- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- లేవీయకాండము 21:3సుమారు క్రీ.పూ. 1490
తన ఇంట్లో ఉంటున్న పెళ్ళికాని కన్య అయిన సోదరి చనిపోతే వారిని తాకి తన తాను అపవిత్రం చేసుకోవచ్చు.
- లేవీయకాండము 21:4సుమారు క్రీ.పూ. 1490
యాజకుడు తన భార్య తరుపు బంధువుల కోసం తనను అపవిత్రపరచుకుని అప్రతిష్ఠపాలు కాకూడదు.
- లేవీయకాండము 21:5సుమారు క్రీ.పూ. 1490
“ ‘యాజకులు తమ తల గుండు చేసుకోకూడదు, గడ్డం అంచులు కత్తిరించవద్దు; శరీరాన్ని గాయపరచవద్దు.
- లేవీయకాండము 21:6సుమారు క్రీ.పూ. 1490
వారు తమ దేవునికి పరిశుద్ధులై ఉండాలి. వారు తమ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. వారు దేవుని ఆహారమైన హోమబలులను యెహోవాకు సమర్పిస్తారు కాబట్టి వారు పరిశుద్ధులై ఉండాలి.
- లేవీయకాండము 21:7సుమారు క్రీ.పూ. 1490
“ ‘వారు వేశ్యను గాని చెడిపోయిన దాన్ని గాని పెళ్ళి చేసుకోవద్దు. భర్త విడాకులు ఇచ్చిన స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు, ఎందుకంటే యాజకులు తమ దేవునికి పవిత్రులు.
- లేవీయకాండము 21:8సుమారు క్రీ.పూ. 1490
మీ దేవునికి ఆహారం వారే అర్పిస్తారు కాబట్టి వారు పరిశుద్ధులు అని మీరు పరిగణించాలి. మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసే నేను పరిశుద్ధుడైన యెహోవాను కాబట్టి వారిని పరిశుద్ధులుగా భావించాలి.
- లేవీయకాండము 21:9సుమారు క్రీ.పూ. 1490
“ ‘యాజకుని కుమార్తె వేశ్యగా మారడం వల్ల తాను అపవిత్రమై తన తండ్రికి అపకీర్తి తెచ్చింది; కాబట్టి ఆమెను అగ్నితో కాల్చివేయాలి.
- లేవీయకాండము 21:10సుమారు క్రీ.పూ. 1490
“ ‘ప్రధాన యాజకునిగా ఉండడానికి తన సహోదరులలో ఎవరి తలపై అభిషేకతైలం పోయబడి, యాజక వస్త్రాలను ధరించడానికి ఎవరు నియమించబడ్డారో వారు తన జుట్టును విరబోసుకోవద్దు, బట్టలు చింపుకోకూడదు.
- లేవీయకాండము 21:11సుమారు క్రీ.పూ. 1490
అతడు శవాల దగ్గరకి వెళ్లకూడదు. అతడు తన తండ్రి శవం వలన గాని తల్లి శవం వలన గాని తనను తాను అపవిత్రంగా చేసుకోకూడదు.
- లేవీయకాండము 21:12సుమారు క్రీ.పూ. 1490
అతడు తన దేవుని అభిషేక తైలంతో ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి అతడు తన దేవుని పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టకూడదు, దానిని అపవిత్రం చేయకూడదు. నేను యెహోవాను.
- లేవీయకాండము 21:13సుమారు క్రీ.పూ. 1490
“ ‘అతడు కన్యను పెళ్ళి చేసుకోవాలి.
- లేవీయకాండము 21:14సుమారు క్రీ.పూ. 1490
విధవరాలిని గాని, భర్త విడిచిపెట్టిన దాన్ని గాని, వేశ్యను గాని పెళ్ళి చేసుకోకూడదు, తన సొంత ప్రజల్లో నుండి కన్యను అతడు పెళ్ళి చేసుకోవాలి,
- లేవీయకాండము 21:15సుమారు క్రీ.పూ. 1490
అతడు తన ప్రజల్లో తన సంతానాన్ని అపవిత్రం చేయకూడదు. అతన్ని పరిశుద్ధపరచే యెహోవాను నేను.’ ”
- లేవీయకాండము 21:16సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేతో ఇలా అన్నారు,
- లేవీయకాండము 21:17సుమారు క్రీ.పూ. 1490
“నీవు అహరోనుతో చెప్పు: ‘రాబోయే తరాలలో మీ వారసులలో లోపం ఉన్నవారెవరైనా తన దేవుని ఆహారాన్ని అర్పించడానికి దగ్గరకు రాకూడదు.
- లేవీయకాండము 21:18సుమారు క్రీ.పూ. 1490
లోపం ఉన్నవారు అనగా గ్రుడ్డివారు గాని కుంటివారు గాని వికృతంగా ఉన్నవారు గాని లేదా అంగవైకల్యం గలవారు గాని;
- లేవీయకాండము 21:19సుమారు క్రీ.పూ. 1490
కాలు లేక చేయి విరిగినవారు గాని
- లేవీయకాండము 21:20సుమారు క్రీ.పూ. 1490
గూనివారు గాని మరుగుజ్జులు గాని కంటి లోపం ఉన్నవారు గాని గజ్జి ఉన్నవారు గాని చీము కారుతున్న పుండ్లతో ఉన్నవారు గాని వరిబీజములు పాడైనవారు గాని సమీపంగా రాకూడదు.
- లేవీయకాండము 21:21సుమారు క్రీ.పూ. 1490
యాజకుడైన అహరోను వారసులలో లోపం ఉన్న ఏ ఒక్కరు యెహోవాకు హోమబలులు అర్పించడానికి దగ్గరకు రాకూడదు. అతనికి లోపం ఉంది; అతడు తన దేవుని ఆహారాన్ని అర్పించడానికి దగ్గరకు రాకూడదు.
- లేవీయకాండము 21:22సుమారు క్రీ.పూ. 1490
అతడు తన దేవునికి అర్పించే అతి పవిత్రమైన ఆహారాన్ని గాని పవిత్రమైన ఆహారాన్ని తినవచ్చు;
- లేవీయకాండము 21:23సుమారు క్రీ.పూ. 1490
అయినాసరే అతనికున్న లోపం కారణంగా అతడు తెర దగ్గరకు వెళ్లకూడదు, బలిపీఠం దగ్గరకు వెళ్లకూడదు, నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేయకూడదు. వారిని పరిశుద్ధులుగా చేసే యెహోవాను నేనే.’ ”
- లేవీయకాండము 21:24సుమారు క్రీ.పూ. 1490
మోషే అహరోనుకు అతని కుమారులకు ఇశ్రాయేలీయులందరికి ఈ విషయాలు చెప్పాడు.
- లేవీయకాండము 22:1సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేతో అన్నారు,
- లేవీయకాండము 22:2సుమారు క్రీ.పూ. 1490
“ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించే పవిత్రమైన అర్పణలను గౌరవించుమని అహరోనుతో అతని కుమారులతో చెప్పు, తద్వార వారు నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేయకుండ ఉంటారు. నేను యెహోవాను.
- లేవీయకాండము 22:3సుమారు క్రీ.పూ. 1490
“వారితో ఇలా చెప్పు: ‘రాబోయే తరాలలో మీ వారసులలో ఎవరైనా ఆచారరీత్య అపవిత్రులై ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే పవిత్ర అర్పణల దగ్గరకు వస్తే, వారు నా సన్నిధిలో నుండి తొలగించబడాలి. నేను యెహోవాను.