కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 రాజులు 3:26సుమారు క్రీ.పూ. 895

    మోయాబు రాజు యుద్ధం తన చేజారిపోతుందని గ్రహించి, ఖడ్గం దూసే ఏడు వందల మందిని వెంటబెట్టుకొని ఎదోము రాజు దగ్గరకు చేధించుకొని వెళ్లాలని చూశాడు కాని అది సాధ్యం కాలేదు.

  2. 2 రాజులు 3:27సుమారు క్రీ.పూ. 895

    అప్పుడు అతడు తన తర్వాత రాజు కావలసిన తన పెద్ద కుమారుని తీసుకెళ్లి పట్టణ ప్రాకారం మీద బలిగా అర్పించాడు. ఇశ్రాయేలువారి మీద తీవ్రమైన కోపం కలిగింది; వారు అతన్ని విడిచిపెట్టి తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు.

  3. 2 రాజులు 4:1సుమారు క్రీ.పూ. 894

    ఒక రోజు ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి, “మీ సేవకుడైన నా భర్త చనిపోయాడు, అతడు యెహోవా పట్ల భక్తి కలవాడని మీకు తెలుసు. అయితే ఇప్పుడు అతనికి అప్పిచ్చినవాడు నా ఇద్దరు కుమారులను బానిసలుగా తీసుకెళ్లడానికి వస్తున్నాడు” అని మొరపెట్టింది.

  4. 2 రాజులు 4:2సుమారు క్రీ.పూ. 894

    ఎలీషా, “నేను నీకెలా సహాయం చేయాలి? నీ ఇంట్లో ఏముందో చెప్పు” అన్నాడు. “నీ సేవకురాలి దగ్గర ఒక చిన్న పాత్రలో కొంచెం ఒలీవనూనె తప్ప ఇంకేమి లేదు” అని ఆమె చెప్పింది.

  5. 2 రాజులు 4:3సుమారు క్రీ.పూ. 894

    అప్పుడు ఎలీషా, “నీవు వెళ్లి, నీ పొరుగు వారందరి దగ్గర ఖాళీ పాత్రలను అడుగు. ఎన్ని దొరికితే అన్ని తెచ్చుకో.

  6. 2 రాజులు 4:4సుమారు క్రీ.పూ. 894

    అప్పుడు నీవు, నీ కుమారులు ఇంట్లోకి వెళ్లి తలుపు మూసి ఆ పాత్రలన్నిట్లో నూనె పోసి నిండినవాటిని ప్రక్కన పెట్టండి” అని చెప్పాడు.

  7. 2 రాజులు 4:5సుమారు క్రీ.పూ. 894

    ఆమె అతని దగ్గర నుండి వెళ్లి, తన కుమారులతో లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది. వారు ఆమె దగ్గరకు తెచ్చిన పాత్రలన్నిట్లో ఆమె నూనె పోస్తూ ఉంది.

  8. 2 రాజులు 4:6సుమారు క్రీ.పూ. 894

    పాత్రలన్నీ నిండినప్పుడు ఆమె తన కుమారునితో, “ఇంకొకటి తీసుకురా” అన్నది. అతడు, “ఇంకొక పాత్ర లేదు” అని జవాబిచ్చాడు. అప్పుడు నూనె ప్రవాహం ఆగిపోయింది.

  9. 2 రాజులు 4:7సుమారు క్రీ.పూ. 894

    ఆమె వెళ్లి దైవజనునికి చెప్పగా అతడు, “వెళ్లు, ఆ నూనె అమ్మి, నీ అప్పు తీర్చుకో. మిగిలిన దానితో నీవు, నీ కుమారులు జీవనం కొనసాగించండి” అన్నాడు.

  10. 2 రాజులు 4:8సుమారు క్రీ.పూ. 894

    ఒక రోజు ఎలీషా షూనేముకు వెళ్లాడు. అక్కడ ఒక ధనికురాలు ఉండేది, ఆమె భోజనానికి రావాలని అతన్ని ప్రాధేయపడింది. కాబట్టి అతడు ఆ దారిన వెళ్లేటప్పుడు అక్కడ భోజనం చేయడానికి ఆగేవాడు.

  11. 2 రాజులు 4:9సుమారు క్రీ.పూ. 894

    ఆమె తన భర్తతో, “మన దారిలో వస్తూ వెళ్తూ ఉండే ఈ మనిషి పరిశుద్ధుడైన దైవజనుడని నాకు తెలుసు.

  12. 2 రాజులు 4:10సుమారు క్రీ.పూ. 894

    మనం పైకప్పు మీద చిన్న గది కట్టి అందులో పడక, బల్ల, కుర్చీ, దీపం ఉంచుదాము. మన దగ్గరకు అతడు వచ్చినప్పుడెల్లా, అతడు ఆ గదిలో ఉండవచ్చు” అని చెప్పింది.

  13. 2 రాజులు 4:11సుమారు క్రీ.పూ. 894

    ఒక రోజు ఎలీషా అక్కడికి వచ్చి ఆ మేడ గదిలో పడుకున్నాడు.

  14. 2 రాజులు 4:12సుమారు క్రీ.పూ. 894

    తర్వాత అతడు తన సేవకుడైన గేహజీతో, “షూనేమీయురాలిని పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలువగానే ఆమె వచ్చి అతని ముందు నిలబడింది.

  15. 2 రాజులు 4:13సుమారు క్రీ.పూ. 894

    ఎలీషా అతనితో, “ఆమెతో చెప్పు, ‘మాకోసం ఈ శ్రమంతా తీసుకున్నారు, ఇప్పుడు మీ కోసం ఏం చెయ్యాలో చెప్పండి. మేము మీ తరపున రాజుతో గాని సైన్యాధిపతితో గాని మాట్లాడాలా?’ ” అని అన్నాడు. అందుకామె, “నేను నా స్వజనుల మధ్య నివసిస్తున్నాను” అన్నది.

  16. 2 రాజులు 4:14సుమారు క్రీ.పూ. 894

    ఎలీషా, “మరి ఆమె కోసం ఏం చేస్తే బాగుంటుంది?” అని అడిగాడు. గేహజీ, “ఆమెకు కుమారుడు లేడు, ఆమె భర్త వృద్ధుడు” అని జవాబిచ్చాడు.

  17. 2 రాజులు 4:15సుమారు క్రీ.పూ. 894

    అప్పుడు ఎలీషా, “ఆమెను పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలువగా ఆమె వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది.

  18. 2 రాజులు 4:16సుమారు క్రీ.పూ. 894

    అప్పుడు ఎలీషా, “వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు” అని చెప్పాడు. అందుకామె, “వద్దు, నా ప్రభువా! దయచేసి, దైవజనుడా, మీ సేవకురాలితో అబద్ధం చెప్పకండి!” అని అన్నది.

  19. 2 రాజులు 4:17సుమారు క్రీ.పూ. 894

    తర్వాత ఆమె గర్భవతియై మరుసటి సంవత్సరం ఎలీషా చెప్పినట్లే కుమారుని కన్నది.

  20. 2 రాజులు 4:18సుమారు క్రీ.పూ. 894

    ఆ బాలుడు పెరిగిన తర్వాత ఒక రోజు కోత కోసేవారి దగ్గర ఉన్న తన తండ్రి దగ్గరకు వెళ్లాడు.

  21. 2 రాజులు 4:19సుమారు క్రీ.పూ. 894

    అకస్మాత్తుగా అతడు తన తండ్రితో, “నా తల! నా తల!” అన్నాడు. అతని తండ్రి తన సేవకులలో ఒకనితో, “బాలున్ని అతని తల్లి దగ్గరకు తీసుకెళ్లు” అని చెప్పాడు.

  22. 2 రాజులు 4:20సుమారు క్రీ.పూ. 894

    సేవకుడు బాలున్ని ఎత్తుకుని అతని తల్లి దగ్గరకు తీసుకెళ్లాడు, బాలుడు ఆమె ఒడిలో మధ్యాహ్నం వరకు కూర్చుని ఆ తర్వాత చనిపోయాడు.

  23. 2 రాజులు 4:21సుమారు క్రీ.పూ. 894

    ఆమె బాలున్ని తీసుకెళ్లి దైవజనుడైన ఎలీషా మంచం మీద పడుకోబెట్టి తలుపు మూసి బయటకు వెళ్లింది.

  24. 2 రాజులు 4:22సుమారు క్రీ.పూ. 894

    ఆమె తన భర్తను పిలిచి, “దయచేసి నా కోసం ఒక పనివాన్ని ఒక గాడిదను పంపించండి, నేను తొందరగా దైవజనుని దగ్గరకు వెళ్లి రావాలి” అని అన్నది.

  25. 2 రాజులు 4:23సుమారు క్రీ.పూ. 894

    అందుకతడు, “అతని దగ్గరకు ఈ రోజు ఎందుకు వెళ్తావు? ఇది అమావాస్య కాదు సబ్బాతు దినం కాదు కదా” అన్నాడు. అందుకామె, “అంతా సమాధానంగానే ఉంటుంది” అన్నది.