కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లేవీయకాండము 22:29సుమారు క్రీ.పూ. 1490

    “మీరు యెహోవాకు కృతజ్ఞతార్పణ అర్పించినప్పుడు, అది మీ పక్షంగా అంగీకరించబడే విధంగా అర్పించాలి.

  2. లేవీయకాండము 22:30సుమారు క్రీ.పూ. 1490

    అదే రోజు తప్పక దానిని తినాలి; ఉదయం వరకు ఏదీ మిగుల్చవద్దు. నేను యెహోవాను.

  3. లేవీయకాండము 22:31సుమారు క్రీ.పూ. 1490

    “నా ఆజ్ఞలు పాటించి వాటిని అనుసరించాలి. నేను యెహోవాను.

  4. లేవీయకాండము 22:32సుమారు క్రీ.పూ. 1490

    నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేయవద్దు, ఎందుకంటే నేను ఇశ్రాయేలీయుల ద్వార పరిశుద్ధునిగా గుర్తించబడాలి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచిన యెహోవాను,

  5. లేవీయకాండము 22:33సుమారు క్రీ.పూ. 1490

    మీకు దేవునిగా ఉండడానికి నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన వాడను. నేను యెహోవాను.”

  6. లేవీయకాండము 23:1సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  7. లేవీయకాండము 23:2సుమారు క్రీ.పూ. 1490

    “ఇశ్రాయేలీయులతో మాట్లాడి ఇలా చెప్పు: ‘నేను నియమించిన పండుగలు, యెహోవాకు నియమించబడిన పండుగలు, మీరు పరిశుద్ధ సమాజంగా చాటాల్సిన పండుగలు ఇవి.

  8. లేవీయకాండము 23:3సుమారు క్రీ.పూ. 1490

    “ ‘వారంలో ఆరు రోజులు పని చేయాలి, కాని ఏడవ రోజు సబ్బాతు విశ్రాంతి దినం, పరిశుద్ధ సమాజపు రోజు. అప్పుడు మీరు ఏ పని చేయకూడదు; మీరు ఎక్కడ నివసించినా, అది యెహోవాకు సబ్బాతు దినము.

  9. లేవీయకాండము 23:4సుమారు క్రీ.పూ. 1490

    “ ‘ఇవి యెహోవాకు నియమించబడిన పండుగలు, వీటిని మీరు పరిశుద్ధ సమాజానికి వాటి నియామక సమయాల్లో ప్రకటించాలి:

  10. లేవీయకాండము 23:5సుమారు క్రీ.పూ. 1490

    మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంత్రం యెహోవా యొక్క పస్కా పండుగ ప్రారంభము.

  11. లేవీయకాండము 23:6సుమారు క్రీ.పూ. 1490

    ఆ నెల పదిహేనవ రోజు యెహోవా యొక్క పులియని రొట్టెల పండుగ మొదలవుతుంది; ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి.

  12. లేవీయకాండము 23:7సుమారు క్రీ.పూ. 1490

    మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, పనులేవీ చేయకూడదు.

  13. లేవీయకాండము 23:8సుమారు క్రీ.పూ. 1490

    ఏడు రోజులు యెహోవాకు హోమబలులు అర్పించాలి. ఏడవ రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.’ ”

  14. లేవీయకాండము 23:9సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  15. లేవీయకాండము 23:10సుమారు క్రీ.పూ. 1490

    “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘నేను మీకు ఇవ్వబోతున్న దేశంలోకి మీరు ప్రవేశించినప్పుడు మీరు దాని పంటను కోయండి, మీరు పండించిన మొదటి ధాన్యం యొక్క పనను యాజకుని దగ్గరకు తీసుకుని రండి.

  16. లేవీయకాండము 23:11సుమారు క్రీ.పూ. 1490

    అతడు యెహోవా ఎదుట ఆ పనను పైకెత్తి దానిని అర్పించాలి తద్వార అది మీ పక్షంగా అంగీకరించబడుతుంది; దానిని యాజకుడు సబ్బాతు తర్వాత రోజున పైకెత్తి ఆడించాలి.

  17. లేవీయకాండము 23:12సుమారు క్రీ.పూ. 1490

    పనను పైకెత్తి అర్పించిన రోజు, లోపం లేని ఒక ఏడాది గొర్రెపిల్లను యెహోవాకు దహనబలిగా అర్పించాలి,

  18. లేవీయకాండము 23:13సుమారు క్రీ.పూ. 1490

    దాని భోజనార్పణతో పాటు రెండు ఓమెర్ల నాణ్యమైన పిండిని నూనెతో కలిపి యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా ఒక పావు హిన్ ద్రాక్షరసాన్ని పానార్పణగా సమర్పించాలి.

  19. లేవీయకాండము 23:14సుమారు క్రీ.పూ. 1490

    మీరు ఈ అర్పణను మీ దేవునికి తీసుకువచ్చే రోజు వరకు ఏ రొట్టె గాని, కాల్చిన ధాన్యం గాని లేదా క్రొత్త ధాన్యం గాని తినకూడదు. మీరు ఎక్కడ నివసించినా, రాబోయే తరాలకు ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

  20. లేవీయకాండము 23:15సుమారు క్రీ.పూ. 1490

    “ ‘సబ్బాతు దినం మరుసటి నుండి, మీరు ప్రత్యేక అర్పణ యొక్క పనను తెచ్చిన దినం నుండి, ఏడు వారాలు పూర్తిగా లెక్కించాలి.

  21. లేవీయకాండము 23:16సుమారు క్రీ.పూ. 1490

    ఏడవ సబ్బాతు దినానికి సరిగ్గా యాభై రోజులు లెక్కించాలి, అప్పుడు యెహోవాకు క్రొత్త ధాన్య అర్పణ అర్పించాలి.

  22. లేవీయకాండము 23:17సుమారు క్రీ.పూ. 1490

    మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడినుండి, రెండు ఓమెర్ల నాణ్యమైన పిండితో రెండు రొట్టెలను పులిసిన దానితో కాల్చి, యెహోవాకు అర్పించే ప్రథమ ఫలాల ప్రత్యేక అర్పణగా తీసుకురండి.

  23. లేవీయకాండము 23:18సుమారు క్రీ.పూ. 1490

    ఈ రొట్టెతో పాటు లోపం లేని ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలను, ఒక చిన్న ఎద్దును, రెండు పొట్టేళ్లను సమర్పించాలి. భోజనార్పణలు, పానార్పణలతో పాటు అవి యెహోవాకు దహనబలిగా ఉంటాయి, అది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.

  24. లేవీయకాండము 23:19సుమారు క్రీ.పూ. 1490

    పాపపరిహారబలి కోసం మేకపోతును, సమాధానబలిగా రెండు ఏడాది మగ గొర్రెపిల్లను అర్పించాలి.

  25. లేవీయకాండము 23:20సుమారు క్రీ.పూ. 1490

    యాజకుడు రెండు గొర్రెపిల్లలను ప్రథమ ఫలాల రొట్టెలతో పాటు యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి. అవి యాజకుని కోసం యెహోవాకు అర్పించే పరిశుద్ధ అర్పణలు.