కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 రాజులు 6:3సుమారు క్రీ.పూ. 893

    అప్పుడు వారిలో ఒకడు, “దయచేసి మీ దాసులైన మాతో కూడా రండి” అన్నాడు. ఎలీషా, “నేను వస్తాను” అన్నాడు.

  2. 2 రాజులు 6:4సుమారు క్రీ.పూ. 893

    కాబట్టి అతడు వారితో వెళ్లాడు. వారు యొర్దానుకు వెళ్లి చెట్లు నరకడం ప్రారంభించారు.

  3. 2 రాజులు 6:5సుమారు క్రీ.పూ. 893

    వారిలో ఒకడు చెట్టు నరుకుతుండగా గొడ్డలి ఊడి నీళ్లలో పడింది. అతడు, “అయ్యో, నా ప్రభువా! అది అద్దెకు తెచ్చుకున్నది!” అని కేక పెట్టాడు.

  4. 2 రాజులు 6:6సుమారు క్రీ.పూ. 893

    దైవజనుడు, “అది ఎక్కడ పడింది?” అని అడిగాడు. అది పడ్డ స్థలం అతడు చూపించగా ఎలీషా ఒక కర్రను నరికి అక్కడ విసరగా ఆ ఇనుప గొడ్డలి నీటిపై తేలింది.

  5. 2 రాజులు 6:7సుమారు క్రీ.పూ. 893

    అప్పుడతడు, “దాన్ని బయటకు తీయి” అన్నాడు. అతడు చేయి చాపి దాన్ని తీసుకున్నాడు.

  6. 2 రాజులు 6:8సుమారు క్రీ.పూ. 893

    అరాము రాజు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అతడు తన అధికారులతో చర్చించిన తర్వాత, “నేను ఫలాన స్థలాల్లో నా శిబిరాన్ని ఏర్పాటు చేస్తాను” అన్నాడు.

  7. 2 రాజులు 6:9సుమారు క్రీ.పూ. 893

    దైవజనుడు ఇశ్రాయేలు రాజుకు సందేశం పంపి, “ఫలాన స్థలానికి వెళ్లవద్దు, ఎందుకంటే అక్కడ అరామీయులు తమ బలగాలను ఉంచారు” అని తెలియజేశాడు.

  8. 2 రాజులు 6:10సుమారు క్రీ.పూ. 893

    కాబట్టి ఇశ్రాయేలు రాజు దైవజనుడు చెప్పిన స్థలానికి మనుషులను పంపి అది నిజమని తెలుసుకున్నాడు. ఎలీషా పదే పదే రాజును హెచ్చరించగా అతడు అలాంటి ప్రదేశాల్లో జాగ్రత్త వహించాడు.

  9. 2 రాజులు 6:11సుమారు క్రీ.పూ. 893

    ఇది అరాము రాజుకు కోపం కలిగించింది. అతడు తన అధికారులను పిలిపించి, “నాకు చెప్పండి! ఎవరు మనలో ఇశ్రాయేలు రాజు పక్షాన ఉన్నారు?” అని అడిగాడు.

  10. 2 రాజులు 6:12సుమారు క్రీ.పూ. 893

    “మాలో ఎవరు లేరు, నా ప్రభువా, కానీ ఇశ్రాయేలులో ఉన్న ఎలీషా ప్రవక్త మీరు మీ పడకగదిలో మాట్లాడే మాటలను ఇశ్రాయేలు రాజుకు చెప్తాడు” అని అతని అధికారులలో ఒకడు చెప్పాడు.

  11. 2 రాజులు 6:13సుమారు క్రీ.పూ. 893

    “వెళ్లండి, అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి. అప్పుడు అతన్ని పట్టుకోడానికి నేను మనుష్యులను పంపిస్తాను” అని రాజు ఆదేశించాడు. అతడు దోతానులో ఉన్నాడని వార్త వచ్చింది.

  12. 2 రాజులు 6:14సుమారు క్రీ.పూ. 893

    అప్పుడు అతడు గుర్రాలను, రథాలను, గొప్ప బలగాన్ని అక్కడికి పంపాడు. వారు రాత్రి వెళ్లి ఆ పట్టణాన్ని చుట్టుముట్టారు.

  13. 2 రాజులు 6:15సుమారు క్రీ.పూ. 893

    మరుసటిరోజు దైవజనుని సేవకుడు పెందలకడ లేచి బయటకు వెళ్లినప్పుడు, పట్టణం చుట్టూ గుర్రాలు, రథాలు కలిగిన సైన్యం ఉండడం చూశాడు. “అయ్యో, నా ప్రభువా! మనం ఏం చేద్దాం?” అని ఆ సేవకుడు అడిగాడు.

  14. 2 రాజులు 6:16సుమారు క్రీ.పూ. 893

    అందుకు ప్రవక్త, “భయపడకు, మనతో ఉన్నవారు వారికంటే ఎక్కువ మంది” అన్నాడు.

  15. 2 రాజులు 6:17సుమారు క్రీ.పూ. 893

    అప్పుడు ఎలీషా, “యెహోవా, ఇతడు చూచేటట్టు ఇతడి కళ్లు తెరవండి” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా ఆ సేవకుని కళ్లు తెరిపించగా ఎలీషా చుట్టూరా కొండ మీదంతా నిప్పులాంటి గుర్రాలు, రథాలు అతనికి కనిపించాయి.

  16. 2 రాజులు 6:18సుమారు క్రీ.పూ. 893

    శత్రువు అతనివైపు వస్తుండగా, ఎలీషా యెహోవాకు ప్రార్థన చేస్తూ, “ఈ ప్రజలకు గుడ్డితనం కలుగజేయండి” అని అన్నాడు. కాబట్టి యెహోవా ఎలీషా అడిగినట్టుగా వారికి గుడ్డితనం కలుగజేశారు.

  17. 2 రాజులు 6:19సుమారు క్రీ.పూ. 893

    ఎలీషా వారితో, “ఇది దారి కాదు, ఇది పట్టణం కాదు. నా వెంబడి రండి, మీరు వెదికే మనిషి దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్తాను” అని అన్నాడు. అతడు వారిని సమరయకు తీసుకెళ్లాడు.

  18. 2 రాజులు 6:20సుమారు క్రీ.పూ. 893

    వారు పట్టణంలో ప్రవేశించినప్పుడు, ఎలీషా, “యెహోవా, వీరు చూచేటట్టు వీరి కళ్లు తెరవండి” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా వారి కళ్లు తెరవగా తాము సమరయలో ఉన్నట్లు వారు గ్రహించారు.

  19. 2 రాజులు 6:21సుమారు క్రీ.పూ. 893

    ఇశ్రాయేలు రాజు వారిని చూసి, “వీరిని చంపనా, నా తండ్రి? వీరిని చంపనా?” అని ఎలీషాను అడిగాడు.

  20. 2 రాజులు 6:22సుమారు క్రీ.పూ. 893

    అందుకు అతడు, “నీవు వారిని చంపకూడదు, నీ ఖడ్గంతో, వింటితో బందీలుగా తెచ్చిన వారిని చంపుతావా? వారికి భోజనం పెట్టి వారు తిని త్రాగి తమ యజమాని దగ్గరికి వెళ్లేలా వారికి భోజనం పెట్టి, నీళ్ళు ఇవ్వు” అని చెప్పాడు.

  21. 2 రాజులు 6:23సుమారు క్రీ.పూ. 893

    కాబట్టి అతడు వారికి గొప్ప విందు చేసి వారు తిని త్రాగిన తర్వాత వారిని పంపించాడు. వారు తమ యజమాని దగ్గరకు తిరిగి వెళ్లారు. ఆ తర్వాత అరామీయుల దోపిడి మూకలు ఇశ్రాయేలు సరిహద్దులను ఆక్రమించడం మానుకొన్నాయి.

  22. 2 రాజులు 6:24సుమారు క్రీ.పూ. 893

    కొంతకాలం తర్వాత, అరాము రాజైన బెన్-హదదు తన సైన్యం అంతటిని పోగుచేసి, సమరయను ముట్టండించాడు.

  23. 2 రాజులు 6:25సుమారు క్రీ.పూ. 893

    సమరయలో తీవ్రమైన కరువు వచ్చింది; గాడిద తలను ఎనభై షెకెళ్ళ వెండికి, పావు కాబ్ గువ్వ రెట్టను అయిదు షెకెళ్ళ వెండికి అమ్మారు.

  24. 2 రాజులు 6:26సుమారు క్రీ.పూ. 893

    ఒక రోజు ఇశ్రాయేలు రాజు ప్రాకారం దగ్గర నడుస్తూ ఉంటే, ఒక స్త్రీ, “నా ప్రభువా, రాజా, నాకు సహాయం చేయండి!” అంటూ కేక పెట్టింది.

  25. 2 రాజులు 6:27సుమారు క్రీ.పూ. 893

    రాజు జవాబిస్తూ, “యెహోవా నీకు సహాయం చేయకపోతే, నేనెక్కడి నుండి సహాయం చేసేది? నూర్పిడి కళ్ళంలో నుంచా? లేదా ద్రాక్ష గానుగ నుంచా?” అన్నాడు.