- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- లేవీయకాండము 25:29సుమారు క్రీ.పూ. 1491
“ ‘ప్రాకారాలు గల పట్టణంలో ఎవరైనా ఇంటిని అమ్మితే, దాని అమ్మకం తర్వాత పూర్తి సంవత్సరం విముక్తి హక్కును కలిగి ఉంటారు. ఆ సమయంలో అమ్మేవారు దానిని విడిపించవచ్చు.
- లేవీయకాండము 25:30సుమారు క్రీ.పూ. 1491
ఒకవేళ సంవత్సరం పూర్తిగా గడిచే లోపు దానిని విడిపించకపోతే, ప్రాకారం కలిగిన పట్టణంలోని ఇల్లు శాశ్వతంగా కొనుగోలుదారునికి, అతని వారసులకు చెందుతుంది. ఇది యాభైయవ వార్షికోత్సవంలో తిరిగి ఇవ్వబడదు.
- లేవీయకాండము 25:31సుమారు క్రీ.పూ. 1491
కానీ వారి చుట్టూ ఉన్న ప్రాకారాలు లేని గ్రామాల్లోని ఇల్లు బహిరంగ దేశానికి చెందినవిగా పరిగణించాలి. అవి విడిపించబడవచ్చు, అవి యాభైయవ వార్షికోత్సవంలో తిరిగి ఇవ్వబడాలి.
- లేవీయకాండము 25:32సుమారు క్రీ.పూ. 1491
“ ‘లేవీయులకు శాశ్వతంగా తమ దగ్గర ఉన్న లేవీయ పట్టణాల్లో తమ ఇళ్ళను విడిపించుకునే హక్కు ఉంటుంది.
- లేవీయకాండము 25:33సుమారు క్రీ.పూ. 1491
కాబట్టి లేవీయుల ఆస్తి విడిపించదగినది అంటే, వారి ఇల్లు ఏ పట్టణంలో అమ్మబడినా యాభైయవ వార్షికోత్సవంలో, తిరిగి ఇవ్వబడాలి, ఎందుకంటే లేవీయుల పట్టణాలలోని ఇల్లు ఇశ్రాయేలీయుల మధ్యలో వారి ఆస్తి.
- లేవీయకాండము 25:34సుమారు క్రీ.పూ. 1491
కానీ వారి పట్టణాలకు చెందిన పచ్చికబయళ్లు అమ్మకూడదు; అది వారి శాశ్వత స్వాస్థ్యము.
- లేవీయకాండము 25:35సుమారు క్రీ.పూ. 1491
“ ‘మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదలుగా మారి, మీలో తమను తాము ఆదరించుకోలేకపోతే, మీరు ఒక విదేశీయునికి, అపరిచితునికి చేసినట్టుగానే వారికి సహాయం చేయండి, కాబట్టి వారు మీ మధ్య జీవించడం కొనసాగించవచ్చు.
- లేవీయకాండము 25:36సుమారు క్రీ.పూ. 1491
వారి నుండి వడ్డీ లేదా లాభం తీసుకోకండి, అయితే మీ దేవునికి భయపడండి, తద్వారా వారు మీ మధ్యనే జీవించడం కొనసాగించవచ్చు.
- లేవీయకాండము 25:37సుమారు క్రీ.పూ. 1491
మీరు వారికి వడ్డీకి డబ్బు ఇవ్వకూడదు లేదా లాభం కోసం ఆహారాన్ని అమ్మకూడదు.
- లేవీయకాండము 25:38సుమారు క్రీ.పూ. 1491
మీకు కనాను దేశాన్ని ఇచ్చి, నేను మీకు దేవుడనై ఉండాలని మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన మీ దేవుడనైన యెహోవాను నేనే.
- లేవీయకాండము 25:39సుమారు క్రీ.పూ. 1491
“ ‘మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదలుగా మారి తమను తాము మీకు అమ్ముకున్నట్లయితే, వారితో బానిసలుగా పని చేయించవద్దు.
- లేవీయకాండము 25:40సుమారు క్రీ.పూ. 1491
వారిని మీ మధ్య జీతగాలుగా లేదా తాత్కాలిక నివాసితులుగా పరిగణించాలి; యాభైయవ వార్షికోత్సవం వరకు, వారు మీ కోసం పని చేస్తారు.
- లేవీయకాండము 25:41సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు వారు, వారి పిల్లలు విడవబడాలి, వారు తమ కుటుంబాల దగ్గరకు, వారి పూర్వికుల స్వాస్థ్యానికి వెళ్తారు.
- లేవీయకాండము 25:42సుమారు క్రీ.పూ. 1491
ఎందుకంటే ఇశ్రాయేలీయులు నా సేవకులు, నేనే ఈజిప్టు నుండి వారిని బయటకు తీసుకువచ్చాను, బానిసలుగా వారు అమ్మబడకూడదు.
- లేవీయకాండము 25:43సుమారు క్రీ.పూ. 1491
వారిని కఠినంగా పాలించవద్దు, మీ దేవునికి భయపడాలి.
- లేవీయకాండము 25:44సుమారు క్రీ.పూ. 1491
“ ‘మీ చుట్టూ ఉన్న జనాంగాలలో నుండి దాసులు, దాసీలు రావాలి; వారి నుండి బానిసలను కొనవచ్చు.
- లేవీయకాండము 25:45సుమారు క్రీ.పూ. 1491
మీ మధ్యనున్న తాత్కాలిక నివాసులు, మీ దేశంలో పుట్టిన వారి కుటుంబాల సభ్యులను మీరు కొనవచ్చు. వారు మీ సొత్తవుతారు.
- లేవీయకాండము 25:46సుమారు క్రీ.పూ. 1491
మీరు వారిని మీ పిల్లలకు వారసత్వపు ఆస్తిగా ఇవ్వవచ్చు, వారిని జీవితకాల బానిసలుగా చేయవచ్చు, కానీ మీరు మీ తోటి ఇశ్రాయేలీయులను కఠినంగా పాలించకూడదు.
- లేవీయకాండము 25:47సుమారు క్రీ.పూ. 1491
“ ‘మీ మధ్య నివాసమున్న పరదేశి ధనవంతుడైతే, అతని దగ్గర ఉన్న మీ స్వదేశీయుడు బీదవాడై ధనవంతుని లేదా అతని కుటుంబ సభ్యునికి అమ్ముడు పోతే,
- లేవీయకాండము 25:48సుమారు క్రీ.పూ. 1491
వారు తమను తాము అమ్మిన తర్వాత విడుదల హక్కును కలిగి ఉంటారు. వారి బంధువుల్లో ఒకరు వారిని విడిపించవచ్చు:
- లేవీయకాండము 25:49సుమారు క్రీ.పూ. 1491
మామ లేదా ఒక బంధువు లేదా వారి కుటుంబంలోని రక్తసంబంధి ఎవరైనా వారిని విడిపించవచ్చు. లేదా వారు అభివృద్ధి చెందితే, వారు తమను తాము విడిపించుకోవచ్చు.
- లేవీయకాండము 25:50సుమారు క్రీ.పూ. 1491
వారు, వారిని కొనుక్కున్న వ్యక్తి కలిసి అమ్ముడు పోయిన సంవత్సరం నుండి యాభైయవ వార్షికోత్సవం వరకు మిగతా కాలమెంతో లెక్కించాలి. వారి విడుదల యొక్క వెల ఆ సంవత్సరాల లెక్కను బట్టి, జీతగాని వెల ప్రకారం ఉంటుంది.
- లేవీయకాండము 25:51సుమారు క్రీ.పూ. 1491
ఇంకా చాలా సంవత్సరాలు మిగిలి ఉంటే, వాటి ప్రకారం తమను అమ్ముకున్న వెలలో ఎక్కువ వంతు తమ విడుదలకు మళ్ళీ చెల్లించాల్సి ఉంటుంది.
- లేవీయకాండము 25:52సుమారు క్రీ.పూ. 1491
యాభైయవ వార్షికోత్సవం వరకు మిగతా సంవత్సరాలు కొన్ని మాత్రమే ఉంటే తమ లెక్క చూసుకొని వారి విడుదల వెల చెల్లించాలి.
- లేవీయకాండము 25:53సుమారు క్రీ.పూ. 1491
వారిని జీతగాల్లలా ప్రతి సంవత్సరం పరిగణించాలి; వారు ఎవరికైతే సేవ చేస్తారో వారు, కఠినంగా వ్యవహరించకుండా మీరు చూసుకోవాలి.