కంటెంట్‌కు వెళ్లండి

David

968 వచనాలు · 40 కుటుంబ సభ్యులు

David ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు నేను యాకోబు నా సేవకుడైన దావీదుల సంతతిని తిరస్కరించి ఉండేవాన్ని, అబ్రాహాము, ఇస్సాకు యాకోబుల సంతతివారిని పరిపాలించడానికి అతని కుమారులలో ఒక్కరిని కూడా ఎన్నుకోను. ఎందుకంటే నేను చెర నుండి వారిని తిరిగి రప్పించి, వారిపై కనికరం చూపుతాను.’ ”

  2. కాబట్టి యూదా రాజైన యెహోయాకీమును గురించిన యెహోవా వాక్కు ఇదే: దావీదు సింహాసనం మీద కూర్చోడానికి నీకు ఎవరూ ఉండరు, అతని శవం పగలు ఎండలో రాత్రి మంచులో పడి ఉంటుంది.

  3. వాటిని మేపడానికి నేను నా సేవకుడైన దావీదును కాపరిగా నియమిస్తాను. అతడు వాటిని కాస్తాడు; అతడు వాటిని మేపుతాడు, వాటికి కాపరిగా ఉంటాడు.

  4. యెహోవానైన నేను వారికి దేవునిగా ఉంటాను, నా సేవకుడైన దావీదు వాటికి అధిపతిగా ఉంటాడు. యెహోవానైన నేను మాట చెప్పాను.

  5. “ ‘నా సేవకుడైన దావీదు వారికి రాజు. వారందరికి ఒకే కాపరి ఉంటాడు. వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, నా శాసనాలను పాటించే విషయంలో వారు జాగ్రత్త వహిస్తారు.

  6. నా సేవకుడైన యాకోబుకు నేనిచ్చిన దేశంలో అనగా మీ పూర్వికులు నివసించిన దేశంలో వారు నివసిస్తారు. వారు వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు అక్కడ నిత్యం నివసిస్తారు. నా సేవకుడైన దావీదు వారికి శాశ్వతమైన అధిపతిగా ఉంటాడు.

  7. తర్వాత ఇశ్రాయేలీయులు తిరిగివచ్చి, తమ దేవుడైన యెహోవాను, తమ రాజైన దావీదును వెదుకుతారు. చివరి రోజుల్లో యెహోవా దగ్గరకు, ఆయన దీవెనలు దగ్గరకు వారు వణకుతూ వస్తారు.

  8. మీరు దావీదులా సితారా వాయిస్తూ వాయిద్యాలు మెరుగుపరుస్తారు.

  9. “ఆ రోజున, “పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి కడతాను, నేను దాని విరిగిన గోడలను మరమ్మత్తు చేసి, దాని శిథిలాలను తిరిగి నిర్మిస్తాను, మునుపు ఉండినట్లుగా దాన్ని తిరిగి కడతాను.

  10. “దావీదు వంశీయులకు యెరూషలేము నివాసులకు ఉన్న ఘనత యూదా వారికంటే గొప్పది కాకుండా యెహోవా మొట్టమొదట యూదా వారి నివాస స్థలాలను రక్షిస్తారు.

  11. ఆ రోజున, యెహోవా యెరూషలేములో నివసించేవారిని కాపాడతారు, అప్పుడు వారిలో బలహీనులు దావీదులా, దావీదు వంశీయులు దేవుని వంటివారిగా, వారి ముందు నడిచే యెహోవా దూతలా ఉంటారు.

  12. “అప్పుడు దావీదు వంశీయుల మీద యెరూషలేము నివాసుల మీద కనికరంగల ఆత్మను విన్నపం చేసే ఆత్మను కుమ్మరిస్తాను. వారు తాము పొడిచిన నన్ను చూసి, ఒకరు తన ఒక్కగానొక్క బిడ్డ కోసం విలపించినట్లు, తన మొదటి కుమారుని కోసం దుఃఖపడునట్లు, ఆయన విషయంలో దుఃఖిస్తూ విలపిస్తారు.

  13. దేశ ప్రజలంతా ఏ వంశానికి ఆ వంశంగా తమ భార్యలతో పాటు రోదిస్తాయి: దావీదు రాజవంశీయులు వారి భార్యలు, నాతాను వంశీయులు వారి భార్యలు,

  14. “ఆ రోజున పాపాన్ని అపవిత్రతను శుభ్రం చేసుకోవడానికి దావీదు వంశీయులకు, యెరూషలేము నివాసులకు ఒక నీటి ఊట తెరవబడుతుంది.

  15. ఇది అబ్రాహాము సంతానమైన దావీదు సంతానం నుండి వచ్చిన క్రీస్తు యేసు వంశావళి:

  16. రాజైన దావీదు యెష్షయి కుమారుడు. దావీదు కుమారుడు సొలొమోను; అతని తల్లి అంతకుముందు ఊరియాకు భార్య.

  17. ఈ విధంగా అబ్రాహాము నుండి దావీదు వరకు పద్నాలుగు తరాలు, దావీదు నుండి బబులోను చెరకు కొనిపోబడిన కాలం వరకు పద్నాలుగు తరాలు, చెరకు కొనిపోబడినప్పటి నుండి క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు.

  18. అతడు ఇలా ఆలోచిస్తూ ఉండగా, కలలో ప్రభువు దూత అతనికి కనపడి, “దావీదు కుమారుడవైన యోసేపూ, మరియను నీ భార్యగా ఇంటికి తీసుకెళ్లడానికి భయపడకు. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ మూలంగా గర్భం ధరించింది.

  19. అక్కడినుండి యేసు వెళ్తున్నప్పుడు ఇద్దరు గ్రుడ్డివారు, “దావీదు కుమారుడా! మమ్మల్ని కరుణించు” అని కేకలువేస్తూ ఆయనను వెంబడించారు.

  20. అందుకు ఆయన వారితో, “దావీదుకు అతనితో ఉన్నవారికి ఆకలి వేసినప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా?

  21. కాబట్టి ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఈయనే దావీదు కుమారుడా?” అని చెప్పుకొన్నారు.

  22. అక్కడ నివసించే ఒక కనాను స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి, “ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు! నా కుమార్తెకు దయ్యం పట్టి చాలా బాధపడుతోంది” అని కేకలు వేసింది.

  23. దారి ప్రక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని, “ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు!” అని బిగ్గరగా కేకలు వేశారు.

  24. ఆ జనసమూహం వారిని గద్దించారు, నిశ్శబ్దంగా ఉండమని వారికి చెప్పారు, కాని వారు, “ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు!” అని ఇంకా గట్టిగా కేకలు వేశారు.

  25. ఆయన ముందు వెళ్లే జనసమూహం ఆయనను వెంబడించేవారు బిగ్గరగా, “దావీదు కుమారునికి హోసన్నా!” “ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!” “సర్వోన్నతమైన స్థలాల్లో హోసన్నా!” అని కేకలు వేశారు.