- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- లేవీయకాండము 25:4సుమారు క్రీ.పూ. 1491
కానీ ఏడవ సంవత్సరం భూమికి సబ్బాతు విశ్రాంతి సంవత్సరం, అది యెహోవాకు సబ్బాతు. మీ పొలాల్లో విత్తనాలు వేయకూడదు. ద్రాక్షతోటలు సాగుచేయకూడదు.
- లేవీయకాండము 25:5సుమారు క్రీ.పూ. 1491
దానికదిగా పెరిగే పంటను కోయవద్దు, సాగుచేయని మీ ద్రాక్షతోటల నుండి ద్రాక్షపండ్లను కోయవద్దు. భూమికి ఒక సంవత్సరం విశ్రాంతి ఉండాలి.
- లేవీయకాండము 25:6సుమారు క్రీ.పూ. 1491
సబ్బాతు సంవత్సరంలో భూమి దానికదిగా ఏ పంట మీకు, మీ దాసులకు, దాసీలకు, మీ మధ్య నివసించే కూలి పనివారికి, అలాగే మీ మధ్య నివసించే విదేశీయులకు ఆహారమవుతుంది,
- లేవీయకాండము 25:7సుమారు క్రీ.పూ. 1491
అలాగే మీ పశువులకు, మీ దేశంలోని అడవి జంతువులకు ఆహారం అవుతుంది. భూమి దేన్ని ఉత్పత్తి చేసినా తినవచ్చు.
- లేవీయకాండము 25:8సుమారు క్రీ.పూ. 1491
“ ‘ఏడు సబ్బాతు విశ్రాంతి సంవత్సరాలు లెక్కించాలి అంటే ఏడు సంవత్సరాలు ఏడు మార్లు గుణిస్తే ఏడు సబ్బాతు విశ్రాంతి సంవత్సరాల కాలం మొత్తం నలభై తొమ్మిది సంవత్సరాలు.
- లేవీయకాండము 25:9సుమారు క్రీ.పూ. 1491
ఏడవ నెల పదవ రోజు అంతటా బూరధ్వని చేయాలి. ప్రాయశ్చిత్త దినాన మీ దేశమంతటా ఈ బూరధ్వని చేయాలి.
- లేవీయకాండము 25:10సుమారు క్రీ.పూ. 1491
యాభైయవ సంవత్సరాన్ని ప్రతిష్ఠితం చేసి, దేశమంతటా దాని నివాసులందరికి స్వేచ్ఛను ప్రకటించండి. ఇది మీకు యాభైయవ వార్షికోత్సవం అవుతుంది; మీలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబ స్వాస్థ్యానికి, మీ సొంత కుటుంబానికి తిరిగి వెళ్లాలి.
- లేవీయకాండము 25:11సుమారు క్రీ.పూ. 1491
యాభైయవ సంవత్సరం మీకు వార్షికోత్సవంగా ఉండాలి. ఆ ఏట మీరు విత్తనాలు వేయకూడదు, దానంతట అది పెరిగిన పంట కోయగూడదు. తీర్చిదిద్దని ద్రాక్ష తీగె నుండి పండ్లు కోయగూడదు.
- లేవీయకాండము 25:12సుమారు క్రీ.పూ. 1491
అది యాభైయవ వార్షికోత్సవం, మీకు పరిశుద్ధంగా ఉండాలి; నేరుగా పొలాల నుండి తీసుకున్న దానిని మాత్రమే తినాలి.
- లేవీయకాండము 25:13సుమారు క్రీ.పూ. 1491
“ ‘ఈ యాభైయవ వార్షికోత్సవంలో అందరు తమ స్వాస్థ్యానికి తిరిగి వెళ్తారు.
- లేవీయకాండము 25:14సుమారు క్రీ.పూ. 1491
“ ‘మీ సొంత ప్రజలకు స్థలమేదైన అమ్మినా లేదా వారి నుండి కొన్నా, ఒకరిపట్ల ఒకరు స్వప్రయోజనం ఆశించకూడదు.
- లేవీయకాండము 25:15సుమారు క్రీ.పూ. 1491
గత యాభైయవ వార్షికోత్సవం తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచాయో లెక్క చూసి ఆ ప్రకారం మీ సొంత ప్రజల దగ్గర పొలం కొనాలి. పంట పండించడానికి మిగతా సంవత్సరాల లెక్క ప్రకారమే అతడు అమ్మాలి.
- లేవీయకాండము 25:16సుమారు క్రీ.పూ. 1491
సంవత్సరాలు చాలా ఉన్నప్పుడు, మీరు ధరను పెంచాలి, సంవత్సరాలు తక్కువగా ఉన్నప్పుడు, మీరు ధరను తగ్గించాలి, ఎందుకంటే మీకు నిజంగా అమ్మబడుతుంది పంటల సంఖ్య.
- లేవీయకాండము 25:17సుమారు క్రీ.పూ. 1491
ఒకరిపట్ల ఒకరు స్వప్రయోజనం చూసుకోకూడదు కాని మీ దేవునికి భయపడాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.
- లేవీయకాండము 25:18సుమారు క్రీ.పూ. 1491
“ ‘నా శాసనాలు పాటించండి, నా చట్టాలకు లోబడుటలో జాగ్రత్త వహించండి, తద్వార మీరు దేశంలో క్షేమంగా జీవిస్తారు.
- లేవీయకాండము 25:19సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు భూమి దాని ఫలాలను ఇస్తుంది, మీరు మీ సమృద్ధి నుండి తిని అక్కడ క్షేమంగా జీవిస్తారు.
- లేవీయకాండము 25:20సుమారు క్రీ.పూ. 1491
“మేము మా పంటలను నాటడం లేదా పండించకపోతే ఏడవ సంవత్సరంలో మేము ఏమి తింటాము?” అని మీరు అడగవచ్చు.
- లేవీయకాండము 25:21సుమారు క్రీ.పూ. 1491
ఆరవ సంవత్సరంలో మీకు మూడేళ్లకు తగినంత దిగుబడిని భూమి ఇచ్చేటువంటి ఆశీర్వాదం నేను పంపుతాను.
- లేవీయకాండము 25:22సుమారు క్రీ.పూ. 1491
ఎనిమిదవ సంవత్సరంలో మళ్ళీ విత్తనాలు వేయండి. ఆ సంవత్సరంలో మళ్ళీ తొమ్మిదవ సంవత్సరంలో పంట కూర్చునే వరకు మీరు ఆ పంటే తింటారు.
- లేవీయకాండము 25:23సుమారు క్రీ.పూ. 1491
“ ‘భూమి శాశ్వతంగా అమ్మకూడదు, ఎందుకంటే భూమి నాది, మీరు నా భూమిలో విదేశీయులు, అపరిచితులుగా నివసిస్తున్నారు.
- లేవీయకాండము 25:24సుమారు క్రీ.పూ. 1491
మీరు స్వాధీనంగా కలిగి ఉన్న భూమి అంతటా, మీరు భూమిని విడిపించడానికి తప్పక ఏర్పాటు చేయాలి.
- లేవీయకాండము 25:25సుమారు క్రీ.పూ. 1491
“ ‘ఒకవేళ మీ తోటి ఇశ్రాయేలీయులలో ఒకరు పేదవారిగా మారి వారి ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మితే, వారి అతి సమీపబంధువు వచ్చి వారు అమ్మిన వాటిని తిరిగి విడిపించాలి.
- లేవీయకాండము 25:26సుమారు క్రీ.పూ. 1491
ఒకవేళ, వారి కోసం దానిని విడిపించడానికి సమీపబంధువు ఎవరు లేకపోతే, కాని తర్వాత వారు వృద్ధి చెంది దానిని విడిపించుకోడానికి తగినంత సంపాదిస్తే,
- లేవీయకాండము 25:27సుమారు క్రీ.పూ. 1491
వారు దాన్ని కొన్నప్పటి నుండి వారు విలువను నిర్ణయించి, బకాయిలను వారు ఎవరికి అమ్మారో వారికి తిరిగి చెల్లించాలి; వారు తిరిగి వారి సొంత ఆస్తికి వెళ్లవచ్చు.
- లేవీయకాండము 25:28సుమారు క్రీ.పూ. 1491
ఆస్తి మళ్ళీ కొనుక్కోవడానికి కావలసినంత డబ్బు వారికి దొరక్కపోతే, వారు అమ్మిన ఆస్తి యాభైయవ వార్షికోత్సవం వరకు కొన్న వారి స్వాధీనమవుతుంది. యాభైయవ వార్షికోత్సవంలో అది వారికి తిరిగి ఇవ్వబడుతుంది, వారు తమ స్వాస్థ్యానికి తిరిగి వెళ్లవచ్చు.