కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లేవీయకాండము 24:2సుమారు క్రీ.పూ. 1490

    “వెలుగు కోసం దీపాలు నిరంతరం వెలుగుతూ ఉండేలా దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవ నూనెను మీ దగ్గరకు తీసుకురావాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.

  2. లేవీయకాండము 24:3సుమారు క్రీ.పూ. 1490

    సమావేశ గుడారంలో నిబంధన మందసాన్ని కప్పి ఉంచే తెర బయట అహరోను సాయంత్రం నుండి ఉదయం వరకు నిత్యం యెహోవా ఎదుట దీపాలను వెలిగించాలి. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

  3. లేవీయకాండము 24:4సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా ఎదుట మేలిమి బంగారు దీపస్తంభంపై ఉన్న దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి.

  4. లేవీయకాండము 24:5సుమారు క్రీ.పూ. 1490

    “నాణ్యమైన పిండి తీసుకుని ఒక్కొక్క రొట్టెకు రెండు ఓమెర్ల చొప్పున పన్నెండు రొట్టెలు చేయాలి.

  5. లేవీయకాండము 24:6సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా ఎదుట మేలిమి బంగారు బల్లపై, వాటిని ఒక వరుసకు ఆరు చొప్పున రెండు వరుసల్లో అమర్చాలి.

  6. లేవీయకాండము 24:7సుమారు క్రీ.పూ. 1490

    రొట్టెను సూచించడానికి యెహోవాకు అర్పించే హోమబలిగా ఉండడానికి ప్రతి వరుస దగ్గర జ్ఞాపక భాగంగా కొంత స్వచ్ఛమైన ధూపం ఏర్పాటు చేయాలి.

  7. లేవీయకాండము 24:8సుమారు క్రీ.పూ. 1490

    నిత్య నిబంధనగా, ఇశ్రాయేలు పక్షాన ప్రతి సబ్బాతు దినాన యెహోవా ఎదుట ఆ రొట్టెలను బల్లపై పెడుతూ ఉండాలి.

  8. లేవీయకాండము 24:9సుమారు క్రీ.పూ. 1490

    అది అహరోను అతని కుమారులకు చెందినది, వారు దీనిని పరిశుద్ధాలయ ప్రాంతంలో తినాలి, ఎందుకంటే ఇది యెహోవాకు సమర్పించిన హోమబలులలో వారి శాశ్వత వాటాలో అతిపరిశుద్ధమైన భాగము.”

  9. లేవీయకాండము 24:10సుమారు క్రీ.పూ. 1490

    ఒక రోజు ఇశ్రాయేలు తల్లికి ఈజిప్టు తండ్రికి పుట్టిన కుమారుడు ఇశ్రాయేలీయుల మధ్యకు వెళ్లాడు, అక్కడ శిబిరంలో అతనికి, ఒక ఇశ్రాయేలీయునికి మధ్య గొడవ జరిగింది.

  10. లేవీయకాండము 24:11సుమారు క్రీ.పూ. 1490

    ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు యెహోవా నామాన్ని దూషిస్తూ శపించాడు; కాబట్టి వారు అతన్ని మోషే దగ్గరకు తీసుకువచ్చారు. (అతని తల్లి పేరు షెలోమీతు, దాను గోత్రానికి చెందిన దిబ్రీ కుమార్తె.)

  11. లేవీయకాండము 24:12సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా చిత్తం వారికి తెలిసే వరకు వారు అతన్ని అదుపులో ఉంచారు.

  12. లేవీయకాండము 24:13సుమారు క్రీ.పూ. 1490

    అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  13. లేవీయకాండము 24:14సుమారు క్రీ.పూ. 1490

    “ఆ దైవదూషకున్ని శిబిరం బయటకు తీసుకెళ్లు. అతని మాటలు విన్న వారంతా అతని తలపై చేతులుంచగానే సమాజమంతా రాళ్లతో అతన్ని కొట్టి చంపాలి.

  14. లేవీయకాండము 24:15సుమారు క్రీ.పూ. 1490

    ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఎవరైనా తమ దేవున్ని శపిస్తే, తమ పాపశిక్షను భరించాలి;

  15. లేవీయకాండము 24:16సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా నామాన్ని ఎవరైనా దూషిస్తే, వారు మరణశిక్షకు గురి అవుతారు. సమాజమంత వారిని రాళ్లతో కొట్టి చంపాలి. విదేశీయులైనా, స్వదేశీయులైనా, యెహోవా నామాన్ని దూషిస్తే, వారికి మరణశిక్ష విధించాలి.

  16. లేవీయకాండము 24:17సుమారు క్రీ.పూ. 1490

    “ ‘ఎవరైనా మనుష్యుని చంపితే వారికి మరణశిక్ష విధించాలి.

  17. లేవీయకాండము 24:18సుమారు క్రీ.పూ. 1490

    ఎవరైనా జంతువును చంపితే ప్రాణానికి బదులుగా ప్రాణమిచ్చి నష్టపరిహారం చెల్లించాలి.

  18. లేవీయకాండము 24:19సుమారు క్రీ.పూ. 1490

    పొరుగువారిని ఎవరైనా గాయపరిస్తే, వారిని కూడా అలాగే గాయపరచాలి:

  19. లేవీయకాండము 24:20సుమారు క్రీ.పూ. 1490

    ఎముక విరగ్గొడితే ఎముక విరగ్గొట్టాలి, కంటికి కన్ను, పంటికి పన్ను. గాయం చేసిన మనుష్యునికి గాయం చేయాలి.

  20. లేవీయకాండము 24:21సుమారు క్రీ.పూ. 1490

    ఎవరైనా జంతువును చంపితే నష్టపరిహారం చెల్లించాలి కాని ఎవరైనా మనిషిని చంపితే, వారికి మరణశిక్ష విధించాలి.

  21. లేవీయకాండము 24:22సుమారు క్రీ.పూ. 1490

    విదేశీయులకు స్వదేశీయులకు ఒకే చట్టం ఉండాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”

  22. లేవీయకాండము 24:23సుమారు క్రీ.పూ. 1490

    అప్పుడు మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడిన తర్వాత వారు దైవదూషకున్ని శిబిరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేశారు.

  23. లేవీయకాండము 25:1సుమారు క్రీ.పూ. 1491

    సీనాయి పర్వతం మీద యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  24. లేవీయకాండము 25:2సుమారు క్రీ.పూ. 1491

    “ఇశ్రాయేలీయులతో మాట్లాడి ఇలా చెప్పు: ‘నేను మీకు ఇవ్వబోయే దేశంలో మీరు ప్రవేశించినప్పుడు, స్వయాన ఆ భూమి కూడా యెహోవాకు సబ్బాతు పాటించాలి.

  25. లేవీయకాండము 25:3సుమారు క్రీ.పూ. 1491

    ఆరు సంవత్సరాలు పొలంలో విత్తనాలు చల్లాలి విత్తనాలు చల్లవచ్చు, ద్రాక్షతోటలు సాగుచేసుకుని వాటి ఫలాలు సమకూర్చుకోవచ్చు.