- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 930–586 BC
The Divided Kingdom
The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.
ఈ కాలపు వచనాలు
- 2 రాజులు 6:28సుమారు క్రీ.పూ. 893
తర్వాత రాజు ఆమెను, “నీ సమస్య ఏంటి?” అని అడిగాడు. ఆమె, “ఒకామె నాతో, ‘నీ కుమారుని ఇవ్వు, ఈ రోజు వాన్ని తిందాం, రేపు నా కుమారుని తిందాం’ అని చెప్పింది.
- 2 రాజులు 6:29సుమారు క్రీ.పూ. 893
కాబట్టి నా కుమారుని వండుకుని తిన్నాము. మరుసటిరోజు నేను ఆమెతో, ‘నీ కుమారుని ఇవ్వు వాన్ని తిందాం’ అన్నాను, కాని ఆమె తన కుమారుని దాచుకుంది” అని చెప్పింది.
- 2 రాజులు 6:30సుమారు క్రీ.పూ. 893
రాజు ఆ స్త్రీ చెప్పింది విన్నప్పుడు, తన బట్టలు చించుకున్నాడు. అతడు ప్రాకారం దగ్గర నడుస్తూ వెళ్తున్నప్పుడు, ప్రజలు అతనిపై వస్త్రం లోపల గోనెపట్ట ఉండడం చూశారు.
- 2 రాజులు 6:31సుమారు క్రీ.పూ. 893
అతడు, “ఈ రోజు షాపాతు కుమారుడైన ఎలీషా మెడమీద అతని తల ఉంటే, దేవుడు నాకు చాలా కీడు చేయును గాక!” అన్నాడు.
- 2 రాజులు 6:32సుమారు క్రీ.పూ. 893
అప్పుడు ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు, అతనితో పెద్దలు కూర్చుని ఉన్నారు. రాజు ఒక దూతను పంపాడు, కాని అతడు ఎలీషాను చేరకముందే, ఎలీషా ఆ పెద్దలతో, “ఆ హంతకుడు నా తల నరకమని మనిషిని పంపిస్తున్నాడని మీరు చూడట్లేదా? చూడండి, ఆ దూత రాగానే తలుపు మూసి అతన్ని లోపలికి రానివ్వకండి. అతని వెంట అతని యజమాని పాదాల శబ్దం వస్తుంది కదా” అని చెప్పాడు.
- 2 రాజులు 6:33సుమారు క్రీ.పూ. 893
ఎలీషా వారితో ఇంకా మాట్లాడుతుండగానే, ఆ దూత అతని దగ్గరకు వచ్చాడు. రాజు, “ఈ ఆపద యెహోవా నుండి వచ్చింది. నేను యెహోవా కోసం ఇంకా ఎందుకు కనిపెట్టాలి?” అన్నాడు.
- 2 రాజులు 7:1సుమారు క్రీ.పూ. 892
అందుకు ఎలీషా రాజుతో, “యెహోవా మాట విను. యెహోవా చెప్పే మాట ఇదే: రేపు ఇదే వేళకు షెకెల్ వెండికి ఒక మానిక సన్నని గోధుమ పిండి, షెకెల్ వెండికి రెండు మానికల యవలు సమరయ ద్వారం దగ్గర అమ్ముతారు” అని చెప్పాడు.
- 2 రాజులు 7:2సుమారు క్రీ.పూ. 892
రాజు ఏ అధిపతి చేతి మీద ఆనుకుని ఉన్నాడో ఆ అధిపతి దైవజనునితో, “చూడండి, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరచినా కూడా, ఇది జరగుతుందా?” అని అన్నాడు. అందుకు ఎలీషా, “నీవు నీ సొంత కళ్లతో చూస్తావు కాని, దానిలో ఏమీ తినవు” అన్నాడు.
- 2 రాజులు 7:3సుమారు క్రీ.పూ. 892
అప్పుడు పట్టణ ప్రవేశ ద్వారం దగ్గర నలుగురు కుష్ఠురోగులు ఉన్నారు, వారు ఒకరితో ఒకరు, “మనం చచ్చేంతవరకు ఎందుకు ఇక్కడ ఉండాలి?
- 2 రాజులు 7:4సుమారు క్రీ.పూ. 892
ఒకవేళ మనం పట్టణంలోనికి వెళ్తే అక్కడ కరువుతో చస్తాము. ఇలా ఇక్కడే ఉన్నా మనం చస్తాము. కాబట్టి మనం అరామీయుల శిబిరానికి వెళ్లి వారి దగ్గర లొంగిపోదాము. వారు మనలను బ్రతకనిస్తే బ్రతుకుతాం చంపితే చస్తాం” అనుకున్నారు.
- 2 రాజులు 7:5సుమారు క్రీ.పూ. 892
సంధ్యా సమయంలో వారు లేచి అరామీయుల శిబిరానికి వెళ్లారు. వారు ఆ శిబిరం పొలిమేరకు వెళ్లగా అక్కడ ఎవరూ లేరు.
- 2 రాజులు 7:6సుమారు క్రీ.పూ. 892
ఎందుకంటే యెహోవా అరాము సైన్యానికి రథాలు, గుర్రాలు, గొప్ప సైన్యం వస్తున్న శబ్దం వినిపించేటట్టు చేశారు, అందువల్ల వారు ఒకరితో ఒకరు, “చూడండి, ఇశ్రాయేలు రాజు మనమీద దాడి చేయడానికి హిత్తీయుల రాజులను, ఈజిప్టు రాజులను తోడు తెచ్చుకున్నాడు!” అని చెప్పుకున్నారు.
- 2 రాజులు 7:7సుమారు క్రీ.పూ. 892
కాబట్టి వారు తమ ప్రాణాలు దక్కించుకోవాలని తమ గుడారాలను, గుర్రాలను, గాడిదలను ఎక్కడివి అక్కడే శిబిరంలో వదిలిపెట్టి తెల్లవారక ముందే చీకట్లోనే పారిపోయారు.
- 2 రాజులు 7:8సుమారు క్రీ.పూ. 892
ఆ కుష్ఠురోగులు శిబిరం దగ్గరకు వచ్చి ఒక గుడారంలోకి వెళ్లి అందులో తిని త్రాగారు. తర్వాత వారు వెండి, బంగారం, దుస్తులను తీసుకెళ్లి దాచారు. వారు తిరిగివచ్చి ఇంకొక గుడారంలోకి వెళ్లి, అందులో నుండి వస్తువులు తీసుకెళ్లి వాటిని దాచిపెట్టారు.
- 2 రాజులు 7:9సుమారు క్రీ.పూ. 892
అప్పుడు వారు ఒకరితో ఒకరు, “మనం చేసేది మంచిది కాదు. ఇది శుభవార్త కలిగిన రోజు, మనం ఎవరితో పంచుకోవడం లేదు! ఒకవేళ తెల్లవారే వరకు మనం ఆగితే, శిక్షకు గురవుతాము. కాబట్టి ఇప్పుడే వెళ్లి రాజభవనంలో ఈ విషయం తెలియజేద్దాం” అని చెప్పుకొన్నారు.
- 2 రాజులు 7:10సుమారు క్రీ.పూ. 892
కాబట్టి వారు వెళ్లి పట్టణ ద్వారపాలకులను పిలిచి, “మేము అరామీయుల శిబిరానికి వెళ్లాము. అక్కడ ఎవరూ లేరు, మనిషి చప్పుడు కూడా లేదు, గుర్రాలు, గాడిదలు, గుడారాలు ఉన్నవి ఉన్నట్లే ఉన్నాయి” అని చెప్పారు.
- 2 రాజులు 7:11సుమారు క్రీ.పూ. 892
ఆ ద్వారపాలకులు, ఆ వార్త బిగ్గరగా కేకలువేస్తూ రాజభవనంలో ఉన్నవారికి తెలియజేశారు.
- 2 రాజులు 7:12సుమారు క్రీ.పూ. 892
రాజు రాత్రివేళ లేచి తన అధికారులతో, “మనకు వ్యతిరేకంగా అరామీయులు చేసేది చెప్తాను వినండి, మనం ఆకలితో అలమటిస్తున్నామని వారికి తెలుసు; కాబట్టి ‘వారు ఖచ్చితంగా బయటకు వస్తారు, అప్పుడు వారిని ప్రాణాలతో పట్టుకుని, నగరంలో చొరబడదాం’ అని అనుకుని వారు శిబిరం విడిచిపెట్టి వెళ్లి పొలాల్లో దాక్కున్నారు” అని చెప్పాడు.
- 2 రాజులు 7:13సుమారు క్రీ.పూ. 892
అతని అధికారులలో ఒకడు, “పట్టణంలో మిగిలిన అయిదు గుర్రాలను తీసుకుని కొంతమందిని అక్కడికి వెళ్లనివ్వండి, వారి పరిస్థితి, మిగిలిన ఇశ్రాయేలీయులందరి పరిస్థితి ఒక్కటే, అందరం చనిపోతాము. కాబట్టి ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వారిని పంపుదాం” అని అన్నాడు.
- 2 రాజులు 7:14సుమారు క్రీ.పూ. 892
కాబట్టి వారు రెండు రథాలను, వాటి గుర్రాలను తీసుకున్నారు. రాజు వారిని అరాము సైన్యం వెనుక పంపుతూ, “మీరు వెళ్లి ఏమి జరిగిందో తెలుసుకోండి” అని వారిని ఆదేశించాడు.
- 2 రాజులు 7:15సుమారు క్రీ.పూ. 892
వారు అరాము సైన్యం వెంట యొర్దాను వరకు వెళ్లారు, దారి పొడవున అరామీయులు పారిపోయే తొందరలో బట్టలు సామాన్లు పారవేసి వెళ్లారు. కాబట్టి రాజు పంపిన దూతలు తిరిగివచ్చి ఆ విషయం రాజుకు తెలిపారు.
- 2 రాజులు 7:16సుమారు క్రీ.పూ. 892
అప్పుడు ప్రజలు బయటకు వెళ్లి అరామీయుల శిబిరాన్ని దోచుకున్నారు. యెహోవా చెప్పిన మాట ప్రకారమే, షెకెల్ వెండికి ఒక మానిక సన్నని గోధుమ పిండి, షెకెల్ వెండికి రెండు మానికల యవలు అమ్మబడింది.
- 2 రాజులు 7:17సుమారు క్రీ.పూ. 892
రాజు ఏ అధిపతి చేతి మీద ఆనుకున్నాడో, ఆ అధిపతిని ముఖ్య ద్వారపాలకునిగా నియమించాడు, ద్వారం దగ్గర ప్రజలు అతన్ని త్రొక్కగా అతడు చనిపోయాడు. రాజు తన ఇంటికి దగ్గరకు వచ్చినప్పుడు దైవజనుడు చెప్పినట్టే ఇది జరిగింది.
- 2 రాజులు 7:18సుమారు క్రీ.పూ. 892
దైవజనుడు రాజుతో, “రేపు ఇదే సమయానికి సమరయ పట్టణ ద్వారం దగ్గర ఒక షెకెల్ వెండికి మానిక సన్నని గోధుమ పిండి, ఒక షెకెల్ వెండికి రెండు మానికల యవలు అమ్ముతారు” అని చెప్పాడు.
- 2 రాజులు 7:19సుమారు క్రీ.పూ. 892
అంతకుముందు, ఆ అధిపతి దైవజనునితో, “చూడండి, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరిచినా కూడా, ఇది జరుగుతుందా?” అని అన్నాడు. దైవజనుడు జవాబిస్తూ, “నీవు నీ కళ్లారా చూస్తావు కాని దానిలో ఏమి తినవు” అన్నాడు.