కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 రాజులు 4:24సుమారు క్రీ.పూ. 894

    ఆమె గాడిద మీద జీను వేసుకుని పనివానితో, “త్వరగా నడిపించు; నేను చెప్పే వరకు నెమ్మదిగా వెళ్లకు” అని చెప్పింది.

  2. 2 రాజులు 4:25సుమారు క్రీ.పూ. 894

    కాబట్టి ఆమె బయలుదేరి కర్మెలు పర్వతం మీద ఉన్న దైవజనుని దగ్గరకు వచ్చింది. ఆమెను దూరం నుండి చూసి, ఆ దైవజనుడు తన సేవకుడైన గేహజీతో, “చూడు! అదిగో షూనేమీయురాలు!

  3. 2 రాజులు 4:26సుమారు క్రీ.పూ. 894

    ఆమెను కలుసుకోడానికి పరిగెత్తి వెళ్లి, ‘మీరు క్షేమమా? మీ భర్త క్షేమమా! మీ బాలుడు క్షేమమా?’ అని అడుగు” అన్నాడు. ఆమె, “అంతా క్షేమమే” అన్నది.

  4. 2 రాజులు 4:27సుమారు క్రీ.పూ. 894

    ఆమె పర్వతం మీద ఉన్న దైవజనుని చేరుకొని, అతని పాదాలు పట్టుకుంది. గేహజీ ఆమెను అవతలకు నెట్టాలని దగ్గరకు వచ్చాడు, కాని దైవజనుడు, “ఆమెను వదిలేయి! ఆమె వేదనతో ఉన్నది కాని యెహోవా ఈ విషయం నాకు చెప్పకుండా మరుగు చేశారు” అని అన్నాడు.

  5. 2 రాజులు 4:28సుమారు క్రీ.పూ. 894

    ఆమె, “నా ప్రభువా, మిమ్మల్ని కుమారుడు కావాలని అడిగానా? నాతో అబద్ధం చెప్పకండి అని నేను అనలేదా?” అని అన్నది.

  6. 2 రాజులు 4:29సుమారు క్రీ.పూ. 894

    ఎలీషా గేహజీతో, “నీ నడికట్టు బిగించుకుని, నా దండం చేతపట్టుకుని పరుగెత్తు. నీకు ఎవరైనా ఎదురైతే పలకరించవద్దు, ఎవరైనా పలకరిస్తే, జవాబివ్వకు. నా దండం బాలుని ముఖం మీద పెట్టు” అని చెప్పాడు.

  7. 2 రాజులు 4:30సుమారు క్రీ.పూ. 894

    అయితే ఆ బాలుని తల్లి, “సజీవుడైన యెహోవా మీద, మీమీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను మిమ్మల్ని విడిచిపెట్టను” అన్నది. కాబట్టి అతడు లేచి ఆమె వెంట వెళ్లాడు.

  8. 2 రాజులు 4:31సుమారు క్రీ.పూ. 894

    గేహజీ వారికంటే ముందే వెళ్లి బాలుని ముఖం మీద ఆ దండం ఉంచాడు, అయితే ఏ శబ్దం కాని స్పందన కాని లేదు. కాబట్టి గేహజీ ఎలీషాను కలుసుకోడానికి వెళ్లి అతనితో, “బాలుడు మేలుకోలేదు” అని చెప్పాడు.

  9. 2 రాజులు 4:32సుమారు క్రీ.పూ. 894

    ఎలీషా ఇంటికి వెళ్లి తన మంచం మీద చనిపోయి ఉన్న బాలుని చూశాడు.

  10. 2 రాజులు 4:33సుమారు క్రీ.పూ. 894

    అతడు గదిలోకి వెళ్లి వారిద్దరే లోపల ఉండగా తలుపు మూసి యెహోవాకు ప్రార్థన చేశాడు.

  11. 2 రాజులు 4:34సుమారు క్రీ.పూ. 894

    తర్వాత మంచం ఎక్కి, బాలుని నోటి మీద తన నోరు, కళ్ల మీద తన కళ్లు, చేతుల మీద చేతులు ఉంచి బాలుని మీద పడుకున్నాడు. అతడు వాడి మీద బోర్లా పడుకున్నప్పుడు బాలుని శరీరంలో వేడి పుట్టింది.

  12. 2 రాజులు 4:35సుమారు క్రీ.పూ. 894

    ఎలీషా మంచం దిగి గదిలో ఒకసారి అటూ ఇటూ నడిచి మరలా మంచం ఎక్కి బాలుని మీద బోర్లా పడుకున్నప్పుడు బాలుడు ఏడుసార్లు తుమ్మి కళ్లు తెరిచాడు.

  13. 2 రాజులు 4:36సుమారు క్రీ.పూ. 894

    ఎలీషా గేహజీని పిలిపించి, “షూనేమీయురాలిని పిలువు” అన్నాడు, అతడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చినప్పుడు అతడు, “నీ కుమారుని తీసుకో” అన్నాడు.

  14. 2 రాజులు 4:37సుమారు క్రీ.పూ. 894

    ఆమె లోపలికి వచ్చి, అతని కాళ్ల దగ్గర పడి నమస్కరించింది. తర్వాత ఆమె తన కుమారుని తీసుకుని బయటకు వెళ్లింది.

  15. 2 రాజులు 4:38సుమారు క్రీ.పూ. 894

    తర్వాత ఎలీషా గిల్గాలుకు తిరిగి వెళ్లాడు, అప్పుడు ఆ ప్రాంతంలో కరువు ఉంది. ప్రవక్తల బృందం ఎలీషాను కలుస్తున్నప్పుడు, అతడు తన సేవకునితో, “పెద్దకుండ పొయ్యిమీద పెట్టి ఈ ప్రవక్తలకు వంటకం చేయి” అన్నాడు.

  16. 2 రాజులు 4:39సుమారు క్రీ.పూ. 894

    వారిలో ఒకడు కూర ఆకుల కోసం పొలాలకు వెళ్లాడు, వెర్రి ద్రాక్ష అతనికి దొరికింది, దాని తీగెలు కోసి అతడు తన వస్త్రం నిండ నింపుకున్నాడు. అవి విషపూరితమైనవని అతనికి తెలియక వాటిని తరిగి కూర కుండలో వేశాడు.

  17. 2 రాజులు 4:40సుమారు క్రీ.పూ. 894

    ఆ కూరను తినడానికి అక్కడ వారికి వడ్డించారు. వారు దానిని రుచి చూసి, “దైవజనుడా! కుండలో విషం ఉంది!” అని కేకలు పెట్టారు. వారు దానిని తినలేకపోయారు.

  18. 2 రాజులు 4:41సుమారు క్రీ.పూ. 894

    ఎలీషా, “పిండి కొంచెం తీసుకురండి” అన్నాడు. అతడు పిండిని కుండలో వేసి, “ప్రజలు తినడానికి దానిని వారికి వడ్డించండి” అన్నాడు. అప్పుడు కుండలో హానికరమైనదేది లేదు.

  19. 2 రాజులు 4:42సుమారు క్రీ.పూ. 894

    ఒక రోజు ఓ వ్యక్తి బయల్-షాలిషా నుండి దైవజనుని దగ్గరకు వస్తూ, ఒక సంచిలో తన ప్రథమ పంటలో యవల పిండితో చేసిన ఇరవై రొట్టెలు, క్రొత్త ధాన్యం కంకులు కొన్ని తెచ్చాడు. అయితే ఎలీషా, “ప్రజలకు తినడానికి ఇవ్వు” అని చెప్పాడు.

  20. 2 రాజులు 4:43సుమారు క్రీ.పూ. 894

    అయితే అతని సేవకుడు, “దీన్ని వందమందికి ఎలా పెట్టగలను?” అని అడిగాడు. అందుకు ఎలీషా, “ ‘వారు తినగా ఇంకా మిగలుతుంది’ అని యెహోవా చెప్పారు కాబట్టి నీవైతే వారికి వడ్డించు” అని అన్నాడు.

  21. 2 రాజులు 4:44సుమారు క్రీ.పూ. 894

    అప్పుడు అతడు వారికి వడ్డించాడు, యెహోవా చెప్పిన మాట ప్రకారం అందరు తినగా కొంత మిగిలింది.

  22. 2 రాజులు 5:1సుమారు క్రీ.పూ. 894

    అరాము రాజు సైన్యాధిపతి నయమాను. అతడు తన యజమాని దృష్టిలో గొప్పవాడు, గౌరవనీయుడు, ఎందుకంటే యెహోవా అతని చేత అరామీయులకు విజయం ప్రసాదించారు. అతడు మహాశూరుడు, కానీ కుష్ఠురోగి.

  23. 2 రాజులు 5:2సుమారు క్రీ.పూ. 894

    అరామీయులు గుంపులు గుంపులుగా ఇశ్రాయేలు మీదికి దోపిడికి వెళ్లేవారు, ఒకసారి వారు ఒక చిన్నదాన్ని బందీగా తీసుకువచ్చారు, ఆమె నయమాను భార్యకు పరిచారం చేసేది.

  24. 2 రాజులు 5:3సుమారు క్రీ.పూ. 894

    ఆమె తన యజమానురాలితో, “నా యజమాని సమరయలో ఉన్న ప్రవక్తను కలిస్తే బాగుండేది! ఆయన అతని కుష్ఠురోగాన్ని పూర్తిగా నయం చేస్తాడు” అని చెప్పింది.

  25. 2 రాజులు 5:4సుమారు క్రీ.పూ. 894

    నయమాను తన యజమాని దగ్గరకు వెళ్లి, ఆ ఇశ్రాయేలు అమ్మాయి చెప్పిన మాటలు అతనికి చెప్పాడు.