- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Joseph
Joseph ను ప్రస్తావించే వచనాలు
యోసేపు తన తండ్రికి, తన సోదరులకు, తన తండ్రి ఇంటివారికందరికి వారి పిల్లల లెక్క ప్రకారం ఆహారాన్ని కూడా అందించాడు.
యోసేపు ఈజిప్టు కనాను దేశాలకు, ధాన్యం కొనుగోలుకు వచ్చిన డబ్బు మొత్తం సేకరించి ఫరో రాజభవనానికి తెచ్చాడు.
ఈజిప్టు కనాను ప్రజల డబ్బు అయిపోయినప్పుడు, ఈజిప్టు వారంతా యోసేపు దగ్గరకు వచ్చి, “మాకు ఆహారం ఇవ్వండి. మీ కళ్లముందే మేము ఎందుకు చావాలి? మా డబ్బంతా అయిపోయింది” అని అన్నారు.
అందుకు యోసేపు, “అలాగైతే మీ పశువులను తీసుకురండి, మీ డబ్బు అయిపోయింది కాబట్టి మీ పశువులకు బదులుగా నేను ఆహారం సరఫరా చేస్తాను” అని అన్నాడు.
కాబట్టి వారు యోసేపు దగ్గరకు తమ పశువులను తెచ్చారు. వారి గుర్రాలు, గొర్రెలు, మేకలు, పశువులు, గాడిదలకు బదులుగా వారికి ఆహారం ఇచ్చాడు. ఆ సంవత్సరమంతా వారి పశువులకు బదులుగా ఆహారం అందించాడు.
కాబట్టి యోసేపు ఫరో కోసం ఈజిప్టు భూమి అంతా కొన్నాడు. ఈజిప్టు వారంతా కరువు చాలా తీవ్రంగా ఉండడం వల్ల తమ భూములన్నీ అమ్మివేశారు. భూమి ఫరో ఆధీనంలోనికి వచ్చింది,
యోసేపు ప్రజలతో, “నేను మీ భూములను మిమ్మల్ని ఈ రోజు ఫరో కోసం కొన్నాను. ఇదిగో మీరు భూమిలో నాటడానికి విత్తనాలు తీసుకోండి.
కాబట్టి యోసేపు ఈజిప్టు దేశాన్ని ఉద్దేశించి శాసనం నియమించాడు. అది నేటి వరకు ఉంది. పంటంతటిలో అయిదవ వంతు ఫరోకు చెందుతుంది. అయితే యాజకుల స్థలం మాత్రం ఫరోకు చెందలేదు.
ఇశ్రాయేలు చనిపోయే సమయం సమీపించినప్పుడు, తన కుమారుడైన యోసేపును పిలిపించి, “నీ దృష్టిలో నేను దయ పొందినవాడనైతే, నా తొడ క్రింద చేయి పెట్టి, నా పట్ల మంచితనాన్ని, నమ్మకత్వాన్ని చూపుతావని ప్రమాణం చేయి. ఈజిప్టులో నన్ను పాతిపెట్టకు,
కొంతకాలం తర్వాత, “నీ తండ్రి అస్వస్థతతో ఉన్నాడు” అని యోసేపుకు చెప్పబడింది. కాబట్టి తన ఇద్దరు కుమారులు, మనష్షేను ఎఫ్రాయిమును తీసుకెళ్లాడు.
“నీ కుమారుడు, యోసేపు నీ దగ్గరకు వచ్చాడు” అని యాకోబుకు చెప్పబడినప్పుడు, ఇశ్రాయేలు బలం తెచ్చుకుని పడక మీద కూర్చున్నాడు.
యాకోబు యోసేపుతో ఇలా అన్నాడు, “సర్వశక్తిగల దేవుడు కనాను దేశంలో లూజు దగ్గర నాకు ప్రత్యక్షమై నన్ను దీవించి,
ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసినప్పుడు, “వీరు ఎవరు?” అని అడిగాడు.
“వారు దేవుడు నాకు ఇక్కడ అనుగ్రహించిన కుమారులు” అని యోసేపు తన తండ్రికి చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు, “నేను వారిని దీవించేలా వారిని నా దగ్గరకు తీసుకురా” అని అన్నాడు.
ఇశ్రాయేలు యోసేపుతో, “నేను నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు, కాని ఇప్పుడు నాకు దేవుడు నీ పిల్లలను కూడా చూసే భాగ్యం ఇచ్చారు” అన్నాడు.
అప్పుడు యోసేపు వారిని ఇశ్రాయేలు మోకాళ్లమీద నుండి తీసివేసి అతనికి తలవంచి నమస్కరించాడు.
యోసేపు వారిద్దరిని తీసుకుని, ఎఫ్రాయిమును తన కుడివైపు ఇశ్రాయేలుకు ఎడమవైపు మనష్షేను తన ఎడమవైపు ఇశ్రాయేలుకు కుడివైపు ఉంచి అతని దగ్గరకు తీసుకువచ్చాడు.
అప్పుడు అతడు యోసేపును దీవిస్తూ అన్నాడు, “నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నమ్మకంగా నడిచారో ఆ దేవుడు, నేటి వరకు నా జీవితమంతా నాకు కాపరిగా ఉన్న దేవుడు,
తన తండ్రి ఎఫ్రాయిం తలపై కుడిచేయి పెట్టడం చూసి యోసేపు అసంతృప్తి చెందాడు; ఎఫ్రాయిం తలపై నుండి మనష్షే తలపైకి చేయి మార్చడానికి తన తండ్రి చేతిని పట్టుకున్నాడు.
యోసేపు అతనితో, “లేదు, నా తండ్రి, ఇతడు మొదటి కుమారుడు; ఇతని తలపై నీ కుడిచేయిని పెట్టు” అన్నాడు.
తర్వాత ఇశ్రాయేలు యోసేపుతో, “నేను చనిపోబోతున్నాను, అయితే దేవుడు మీతో ఉంటారు. మిమ్మల్ని తిరిగి మీ పూర్వికుల స్థలమైన కనానుకు తిరిగి తీసుకెళ్తారు.
“యోసేపు ఫలించే కొమ్మ, నీటిబుగ్గ దగ్గర ఫలించే కొమ్మ దాని తీగెలు గోడ మీదికి ఎక్కి ప్రాకుతాయి.
నీ తండ్రి ఆశీర్వాదాలు పురాతన పర్వత ఆశీర్వాదాల కంటే, ప్రాచీన కొండల యొక్క కోరదగిన వాటికంటే గొప్పవి. ఇవన్నీ యోసేపు తలమీద, తన సోదరులలో అధికారిగా ఉన్న వాడిపై ఉండాలి.
యోసేపు తన తండ్రి మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు.
తర్వాత తన తండ్రి ఇశ్రాయేలు శవాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరచమని వైద్యులకు ఆదేశించాడు.