కంటెంట్‌కు వెళ్లండి

circa 1406–1380 BC

Conquest of Canaan

Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.

658 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. యెహోషువ 2:8సుమారు క్రీ.పూ. 1451

    ఆ వేగులవారు రాత్రి పడుకునే ముందు రాహాబు వారున్న మిద్దె మీదికి వెళ్లి,

  2. యెహోషువ 2:9సుమారు క్రీ.పూ. 1451

    వారితో, “యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు చాలా భయం, ఈ దేశంలో నివసించే వారందరూ మీరంటే భయంతో క్రుంగిపోతున్నారు.

  3. యెహోషువ 2:10సుమారు క్రీ.పూ. 1451

    మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా మీ కోసం ఎర్ర సముద్రపు నీటిని ఎలా ఆరిపోయేలా చేశారో, మీరు పూర్తిగా నాశనం చేసిన యొర్దానుకు తూర్పున ఉన్న ఇద్దరు అమోరీయుల రాజులైన సీహోను, ఓగుల గురించి విన్నాము.

  4. యెహోషువ 2:11సుమారు క్రీ.పూ. 1451

    ఈ విషయాలు విన్నప్పుడు, మా గుండెలు భయంతో క్రుంగి, మిమ్మల్ని బట్టి ఎవరికి ఏమాత్రం ధైర్యం లేదు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలోను క్రింద భూమి మీద కూడా దేవుడే.

  5. యెహోషువ 2:12సుమారు క్రీ.పూ. 1451

    “ఇప్పుడు, దయచేసి మీరు నా కుటుంబం మీద దయ చూపిస్తారని యెహోవా మీద ప్రమాణం చేయండి. ఎందుకంటే నేను మీ పట్ల దయ చూపించాను కాబట్టి మీరు నా తల్లిదండ్రుల, నా అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ల, అలాగే వారికి సంబంధించిన వారినందరిని ప్రాణాలతో కాపాడతారని నాకొక నిజమైన సూచన ఇవ్వండి” అని అడిగింది.

  6. యెహోషువ 2:13సుమారు క్రీ.పూ. 1451

    And that ye will save alive my father, and my mother, and my brethren, and my sisters, and all that they have, and deliver our lives from death.

  7. యెహోషువ 2:14సుమారు క్రీ.పూ. 1451

    అందుకు వారు, “మేము ఏమి చేస్తున్నామో, నీవు చెప్పకుండా ఉంటే మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డుపెడతాం! యెహోవా ఈ దేశాన్ని మాకు ఇచ్చినప్పుడు మేము మీ పట్ల దయతో నమ్మకంగా ఉంటాము” అని చెప్పారు.

  8. యెహోషువ 2:15సుమారు క్రీ.పూ. 1451

    రాహాబు ఇల్లు పట్టణ గోడమీద ఉంది కాబట్టి, ఆమె వారిని కిటికీ నుండి త్రాడుతో క్రిందకు దింపింది.

  9. యెహోషువ 2:16సుమారు క్రీ.పూ. 1451

    ఆమె వారితో, “మీరు కొండ సీమకు వెళ్లండి, మిమ్మల్ని తరుముతున్నవారు మిమ్మల్ని పట్టుకోలేరు. వారు తిరిగి వచ్చేవరకు అక్కడే మూడు రోజులు దాక్కోండి, తర్వాత మీ దారిన మీరు వెళ్లవచ్చు” అని చెప్పింది.

  10. యెహోషువ 2:17సుమారు క్రీ.పూ. 1451

    అందుకు వారు ఆమెతో, “మేము నీతో చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండేలా లేకపోతే మేము నిర్దోషులం:

  11. యెహోషువ 2:18సుమారు క్రీ.పూ. 1451

    మేము ఈ దేశానికి వచ్చినప్పుడు, నీవు మమ్మల్ని క్రిందికి దించిన కిటికీకి ఈ ఎర్రని త్రాడును కట్టి మమ్మల్ని క్రిందికి దించిన కిటికీకి కట్టాలి, మీ అమ్మ నాన్నలను, మీ అన్నదమ్ములను, మీ కుటుంబమంతటిని నీ ఇంట్లోనే ఉంచాలి.

  12. యెహోషువ 2:19సుమారు క్రీ.పూ. 1451

    ఒకవేళ నీ ఇంటి నుండి ఎవరైనా బయటి వీధిలోకి వెళ్తే వారి చావుకు వారే బాధ్యులు మేము బాధ్యులం కాము. అయితే నీ ఇంట్లో నీ దగ్గరున్న వారి మీద చేయి పడినా అది మా బాధ్యత.

  13. యెహోషువ 2:20సుమారు క్రీ.పూ. 1451

    అయితే ఒకవేళ మా గురించి నీవు ఎవరికైనా చెప్తే, నీవు మాతో చేయించిన ప్రమాణం నుండి మేము విముక్తులం” అని అన్నారు.

  14. యెహోషువ 2:21సుమారు క్రీ.పూ. 1451

    అందుకామె, “సరే, మీరు చెప్పినట్టే కానివ్వండి” అని చెప్పి వారిని పంపివేసింది. వారు వెళ్లిన తర్వాత ఆమె ఆ ఎర్రని త్రాడును కిటికీకి కట్టింది.

  15. యెహోషువ 2:22సుమారు క్రీ.పూ. 1451

    వారు అక్కడినుండి కొండల్లోకి వెళ్లి, తమను తరిమినవారు దారి పొడవునా తమను వెదికి వారిని పట్టుకోలేక తిరిగి వెళ్లిపోయేవరకు మూడు రోజులు అక్కడ ఉన్నారు.

  16. యెహోషువ 2:23సుమారు క్రీ.పూ. 1451

    తర్వాత ఆ ఇద్దరు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. వారు ఆ కొండలు దిగి నదిని దాటి నూను కుమారుడైన యెహోషువ దగ్గరకు వెళ్లి, జరిగినదంతా అతనికి చెప్పారు.

  17. యెహోషువ 2:24సుమారు క్రీ.పూ. 1451

    వారు యెహోషువతో, “ఖచ్చితంగా యెహోవా ఆ దేశాన్నంతటిని మన చేతులకు అప్పగించారు. ఆ దేశ ప్రజలందరూ మనమంటే భయంతో క్రుంగిపోతున్నారు” అని చెప్పారు.

  18. యెహోషువ 3:1సుమారు క్రీ.పూ. 1451

    ఉదయాన్నే యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వెళ్లి, దానిని దాటే ముందు అక్కడ బస చేశారు.

  19. యెహోషువ 3:2సుమారు క్రీ.పూ. 1451

    మూడు రోజుల తర్వాత అధికారులు శిబిరమంతా తిరుగుతూ,

  20. యెహోషువ 3:3సుమారు క్రీ.పూ. 1451

    ప్రజలకిలా ఆజ్ఞలు జారీ చేశారు: “మీ దేవుడైన యెహోవా నిబంధన మందసాన్ని యాజకులైన లేవీయులు మోయటం మీరు చూసినప్పుడు, మీ స్థలాల నుండి బయలుదేరి దానిని వెంబడించాలి.

  21. యెహోషువ 3:4సుమారు క్రీ.పూ. 1451

    మీరు వెళ్లే మార్గంలో ఇంతకు ముందు వెళ్లలేదు మీరు దానిని తెలుసుకోవాలి. కాబట్టి మీకు, మందసానికి మధ్య దాదాపు రెండువేల మూరల దూరం ఉండాలి; దాని దగ్గరగా నడవకూడదు.”

  22. యెహోషువ 3:5సుమారు క్రీ.పూ. 1451

    యెహోషువ ప్రజలతో, “రేపు యెహోవా మీ మధ్య అద్భుతాలు చేస్తారు, కాబట్టి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి” అని చెప్పాడు.

  23. యెహోషువ 3:6సుమారు క్రీ.పూ. 1451

    యెహోషువ యాజకులతో, “నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజలకు ముందుగా వెళ్లండి” అన్నాడు. కాబట్టి వారు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజలకు ముందుగా నడిచారు.

  24. యెహోషువ 3:7సుమారు క్రీ.పూ. 1451

    యెహోవా యెహోషువతో, “నేను మోషేతో ఉన్నట్లు నీతో కూడా ఉన్నానని ఇశ్రాయేలీయులందరు తెలుసుకునేలా ఈ రోజు వారి కళ్ళెదుట నిన్ను గొప్పవానిగా చేయడం ప్రారంభిస్తాను.

  25. యెహోషువ 3:8సుమారు క్రీ.పూ. 1451

    నిబంధన మందసాన్ని మోసే యాజకులతో: ‘మీరు యొర్దాను నది నీటి అంచులకు చేరినప్పుడు, వెళ్లి నదిలో నిలబడాలి’ అని నిబంధన మందసాన్ని మోసే యాజకులతో చెప్పు.”