కంటెంట్‌కు వెళ్లండి

Joseph

199 వచనాలు · 17 కుటుంబ సభ్యులు

Joseph ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంతాప దినాలు గడిచాక, యోసేపు ఫరో ఇంటివారితో, “నేను మీ దృష్టిలో దయ పొందితే, నా పక్షాన ఫరోతో మాట్లాడండి. అతనితో,

  2. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్లినప్పుడు అతనితో ఫరో అధికారులందరు, అతని ఇంటి పెద్దలు, ఈజిప్టు ఉన్నతాధికారులందరు,

  3. యోసేపు ఇంటివారందరు, అతని సోదరులు, అతని తండ్రి ఇంటివారితో వెళ్లారు. కేవలం వారి పిల్లలను, వారి మందలను, పశువులను గోషేనులో విడిచిపెట్టారు.

  4. తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత యోసేపు తన సోదరులతో, సమాధి కార్యక్రమానికి వచ్చిన వారందరితో ఈజిప్టుకు తిరిగి వెళ్లాడు.

  5. తమ తండ్రి చనిపోయాడని యోసేపు సోదరులు చూసి, “ఒకవేళ యోసేపు మనపై కక్ష పెట్టుకుని మనం చేసిన తప్పులకు ప్రతి కీడు చేస్తే ఎలా?” అని అనుకున్నారు.

  6. కాబట్టి వారు యోసేపుకు ఇలా కబురు పంపారు, “నీ తండ్రి చనిపోకముందు ఇలా ఈ సూచనలు ఇచ్చాడు:

  7. ‘యోసేపుతో ఇలా మీరు చెప్పాలి: నీ సోదరులు నిన్ను హీనంగా చూస్తూ నీ పట్ల చేసిన పాపాలను తప్పులను క్షమించమని చెప్తున్నాను.’ కాబట్టి దయచేసి నీ తండ్రి యొక్క దేవుని సేవకుల పాపాలను క్షమించు.” వారి కబురు అందిన తర్వాత యోసేపు ఏడ్చాడు.

  8. అయితే యోసేపు వారితో, “భయపడకండి, నేనేమైన దేవుని స్థానంలో ఉన్నానా?

  9. యోసేపు తన తండ్రి కుటుంబంతో కలిసి ఈజిప్టులో నివసించాడు. అతడు నూటపది సంవత్సరాలు జీవించాడు,

  10. ఎఫ్రాయిం పిల్లల మూడవ తరాన్ని చూశాడు. మనష్షే కుమారుడైన మాకీరుకు పుట్టిన పిల్లలు కూడా యోసేపు సొంతవారిగా పెరిగారు.

  11. యోసేపు తన సోదరులతో, “నేను చనిపోబోతున్నాను. అయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శించి, ఈ దేశం నుండి ఆయన అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తారు” అని చెప్పాడు.

  12. యోసేపు ఇశ్రాయేలు కుమారులతో ప్రమాణం చేయించుకుని, “దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శిస్తారు, అప్పుడు మీరు ఈ స్థలం నుండి నా ఎముకలను తీసుకెళ్లండి” అని చెప్పాడు.

  13. యోసేపు నూటపది సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. అతని శవాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచాక, ఈజిప్టులో అతని శరీరాన్ని ఒక శవపేటికలో ఉంచారు.

  14. యాకోబు సంతతివారందరు డెబ్బైమంది; అప్పటికే యోసేపు ఈజిప్టులో ఉన్నాడు.

  15. కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు, అతని అన్నదమ్ములు ఆ తరం వారందరు చనిపోయారు,

  16. కొంతకాలం తర్వాత, యోసేపు గురించి తెలియని ఒక క్రొత్త రాజు ఈజిప్టులో అధికారంలోకి వచ్చాడు.

  17. యోసేపు ఇశ్రాయేలీయులతో, “దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శించడానికి వస్తారు, అప్పుడు మీరు నా ఎముకలను ఈ ప్రదేశం నుండి మీతో తీసుకెళ్లాలి” అని ప్రమాణం చేయించుకున్నాడు. కాబట్టి మోషే యోసేపు ఎముకలను తనతో తీసుకున్నాడు.

  18. యోసేపు కుమారుల నుండి: ఎఫ్రాయిం గోత్రం నుండి అమీహూదు కుమారుడైన ఎలీషామా; మనష్షే గోత్రం నుండి పెదాసూరు కుమారుడైన గమలీయేలు;

  19. యోసేపు కుమారులు: ఎఫ్రాయిం సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.

  20. మనష్షే (యోసేపు గోత్రం) గోత్రం నుండి, సూసీ కుమారుడైన గద్దీ;

  21. మనష్షే ఎఫ్రాయిం వంశాల ప్రకారం యోసేపు వారసులు:

  22. ఇవి ఎఫ్రాయిం వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 32,500.

  23. యోసేపు కుమారుడైన మనష్షే వంశానికి చెందిన మనష్షే కుమారుడైన మాకీరు, అతని కుమారుడు గిలాదు, అతని కుమారుడు హెఫెరు, అతని కుమారుడైన సెలోఫెహాదు కుమార్తెలు. ఆ కుమార్తెల పేర్లు మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు ముందుకు వచ్చి

  24. అప్పుడు మోషే గాదీయులకు, రూబేనీయులకు, యోసేపు కుమారుడైన మనష్షే అర్థగోత్రానికి అమోరీయుల రాజైన సీహోను రాజ్యాన్ని, బాషాను రాజైన ఓగు రాజ్యాన్ని దాని పట్టణాలు, వాటి సరిహద్దులతో సహా ఆ స్థలాన్నంతటిని ఇచ్చాడు.

  25. యోసేపు కుమారుడైన మనష్షే గోత్రం నుండి ఏఫోదు కుమారుడైన హన్నీయేలు నాయకుడు;