Skip to content

Money గురించి బైబిల్ వచనాలు

192 వచనాలు · 40 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అబ్రాము పశువులు, వెండి బంగారాలతో ఎంతో ధనవంతుడయ్యాడు.

  2. రాబోయే తరాలలో ఎనిమిది రోజుల వయస్సున్న ప్రతి మగబిడ్డకు అంటే మీ ఇంట్లో పుట్టినవారైనా మీ సంతతి కాక విదేశీయుల నుండి కొనబడినవారైనా సున్నతి చేయబడాలి.

  3. మీ డబ్బుతో కొనబడినవారైనా, వారికి సున్నతి చేయబడాలి. మీ శరీరంలో నా నిబంధన నిత్య నిబంధనగా ఉండాలి.

  4. ఆ రోజే అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, ఇంట్లో పుట్టిన లేదా డబ్బుతో కొనబడిన మగవారికందరికి దేవుడు చెప్పినట్టు సున్నతి చేయించాడు.

  5. అబ్రాహాము ఇంటివారిలో మగవారందరు, అతని ఇంట్లో పుట్టిన వారు లేదా విదేశీయుల నుండి కొనబడిన అతనితో పాటు సున్నతి చేయించుకున్నారు.

  6. అతడు శారాతో, “నీ అన్నకు వెయ్యి షెకెళ్ళ వెండి ఇస్తున్నాను, ఇది నీతో ఉన్న వారందరి ఎదుట నీకు విరోధంగా చేసిన దానికి నష్టపరిహారం; నీవు పూర్తిగా నిర్దోషివి” అన్నాడు.

  7. That he may give me the cave of Machpelah, which he hath, which is in the end of his field; for as much money as it is worth he shall give it me for a possession of a buryingplace amongst you.

  8. అతడు ఆ దేశ ప్రజలందరూ వినేలా ఎఫ్రోనుతో, “నా మాట విను, పొలం యొక్క వెల నేను చెల్లిస్తాను. నా భార్య మృతదేహాన్ని అక్కడ నేను పాతిపెట్టేలా నా నుండి అది అంగీకరించు” అన్నాడు.

  9. My lord, hearken unto me: the land is worth four hundred shekels of silver; what is that betwixt me and thee? bury therefore thy dead.

  10. అబ్రాహాము ఎఫ్రోను చెప్పినట్టే ఒప్పుకుని, హిత్తీయుల వినికిడిలో వ్యాపారుల కొలత ప్రకారం నాలుగు వందల షెకెళ్ళ వెండి తూచి అతనికి ఇచ్చాడు.

  11. యెహోవా నా యజమానిని ఎంతో దీవించారు కాబట్టి అతడు చాలా ధనికుడయ్యాడు. అతనికి గొర్రెలను, మందలను, వెండి బంగారాలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను ఆయన ఇచ్చారు.

  12. అతడు మమ్మల్ని విదేశీయులుగా చూడట్లేదా? మమ్మల్ని అమ్మివేయడమే కాక, మాకు రావలసింది అతనే వాడుకున్నాడు.

  13. తాను గుడారం వేసుకున్న స్థలాన్ని షెకెము తండ్రియైన హమోరు కుమారుల దగ్గర వంద వెండి నాణేలకు కొన్నాడు.

  14. కాబట్టి మిద్యాను వర్తకులు అటు వచ్చినప్పుడు, యోసేపును తన అన్నలు బావిలో నుండి బయటకు లాగి ఇరవై షెకెళ్ళ వెండికి ఆ ఇష్మాయేలీయులకు అమ్మివేశారు, వారు అతన్ని ఈజిప్టుకు తీసుకెళ్లారు.

  15. యోసేపు వారి సంచుల్లో ధాన్యం నింపి, ఎవరి బస్తాలో వారి వెండిని తిరిగి పెట్టి, ప్రయాణంలో వారికి అవసరమైన భోజనపదార్థాలు ఇవ్వుమని ఆదేశించాడు.

  16. వారు తమ ధాన్యాన్ని తమ గాడిదల మీద పెట్టుకుని వెళ్లిపోయారు.

  17. రాత్రి గడపడానికి ఒక స్థలంలో ఆగినప్పుడు, వారిలో ఒకడు గాడిదకు మేతపెడదామని సంచి విప్పాడు, గోనెసంచి విప్పగానే అందులో తన వెండి ఉండడం చూశాడు.

  18. “నా వెండి నాకు తిరిగి ఇవ్వబడింది, నా గోనెసంచిలోనే అది ఉంది” అని సోదరులకు చెప్పాడు. వారి హృదయాలు కలవరపడ్డాయి. వారు వణకుతూ, ఒకరి వైపు ఒకరు తిరిగి, “దేవుడు మనకిలా చేశారేంటి?” అని చెప్పుకున్నారు.

  19. వారు కనాను దేశంలో తమ తండ్రి యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు, తమకు జరిగిందంతా అతనికి చెప్పారు. వారు అన్నారు,

  20. “ఆ దేశాధిపతి మాతో కఠినంగా మాట్లాడాడు, మేము ఆ దేశానికి వేగుచూడటానికి వచ్చామని అనుకున్నాడు.

  21. అతనికి, ‘మేము యథార్థవంతులం; వేగులవారం కాము.

  22. మేము పన్నెండుమంది సోదరులం, ఒక తండ్రి కుమారులము. ఒకడు చనిపోయాడు, కనిష్ఠుడు కనానులో తండ్రి దగ్గర ఉన్నాడు’ అని చెప్పాము.

  23. “ఆ దేశాధిపతి మాతో, ‘ఇలా మీరు యథార్థవంతులని నాకు తెలుస్తుంది: మీ సోదరులలో ఒకరిని ఇక్కడ నా దగ్గర వదిలేసి, ఆకలితో ఉన్న మీ ఇంటివారికి ఆహారం తీసుకెళ్లండి.

  24. కాని మీ తమ్మున్ని నా దగ్గరకు తీసుకురండి, తద్వారా మీరు యథార్థవంతులని తెలుసుకుంటాను. అప్పుడు మీ సోదరుని తిరిగి ఇచ్చేస్తాను, ఈ దేశంలో మీరు వ్యాపారం చేసుకోవచ్చు’ అన్నాడు.”

  25. వారు తమ గోనెసంచులను ఖాళీ చేస్తుండగా, ఎవరి గోనెసంచిలో వారి వెండి మూట ఉంది. వారు, వారి తండ్రి, వారి డబ్బు మూటలు చూసి భయపడిపోయారు.