూ. 606
“జనులారా, యెహోవా మాట వినండి; సుదూర తీరప్రాంతాలలో ఇలా ప్రకటించండి: ‘ఇశ్రాయేలును చెదరగొట్టినవారే వారిని సమకూర్చి, కాపరిలా తన మందను కాపాడతాడు.’
- యిర్మీయా 31:11సుమారు క్రీ.పూ. 606
ఎందుకంటే యెహోవా యాకోబును, వారికంటే బలవంతుల చేతిలో నుండి వారిని విడిపిస్తారు.
- యిర్మీయా 31:12సుమారు క్రీ.పూ. 606
వారు వచ్చి సీయోను కొండలమీద ఆనందంతో కేకలు వేస్తారు. వారు యెహోవా ఇచ్చిన సమృద్ధిని బట్టి ధాన్యం, క్రొత్త ద్రాక్షారసం ఒలీవ నూనెలను బట్టి, గొర్రెలకు పశువులకు పుట్టే పిల్లలను బట్టి సంతోషిస్తారు వారు బాగా నీరు పెట్టిన తోటలా ఉంటారు, వారు ఇకపై విచారించరు.
- యిర్మీయా 31:13సుమారు క్రీ.పూ. 606
అప్పుడు యువతులు యువకులు, వృద్ధులు సంతోషంతో నాట్యం చేస్తారు. నేను వారి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను; నేను వారికి విచారానికి బదులుగా ఆదరణను, ఆనందాన్ని ఇస్తాను.