కంటెంట్‌కు వెళ్లండి

David

968 వచనాలు · 40 కుటుంబ సభ్యులు

David ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ప్రభువా, మీ నమ్మకత్వంతో మీరు దావీదుకు వాగ్దానం చేసి మీరు మొదట చూపిన ఆ మారని ప్రేమ ఎక్కడ?

  2. దావీదు కీర్తన. యెహోవా మీకు స్తుతిగానం చేస్తాను; మీ మారని ప్రేమను న్యాయాన్ని గురించి పాడతాను.

  3. దావీదు కీర్తన. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు; నాలోని సమస్తమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.

  4. ఒక గీతము. దావీదు కీర్తన. ఓ దేవా, నా హృదయం స్థిరంగా ఉంది; నా ప్రాణమంతటితో నేను పాడతాను సంగీతం వాయిస్తాను.

  5. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన నేను స్తుతించే, నా దేవా, మౌనంగా ఉండకండి,

  6. దావీదు కీర్తన. యెహోవా నా ప్రభువుతో చెప్పిన మాట: “నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా చేసే వరకు నీవు నా కుడిచేతి వైపున కూర్చో.”

  7. దావీదు యాత్రకీర్తన. “యెహోవా ఆలయానికి వెళ్దాం” అని నాతో అన్న వారితో నేను సంతోషించాను.

  8. అక్కడ తీర్పు కొరకైన సింహాసనాలు ఉన్నాయి, అవి దావీదు ఇంటివారి సింహాసనాలు.

  9. దావీదు యాత్రకీర్తన. మనుష్యులు మనపై దాడి చేసినప్పుడు వారి కోపం మనపై రగులుకొన్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే వారు మనల్ని సజీవంగానే మ్రింగివేసేవారు; వరద మన మీదుగా పొర్లి ఉండేది, జలప్రవాహం మనల్ని ముంచేసి జలప్రవాహాల పొంగు మనల్ని తుడిచిపెట్టి ఉండేది అని ఇశ్రాయేలు చెప్పును గాక.

  10. దావీదు యాత్రకీర్తన. యెహోవా, నా హృదయం గర్వం కలిగిలేదు, నా కళ్లు అహంకారం కలిగిలేవు. నేను గ్రహించలేని గొప్ప విషయాలను నాకు అసాధ్యమైన విషయాలను నేను పట్టించుకోను.

  11. యాత్రకీర్తన. యెహోవా, దావీదును, అతనికి కలిగిన అన్ని బాధలను జ్ఞాపకము చేసుకోండి.

  12. మీ సేవకుడైన దావీదు నిమిత్తం, మీ అభిషిక్తుని తిరస్కరించకండి.

  13. యెహోవా దావీదుకు ఇలా ప్రమాణం చేశారు, అది నమ్మదగింది, ఆయన మాట తప్పనివారు: “మీ సంతానంలో ఒకనిని మీ సింహాసనం మీద కూర్చోబెడతాను.

  14. “అక్కడ దావీదుకు కొమ్ము మొలిచేలా చేస్తాను నా అభిషిక్తుని కోసం ఒక దీపం సిద్ధపరుస్తాను.

  15. దావీదు యాత్రకీర్తన సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు! ఎంత మనోహరం!

  16. దావీదు కీర్తన. యెహోవా, నా పూర్ణహృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను; “దేవుళ్ళ” ఎదుట నేను మీకు స్తుతులు పాడతాను.

  17. ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన. యెహోవా మీరు నన్ను పరిశోధించారు, మీరు నన్ను తెలుసుకొన్నారు.

  18. ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన. యెహోవా, కీడుచేసే మనుష్యుల నుండి నన్ను రక్షించండి; హింసించేవారి నుండి నన్ను కాపాడండి,

  19. దావీదు కీర్తన. యెహోవా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, నా దగ్గరకు త్వరగా రండి; నా స్వరాన్ని ఆలకించండి.

  20. దావీదు యొక్క ధ్యానకీర్తన; గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. నేను గొంతెత్తి యెహోవాకు ఆక్రందన చేస్తున్నాను; దయ కోసం యెహోవాకు కంఠమెత్తి ప్రాధేయపడుతున్నాను.

  21. దావీదు కీర్తన. యెహోవా, నా ప్రార్థన వినండి; దయ కోసం నేను చేసే మొరను ఆలకించండి; మీ నమ్మకత్వం నీతిని బట్టి నాకు జవాబివ్వండి.

  22. దావీదు కీర్తన. నా కొండయైన యెహోవాకు స్తుతి కలుగును గాక, యుద్ధము కోసం నా చేతులకు శిక్షణ, నా వ్రేళ్ళకు పోరాటం నేర్పారు.

  23. రాజులకు విజయమిచ్చేది, మీ సేవకుడైన దావీదును రక్షించేది మీరే. భయంకరమైన ఖడ్గము నుండి

  24. దావీదు వ్రాసిన స్తుతికీర్తన. నా దేవా, నా రాజా! మిమ్మల్ని ఘనపరుస్తాను. మీ నామాన్ని ఎప్పటికీ స్తుతిస్తాను.

  25. దావీదు కుమారుడును ఇశ్రాయేలీయులకు రాజునైన, సొలొమోను యొక్క సామెతలు: