Money గురించి బైబిల్ వచనాలు: Gold used as
Gold used as గురించి వచనాలు
అబ్రాము పశువులు, వెండి బంగారాలతో ఎంతో ధనవంతుడయ్యాడు.
యెహోవా నా యజమానిని ఎంతో దీవించారు కాబట్టి అతడు చాలా ధనికుడయ్యాడు. అతనికి గొర్రెలను, మందలను, వెండి బంగారాలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను ఆయన ఇచ్చారు.
యోసేపు తన ఇంటి గృహనిర్వాహకుని పిలిచి, “ఈ మనుష్యులు మోసికొని వెళ్లగలిగినంత ఆహారంతో వారి సంచులు నింపి ఎవరి గోనెసంచిలో వారు రూకలుగా తెచ్చిన వెండిని కూడా పెట్టు.
మా గోనెసంచులలో దొరికిన వెండి తిరిగి కనాను దేశం నుండి తెచ్చాము. కాబట్టి వెండి లేదా బంగారం ఎందుకు నీ యజమాని ఇంటి నుండి దొంగిలిస్తాము?
కాబట్టి దావీదు ఆ స్థలానికి ఆరువందల షెకెళ్ళ బంగారాన్ని ఒర్నానుకు ఇచ్చాడు.
రాజు అతని సలహాదారులు అధికారులు అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరు మన దేవుని మందిరానికి విరాళంగా ఇచ్చిన వెండి బంగారాన్ని వస్తువులను తూచి నేను వారికి ఇచ్చాను.
నేను 650 తలాంతుల వెండి, 100 తలాంతుల వెండి పాత్రలు, 100 తలాంతుల బంగారం
1,000 డారిక్కుల బరువుగల 20 బంగారు గిన్నెలు, మేలిమి బంగారమంతా విలువైన రెండు మెరిసే ఇత్తడి పాత్రలు తూచి ఇచ్చాను.
చూడండి, వారి మీద దాడి చేయడానికి నేను మెదీయ వారిని రేపుతాను. వారు వెండిని లెక్కచేయరు. బంగారం మీద వారికి ఆసక్తి లేదు.
కొంతమంది తమ సంచుల నుండి బంగారం కుమ్మరించి వెండిని తీసుకువచ్చి బరువు తూచి, తమకు దేవున్ని తయారుచేయడానికి కంసాలిని నియమిస్తారు, తర్వాత దానికి నమస్కరించి పూజిస్తారు.
నిజంగా ద్వీపాలు నా వైపు చూస్తాయి; నీ దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఘనపరచడానికి, తర్షీషు ఓడలు మొదట వస్తున్నాయి, దూరము నుండి నీ పిల్లలను తమ వెండి బంగారాలను తీసుకువస్తున్నాయి, ఎందుకంటే ఆయన నిన్ను వైభవంతో అలంకరించారు.
“ ‘వారు తమ వెండిని వీధుల్లో పారేస్తారు, వారి బంగారం అపవిత్రంగా పరిగణించబడుతుంది. యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని రక్షించలేవు. వారు పాపంలో పడడానికి అవి కారణంగా ఉన్నందుకు వాటివలన వారి ఆకలి తీరదు వారి కడుపు నిండదు.
నీకున్న జ్ఞానంతో వివేకంతో నీకోసం సంపద సంపాదించుకుని నీ ఖజానాలో వెండి బంగారాలను పోగు చేసుకున్నావు.
వారు ఆ ఇంట్లోకి వెళ్లి ఆ శిశువును తల్లియైన మరియను చూసి, వంగి నమస్కరించి ఆయనను ఆరాధించారు. తర్వాత వారు తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించారు.
“మీ నడికట్టులో బంగారం గాని వెండి గాని రాగి గాని పెట్టుకోకండి.
అప్పుడు పేతురు వానితో, “వెండి బంగారాలు నా దగ్గర లేవు గాని, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు పేరట లేచి నడువు” అని చెప్పి,
నేను ఎవరి వెండిని కాని బంగారం కాని వస్త్రాలను కాని ఆశించలేదు.
ఎలాగంటే, మీ పితరుల నుండి మీకు లభించిన వ్యర్థమైన జీవన విధానం నుండి మీకు విముక్తి ఇవ్వడానికి ఏమి అర్పించబడిందో మీకు తెలుసు. అది నశించిపోయే వెండి బంగారాల వంటిది కాదు.