కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 రాజులు 8:25సుమారు క్రీ.పూ. 885

    ఇశ్రాయేలు రాజు, అహాబు కుమారుడైన యోరాము పరిపాలనలోని పన్నెండవ సంవత్సరంలో యూదారాజు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజయ్యాడు.

  2. 2 రాజులు 8:26సుమారు క్రీ.పూ. 885

    అహజ్యా రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఒక సంవత్సరం పరిపాలించాడు. అతని తల్లి పేరు అతల్యా, ఆమె ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ మనుమరాలు.

  3. 2 రాజులు 8:27సుమారు క్రీ.పూ. 885

    అహజ్యా అహాబు ఇంటి అల్లుడు కాబట్టి అతడు అహాబు ఇంటివారి మార్గాలను అనుసరించి అహాబు కుటుంబంలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.

  4. 2 రాజులు 8:28సుమారు క్రీ.పూ. 884

    అహజ్యా అహాబు కుమారుడైన యోరాముతో కలిసి, అరాము రాజైన హజాయేలు మీద యుద్ధం చేయడానికి రామోత్ గిలాదుకు వెళ్లగా అరామీయులు యోరామును గాయపరిచారు.

  5. 2 రాజులు 8:29సుమారు క్రీ.పూ. 884

    కాబట్టి రాజైన యోరాము రామోతు దగ్గర అరాము రాజైన హజాయేలుతో చేసిన యుద్ధంలో అరామీయులు తనకు చేసిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అప్పుడు యెహోరాము కుమారుడు యూదా రాజైన అహజ్యా గాయపడి ఉన్న అహాబు కుమారుడైన యోరామును చూడడానికి యెజ్రెయేలుకు వెళ్లాడు.

  6. 2 రాజులు 9:1సుమారు క్రీ.పూ. 884

    ఎలీషా ప్రవక్త ప్రవక్తల బృందంలో ఒకరిని పిలిచి ఇలా అన్నాడు, “నీ నడికట్టు బిగించుకుని, సీసాలో ఒలీవనూనె పట్టుకుని రామోత్ గిలాదుకు వెళ్లు.

  7. 2 రాజులు 9:2సుమారు క్రీ.పూ. 884

    అక్కడికి వెళ్లి నిమ్షీ మనుమడు, యెహోషాపాతు కుమారుడైన యెహు కోసం వెదుకు. అతని దగ్గరకు వెళ్లి తన స్నేహితుల మధ్య నుండి పిలిచి అతన్ని లోపలి గదిలోకి తీసుకెళ్లు.

  8. 2 రాజులు 9:3సుమారు క్రీ.పూ. 884

    అప్పుడు ఈ నూనె సీసా తీసుకుని నూనె అతని తలమీద పోసి, ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలపై రాజుగా అభిషేకించాను’ అని చెప్పి వెంటనే ఆలస్యం చేయకుండ తలుపు తెరిచి పారిపో!”

  9. 2 రాజులు 9:4సుమారు క్రీ.పూ. 884

    కాబట్టి ఆ యువ ప్రవక్త రామోత్ గిలాదుకు వెళ్లాడు.

  10. 2 రాజులు 9:5సుమారు క్రీ.పూ. 884

    అతడు చేరినప్పుడు, సైన్య అధికారులు ఒకచోట కూర్చుని ఉన్నారు. అతడు, “మీతో ఒక మాట చెప్పాలి” అని సైన్యాధిపతితో అన్నాడు. అందుకు యెహు, “మాలో ఎవరికి?” అని అడిగాడు. అందుకతడు, “అధిపతీ మీకే” అని జవాబిచ్చాడు.

  11. 2 రాజులు 9:6సుమారు క్రీ.పూ. 884

    యెహు లేచి ఇంట్లోకి వెళ్లాడు. అప్పుడు, ఆ ప్రవక్త అతని తలమీద నూనె పోసి అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: ‘నేను ఇశ్రాయేలు ప్రజలు మీద నిన్ను రాజుగా అభిషేకించాను.

  12. 2 రాజులు 9:7సుమారు క్రీ.పూ. 884

    నీవు నీ యజమాని అహాబు వంశీకులను హతం చేయాలి, యెజెబెలు ద్వారా నా సేవకులైన ప్రవక్తలు, యెహోవా సేవకులందరి రక్తం చిందింపబడింది కాబట్టి నేను ప్రతీకారం తీసుకుంటాను.

  13. 2 రాజులు 9:8సుమారు క్రీ.పూ. 884

    అహాబు వంశం పూర్తిగా నశిస్తుంది. ఇశ్రాయేలులో అహాబుకు చెందిన ప్రతి చివరి మగవారిని వారు బానిసలైనా పౌరులైనా నిర్మూలం చేస్తాను.

  14. 2 రాజులు 9:9సుమారు క్రీ.పూ. 884

    నేను నెబాతు కుమారుడైన యరొబాము వంశాన్ని, అహీయా కుమారుడైన బయెషా వంశాన్ని చేసినట్టే, అహాబు వంశాన్ని చేస్తాను.

  15. 2 రాజులు 9:10సుమారు క్రీ.పూ. 884

    యెజెబెలును యెజ్రెయేలు ప్రాంతంలో కుక్కలు తింటాయి, ఎవరూ ఆమెను సమాధి చేయరు.’ ” తర్వాత అతడు తలుపు తెరిచి పరుగెత్తాడు.

  16. 2 రాజులు 9:11సుమారు క్రీ.పూ. 884

    యెహు తన తోటి అధికారుల దగ్గరకు వెళ్లినప్పుడు, వారిలో ఒకరు, “అంతా క్షేమమేనా? ఆ వెర్రివాడు నీ దగ్గరకు ఎందుకు వచ్చాడు?” అని అడిగాడు. అందుకు యెహు అన్నాడు, “అతడు, అతని మాటలు మీకు తెలుసు కదా.”

  17. 2 రాజులు 9:12సుమారు క్రీ.పూ. 884

    వారు అన్నారు, “అది నిజం కాదు, అసలేం జరిగిందో మాకు చెప్పు.” యెహు అన్నాడు, “అతడు నాతో ఇలా అన్నాడు: ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా అభిషేకించాను.’ ”

  18. 2 రాజులు 9:13సుమారు క్రీ.పూ. 884

    వెంటనే వారు తమ వస్త్రాలను తీసి యెహు కాళ్లక్రింద పరిచారు. తర్వాత వారు బూర ఊది, “యెహు రాజయ్యాడు” అని కేకలు వేశారు.

  19. 2 రాజులు 9:14సుమారు క్రీ.పూ. 884

    నిమ్షీ మనుమడు, యెహోషాపాతు కుమారుడైన యెహు యోరాము మీద కుట్ర చేశాడు. (ఆ సమయంలో యోరాము, ఇశ్రాయేలీయులంతా అరాము రాజైన హజాయేలు నుండి రామోత్ గిలాదును కాపలా కాస్తూ ఉన్నారు,

  20. 2 రాజులు 9:15సుమారు క్రీ.పూ. 884

    కాని, రాజైన యెహోరాము అరాము రాజైన హజాయేలుతో యుద్ధంలో అరామీయుల వల్ల తగిలిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలు పట్టణానికి తిరిగి వెళ్లాడు.) అప్పుడు యెహు, “మీరు నన్ను రాజుగా చేయాలనుకుంటే, ఈ విషయాన్ని యెజ్రెయేలుకు వెళ్లి చెప్పడానికి ఇక్కడినుండి ఎవరూ తప్పించుకుని వెళ్లకుండా చూడండి” అన్నాడు.

  21. 2 రాజులు 9:16సుమారు క్రీ.పూ. 884

    అప్పుడు యెహు తన రథం ఎక్కి యెజ్రెయేలుకు వెళ్లాడు, ఎందుకంటే అక్కడ యోరాము విశ్రాంతి తీసుకుంటున్నాడు, యూదా రాజైన అహజ్యా అతన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్లాడు.

  22. 2 రాజులు 9:17సుమారు క్రీ.పూ. 884

    యెజ్రెయేలు గోపురం మీద నిలుచున్న కావలివాడు యెహు, అతని సైనికుల గుంపు రావడం చూసి, “నాకు సైనికులు కొంతమంది వస్తున్నట్లు కనిపిస్తుంది” అని బిగ్గరగా అరిచాడు. అందుకు యెహోరాము, “ఒక రౌతును పిలిపించి, వారిని కలవడానికి పంపించు, అతడు వారితో, ‘సమాధానంగా వస్తున్నారా?’ అని అడుగు” అని ఆదేశించాడు.

  23. 2 రాజులు 9:18సుమారు క్రీ.పూ. 884

    ఆ గుర్రాన్ని స్వారీ చేసేవాడు యెహుకు ఎదురుగా వెళ్లి, “రాజు ఇలా అడుగుతున్నారు: ‘మీరు సమాధానంతో వస్తున్నారా?’ ” “సమాధానంతో నీకేం పని?” అని యెహు జవాబిచ్చాడు. “నా వెనుకకు వచ్చి నన్ను వెంబడించు.” కావలివాడు, “ఆ దూత వారిని చేరుకున్నాడు, కాని అతడు తిరిగి రావడం లేదు” అని చెప్పాడు.

  24. 2 రాజులు 9:19సుమారు క్రీ.పూ. 884

    కాబట్టి రాజు ఇంకొక గుర్రపురౌతును పంపించాడు. అతడు వారి దగ్గరకు వెళ్లి, “రాజు ఇలా అడుగుతున్నాడు: ‘మీరు సమాధానంతో వస్తున్నారా?’ ” అని అన్నాడు. అందుకు యెహు, “సమాధానంతో నీకేం పని? నా వెనుకకు వచ్చి నన్ను వెంబడించు” అన్నాడు.

  25. 2 రాజులు 9:20సుమారు క్రీ.పూ. 884

    కావలివాడు, “అతడు వారిని చేరుకున్నాడు, కాని అతడు కూడా తిరిగి రావడం లేదు. ఆ రథాలు నడవడం నిమ్షీ మనుమడు యెహు నడిచినట్లు ఉంది, వెర్రిపట్టినవానిలా తోలుతున్నాడు” అని తెలియజేశాడు.