- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- లేవీయకాండము 25:54సుమారు క్రీ.పూ. 1491
“ ‘ఒకవేళ ఈ విధానాల్లో ఎవరైనా విడిపించబడకపోయినా, వారు, వారి పిల్లలు యాభైయవ వార్షికోత్సవంలో విడిపించబడాలి,
- లేవీయకాండము 25:55సుమారు క్రీ.పూ. 1491
ఎందుకంటే ఇశ్రాయేలీయులు నా దాసులుగా ఉన్నారు, నేను ఈజిప్టు దేశం నుండి వారిని తీసుకువచ్చిన నా దాసులు. నేను మీ దేవుడనైన యెహోవాను.
- లేవీయకాండము 26:1సుమారు క్రీ.పూ. 1491
“ ‘మీ కోసం విగ్రహాలను తయారుచేసుకోవద్దు లేదా ఒక బొమ్మను గాని పవిత్రమైన రాయిని గాని నిలుపకూడదు, దాని ముందు తలవంచడానికి చెక్కిన రాయిని మీ భూమిలో పెట్టకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.
- లేవీయకాండము 26:2సుమారు క్రీ.పూ. 1491
“ ‘మీరు నా సబ్బాతులను ఆచరించాలి, నా పరిశుద్ధాలయాన్ని గౌరవించండి. నేను యెహోవాను.
- లేవీయకాండము 26:3సుమారు క్రీ.పూ. 1491
“ ‘ఒకవేళ మీరు నా శాసనాలు పాటిస్తూ, నా ఆజ్ఞలకు లోబడడానికి జాగ్రత్త వహిస్తే,
- లేవీయకాండము 26:4సుమారు క్రీ.పూ. 1491
వాన కాలంలో వాన పంపుతాను, భూమి తన పంటను, చెట్లు వాటి ఫలాలను ఇస్తాయి.
- లేవీయకాండము 26:5సుమారు క్రీ.పూ. 1491
ద్రాక్ష కోత వరకు మీ నూర్పిడి కాలం కొనసాగుతుంది, నాటడం వరకు ద్రాక్ష కోత కొనసాగుతుంది, మీరు కోరుకునే ఆహారాన్ని మీరు తిని, మీ దేశంలో క్షేమంగా జీవిస్తారు.
- లేవీయకాండము 26:6సుమారు క్రీ.పూ. 1491
“ ‘నేను దేశంలో సమాధానాన్ని అనుగ్రహిస్తాను, మీరు పడుకుంటారు, ఎవరూ మిమ్మల్ని భయపెట్టరు. నేను దేశం నుండి అడవి జంతువులను తొలగిస్తాను, ఖడ్గం మీ దేశం గుండా వెళ్లదు.
- లేవీయకాండము 26:7సుమారు క్రీ.పూ. 1491
శత్రువులను మీరు వెంటాడుతారు. వారు మీ ఎదుట ఖడ్గం ద్వార కూలుతారు.
- లేవీయకాండము 26:8సుమారు క్రీ.పూ. 1491
మీలో అయిదుగురు వందమందిని, వందమంది పదివేలమందిని తరుముతారు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం ద్వార కూలుతారు.
- లేవీయకాండము 26:9సుమారు క్రీ.పూ. 1491
“ ‘నేను మిమ్మల్ని దయతో చూస్తాను, మిమ్మల్ని ఫలవంతం చేస్తాను, మీ సంఖ్యను పెంచుతాను, నేను మీతో నా నిబంధనను ఉంచుతాను.
- లేవీయకాండము 26:10సుమారు క్రీ.పూ. 1491
క్రొత్త దానికి స్థలం ఇవ్వడానికి పాత పంటను ఖాళీ చేయునట్లు మీరు ఇంకా గత సంవత్సర పంటను తింటారు.
- లేవీయకాండము 26:11సుమారు క్రీ.పూ. 1491
మీ మధ్యనే నా నివాసస్థలం ఉంచుతాను. మిమ్మల్ని త్రోసివేయను.
- లేవీయకాండము 26:12సుమారు క్రీ.పూ. 1491
నేను మీ మధ్య నడుస్తూ మీ దేవునిగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు.
- లేవీయకాండము 26:13సుమారు క్రీ.పూ. 1491
ఈజిప్టువారికి ఇక మీరు బానిసలుగా ఉండకూడదని మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన మీ దేవుడనైన యెహోవాను నేనే; నేను మీ బానిసత్వ కాడి యొక్క పట్టీలను విరగ్గొట్టాను, మిమ్మల్ని తలలు పైకెత్తి నడిచేలా చేశాను.
- లేవీయకాండము 26:14సుమారు క్రీ.పూ. 1491
“ ‘కానీ మీరు నా మాట వినకపోతే, ఈ ఆజ్ఞలన్నిటిని పాటించకపోతే,
- లేవీయకాండము 26:15సుమారు క్రీ.పూ. 1491
మీరు నా శాసనాలను తిరస్కరించి, నా చట్టాలను అసహ్యించుకుని నా ఆజ్ఞలన్నిటిని పాటించడంలో విఫలమై, నా నిబంధనను ఉల్లంఘిస్తే,
- లేవీయకాండము 26:16సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు నేను మీకు ఇలా చేస్తాను: మీ దృష్టిని నాశనం చేసే, మీ బలాన్ని తగ్గించే ఆకస్మిక భీభత్సం, చెడు వ్యాధులు జ్వరాలు తెస్తాను. మీరు వృధాగా విత్తనాన్ని చల్లుతారు, ఎందుకంటే మీ శత్రువులు దానిని తింటారు.
- లేవీయకాండము 26:17సుమారు క్రీ.పూ. 1491
నేను మీకు విరోధంగా నా ముఖం పెడతాను, తద్వార మీ శత్రువులతో ఓడిపోతారు; మిమ్మల్ని ద్వేషించేవారే మిమ్మల్ని పరిపాలిస్తారు, ఎవరూ తరమకుండానే మీరు పారిపోతారు.
- లేవీయకాండము 26:18సుమారు క్రీ.పూ. 1491
“ ‘ఇదంతటి తర్వాత మీరు నా మాట వినకపోతే, నేను మీ పాపాల కోసం మిమ్మల్ని ఏడు రెట్లు ఎక్కువగా శిక్షిస్తాను.
- లేవీయకాండము 26:19సుమారు క్రీ.పూ. 1491
నేను మీ మొండి అహంకారాన్ని విచ్ఛిన్నం చేసి, మీ పైన ఉన్న ఆకాశాన్ని ఇనుములా, మీ క్రింద ఉన్న భూమిని ఇత్తడిలా చేస్తాను.
- లేవీయకాండము 26:20సుమారు క్రీ.పూ. 1491
మీ బలము వ్యర్థమైపోతుంది ఎందుకంటే మీ నేల తన పంటలను ఇవ్వదు, పండదు. మీ భూమిలో ఉన్న చెట్లు ఫలం ఇవ్వవు.
- లేవీయకాండము 26:21సుమారు క్రీ.పూ. 1491
“ ‘మీరు నా పట్ల శత్రుత్వం కలిగి ఉంటే, నా మాట వినడానికి నిరాకరిస్తే, మీ పాపాలకు తగినంతగా నేను మీ బాధలను ఏడు రెట్లు పెంచుతాను.
- లేవీయకాండము 26:22సుమారు క్రీ.పూ. 1491
మీకు విరుద్ధంగా అడవి జంతువులు పంపుతాను, అవి మీ నుండి మీ పిల్లలను దోచుకుంటాయి, మీ పశువులను నాశనం చేస్తాయి, మీ మార్గాలన్నీ నిర్మానుష్యమయేలా మీ సంఖ్య తగ్గేలా చేస్తాయి.
- లేవీయకాండము 26:23సుమారు క్రీ.పూ. 1491
“ ‘ఇవన్నీ జరిగినా కూడా నా దిద్దుబాటును అంగీకరించకుండా నాకు విరుద్ధంగా ఉండడం కొనసాగిస్తే,