కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా 31:14సుమారు క్రీ.పూ. 606

    నేను యాజకులను సమృద్ధితో తృప్తిపరుస్తాను, నా ప్రజలు నా సమృద్ధితో నింపబడతారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  2. యిర్మీయా 31:15సుమారు క్రీ.పూ. 606

    యెహోవా చెప్పే మాట ఇదే: “రామాలో రోదన, గొప్ప ఏడ్పు వినబడుతుంది, రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఇక వారు లేరని, ఓదార్పు పొందడానికి నిరాకరిస్తుంది.”

  3. యిర్మీయా 31:16సుమారు క్రీ.పూ. 606

    యెహోవా ఇలా చెప్తున్నారు: “ఏడవకుండా నీ స్వరాన్ని, కన్నీరు పెట్టుకోకుండా నీ కళ్లను అడ్డుకో, ఎందుకంటే నీ పనికి ప్రతిఫలం లభిస్తుంది, వారు శత్రువుల దేశం నుండి తిరిగి వస్తారు, అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  4. యిర్మీయా 31:17సుమారు క్రీ.పూ. 606

    కాబట్టి నీ సంతానానికి నిరీక్షణ ఉంది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “మీ పిల్లలు తమ సొంత దేశానికి తిరిగి వస్తారు.

  5. యిర్మీయా 31:18సుమారు క్రీ.పూ. 606

    “ఎఫ్రాయిం మూలుగులు నేను ఖచ్చితంగా విన్నాను: ‘శిక్షణ పొందని దూడలా ఉన్న నన్ను మీరు క్రమశిక్షణలో పెట్టారు, నేను క్రమశిక్షణ పొందాను. నన్ను బాగుచేయండి, నేను తిరిగి వస్తాను, ఎందుకంటే మీరే నా దేవుడైన యెహోవావు.

  6. యిర్మీయా 31:19సుమారు క్రీ.పూ. 606

    నేను దారితప్పిన తర్వాత, పశ్చాత్తాపపడ్డాను; నేను అర్థం చేసుకున్న తర్వాత, నా రొమ్ము కొట్టుకున్నాను. నా యవ్వనంలో కలిగిన అవమానాన్ని భరిస్తూ, నేను సిగ్గుపడ్డాను అవమానపాలయ్యాను.’

  7. యిర్మీయా 31:20సుమారు క్రీ.పూ. 606

    ఎఫ్రాయిం నా ప్రియ కుమారుడు, నేను ఇష్టపడే బిడ్డ కాదా? నేను తరచుగా అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, నేను ఇప్పటికీ అతన్ని జ్ఞాపకముంచుకుంటాను. కాబట్టి నా హృదయం అతని కోసం ఆశపడుతుంది; అతని మీద నాకు చాలా కనికరం ఉంది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  8. యిర్మీయా 31:21సుమారు క్రీ.పూ. 606

    “రహదారి గుర్తులను ఏర్పాటు చేయి; దారి చూపే స్తంభాలు పెట్టించు. నీవు వెళ్లే మార్గాన్ని, ఆ రహదారిని గమనించు. ఇశ్రాయేలు కన్యా, నీ పట్టణాలకు తిరిగి రా.

  9. యిర్మీయా 31:22సుమారు క్రీ.పూ. 606

    విశ్వాసఘాతకురాలవైన కుమార్తె, ఇశ్రాయేలూ, నీవు ఎంతకాలం తిరుగుతావు? యెహోవా భూమిపై ఒక క్రొత్తదాన్ని సృష్టిస్తారు, స్త్రీ పురుషుని దగ్గరకు తిరిగి వస్తుంది.”

  10. యిర్మీయా 31:23సుమారు క్రీ.పూ. 606

    ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను వారిని చెర నుండి తిరిగి రప్పించినప్పుడు, యూదా దేశంలోనూ దాని పట్టణాల్లోనూ ఉన్న ప్రజలు ఇలా చెప్తారు: ‘నీతి కలిగిన నగరమా, పవిత్ర పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక.’

  11. యిర్మీయా 31:24సుమారు క్రీ.పూ. 606

    రైతులు, తమ మందలతో తిరిగే కాపరులతో సహా యూదాలో, దాని పట్టణాలన్నిటిలో ప్రజలందరూ కలిసి జీవిస్తారు.

  12. యిర్మీయా 31:25సుమారు క్రీ.పూ. 606

    అలసినవారికి అలసట తీరుస్తాను, అలసిన వారి ఆశను తృప్తిపరుస్తాను.”

  13. యిర్మీయా 31:26సుమారు క్రీ.పూ. 606

    అంతలో నాకు మెలకువ వచ్చి చుట్టూ చూశాను. నా నిద్ర నాకు హాయిగా ఉంది.

  14. యిర్మీయా 31:27సుమారు క్రీ.పూ. 606

    యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను మనుష్యుల సంతానంతో అలాగే జంతువుల సంతానంతో నాటే రోజులు రాబోతున్నాయి.

  15. యిర్మీయా 31:28సుమారు క్రీ.పూ. 606

    నేను వారిని పెరికివేయడానికి, కూల్చివేయడానికి, పడద్రోయడానికి, నాశనం చేయడానికి, విపత్తును రప్పించడానికి ఎలా ఎదురుచూశానో, అలాగే వారిని కట్టడానికి నాటడానికి నేను ఎదురుచూస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  16. యిర్మీయా 31:29సుమారు క్రీ.పూ. 606

    “ఆ రోజుల్లో ప్రజలు, “ ‘తల్లిదండ్రులు పుల్లని ద్రాక్షలు తిన్నప్పుడు, పిల్లల పళ్లు పులిసాయి’ అనే సామెత చెప్పరు.

  17. యిర్మీయా 31:30సుమారు క్రీ.పూ. 606

    ఎవరి పాపానికి వారే చస్తారు; ఎవరు పుల్లని ద్రాక్షలు తింటారో వారి పళ్లే పులుస్తాయి.

  18. యిర్మీయా 31:31సుమారు క్రీ.పూ. 606

    యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ క్రొత్త నిబంధన చేసే రోజులు వస్తున్నాయి.

  19. యిర్మీయా 31:32సుమారు క్రీ.పూ. 606

    ఆ నిబంధన, ఈజిప్టు నుండి నేను వారి పూర్వికుల చేయి పట్టుకుని బయటకు నడిపించినపుడు నేను వారితో చేసిన నిబంధనలా ఉండదు, ఎందుకంటే నేను వారికి ఒక భర్తగా ఉన్నా, వారితో చేసిన నా నిబంధనను వారు ఉల్లంఘించారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  20. యిర్మీయా 31:33సుమారు క్రీ.పూ. 606

    “ఆ కాలం తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో నేను చేసే నిబంధన ఇదే” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నేను నా ధర్మశాస్త్రాన్ని వారి మనస్సుల్లో ఉంచి, దాన్ని వారి హృదయాల మీద వ్రాస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు.

  21. యిర్మీయా 31:34సుమారు క్రీ.పూ. 606

    ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగువారికి బోధించరు, ‘యెహోవాను తెలుసుకోండి’ అని ఒకరికొకరు చెప్పుకోరు, ఎందుకంటే వారిలో, సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకు అందరు నన్ను తెలుసుకుంటారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఎందుకంటే నేను వారి దుష్టత్వాన్ని క్షమించి వారి పాపాలను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.”

  22. యిర్మీయా 31:35సుమారు క్రీ.పూ. 606

    యెహోవా ఇలా చెప్తున్నారు, పగలు ప్రకాశించడానికి సూర్యుని నియమించినవాడు, రాత్రి ప్రకాశించడానికి, చంద్రుని, నక్షత్రాలను శాసించేవాడు, కెరటాలు గర్జించేలా, సముద్రాన్ని కదిలించేవాడు ఆయనే, ఆయన పేరు సైన్యాల యెహోవా:

  23. యిర్మీయా 31:36సుమారు క్రీ.పూ. 606

    “ఈ శాసనాలు నా దృష్టి నుండి మాయమైతేనే,” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఇశ్రాయేలు ఇక ఎన్నటికీ నా ఎదుట ఒక జనంగా ఉండదు.”

  24. యిర్మీయా 31:37సుమారు క్రీ.పూ. 606

    యెహోవా ఇలా అంటున్నారు: “పైన ఉన్న ఆకాశాలు కొలవబడగలిగితే, అలాగే క్రింద ఉన్న భూమి పునాదులు పరిశోధించబడగలిగితే తప్ప, వారు చేసినదంతటిని బట్టి నేను ఇశ్రాయేలు సంతతివారందరిని తిరస్కరిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  25. యిర్మీయా 31:38సుమారు క్రీ.పూ. 606

    యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “హనానేలు గోపురం నుండి మూల ద్వారం వరకు ఈ పట్టణం నా కోసం తిరిగి కట్టబడే రోజులు వస్తున్నాయి.